హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodali Nani: జూనియర్ ఎన్టీఆర్ పై తిట్లకు కారణం అదే..? తనను హత్య చేసే కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు

Kodali Nani: జూనియర్ ఎన్టీఆర్ పై తిట్లకు కారణం అదే..? తనను హత్య చేసే కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు

జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని (file)

జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని (file)

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని మళ్లీ ఫాంలోకి వచ్చేశారు. కొన్ని రోజులు మౌనంగా ఉన్న ఆయన.. చంద్రబాబు, లోకేష్ లపై మళ్లీ విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆయన సంచలన ఆరోపణలు చేశారు.. ఏమన్నారంటే?

  • News18 Telugu
  • Last Updated :
  • Gudivada, India

Kodali Nani on Chandrababu Naidu and Jr NTR:  గత కొన్ని రోజుల నుంచి సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani).. మళ్లీ నోటికి పని చెబుతున్నారు. తనదైన స్టైల్లో తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party), ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పైనా.. టీడీపీ పైనా సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల సీఎం జగన్ సీరియస్ అవ్వడంతో మళ్లీ గడపగడపకు ప్రభుత్వంపై నాని ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా గుడివాడ 33వ వార్డులో గడపగడప మన ప్రభుత్వం (Gadapa Gadapaku Government) రెండో రోజు కార్యక్రమంలో కొడాలి నాని (YCP MLA) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అస్తమించిన వ్యవస్థ టీడీపీ (TDP) అని... ఆ పార్టీ డిఫాల్డర్లు నోటికొచ్చినట్లు వాగుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ నేతలు, అభిమానుల తిట్లకు కారణం ఇదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నారా లోకేష్‌ (Nara lokesh)కు పార్టీని పూర్తిగా అప్పచెప్పాలన్నదే చంద్రబాబు నాయుడు లక్ష్యం అన్నారు. కానీ ఆ పార్టీ అభిమానులు.. చాలామంది నేతలు మాత్రం.. అందుకు సిద్ధంగా లేరని.. వారంతా జూనియర్ ఎన్టీఆర్ పగ్గాలు చేపట్టాలని కోరుకుంటున్నారని.. అందుకే ఆ కోపంతోనే చంద్రబాబు నాయుడే.. అమరావతి రైతుల పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్‌ (Junior NTR)ను తిట్టిస్తున్నారన్నారని ఆరోపించారు. అమరావతిలో టీడీపీ వాళ్ళు చేసిన రియల్ ఎస్టేట్ మాఫియా, విశాఖలో కూడా జరుగుతునట్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

కేవలం 29 గ్రామాల అమరావతి ఎక్కడ, 25 లక్షల జనాభా గల విశాఖ ఎక్కడ అని కోడాలి నాని ప్రశ్నించారు. విశాఖ నగరంపై టీడీపీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు విషం కక్కుతున్నారని ఆయన దుయ్యబట్టారు. 30 లక్షలు ఉన్న అమరావతి భూములు 10 కోట్ల రూపాయలకు పెరిగాయన్నారు. రాజధాని నిర్ణయం తర్వాత గజాలు లెక్కన విక్రయాలు జరిగే విశాఖ భూముల ధరల్లో ఏం మార్పు వచ్చిందని ప్రశ్నించారు. విశాఖ దసపల్లా భూముల్లో టిడిపి ఆఫీసు, చంద్రబాబు అనుయాయుల కార్యాలయాలు ఉన్నాయన్నారు.

ఇదీ చదవండి : సైజుతో సంబంధం లేకుండా సెగలు పుట్టిస్తోంది..? బంగారంతో పోటీ పడుతున్న పులస

ఈ సందర్భంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (Vijayasai reddy)కి ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. కావాలనే టీడీపీ నేతలు, ఓ వర్గం మీడియా ఆయనపై అసత్యాలు ప్రసారం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ ఆస్తి అయిన రిషికొండలో ప్రభుత్వ కార్యాలయాలు కడుతుంటే దోపిడీ ఎలా అవుతుందని అన్నారు. ఒక అబద్ధాన్ని చంద్రబాబు (Chandrababu naidu), పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంటూ కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతే కాదు తాను చంద్రబాబు నాయుడు కుట్రలపై నిజాలు చెబుతుండడంతో.. తనను హత్య చేయించే ప్రయాత్నాలు చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి అన్నారు. అయినా తాను దేనికి భయపడేది లేదన్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, Jr ntr, Kodali Nani

ఉత్తమ కథలు