ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఇటీవల హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గం గన్నవరం. గన్నవరం (Gannavaram) వైసీపీ (YSRCP) లో నెలకొన్న వర్గపోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. సీఎం జగన్ (CM YS Jagan), సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Rama Krishna Reddy) సహా ముఖ్యనేతలు జోక్యం చేసుకున్నా గన్నవరం గరంగరంగానే ఉంది. ఎమ్మెల్యే వల్లభవనేని వంశీ (Vallabhaneni Vamsi).. పార్టీ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దుట్టా, యార్లగడ్డ వర్గాలు వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. వంశీ ఒక్కరే ఇద్దరితోనూ పొలిటికల్ ఫైట్ చేస్తున్నారు. దీంతో గన్నవరం రాజకీయం హీటెక్కింది. ఈ నేపథ్యంలో గన్నవరం వైసీపీ ప్లీనరీ సమావేశానికి హాజరైన మంత్రి కొడాలి నాని.. సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో గన్నవరం వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఇందులో మరోమాట లేదన్నారయన.
అంతేకాదు కొంతమంది నేతలు పెనమలూరు టీడీపీ టికెట్ కోసం వెళ్తే.. గన్నవరం, గుడివాడకు వెళ్తారా అని అడగాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రెండు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే దొరకని పరిస్థితి నెలకొందన్నారు. గన్నవరం, గుడివాడలో తమను ఓడించే నాయకులు టీడీపీకి లేరని కొడాలి నాని అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు తన తండ్రిపేరు చెప్పుకోలేడన్నారు. ఎన్టీఆర్ కు జయంతులు, వర్ధంతులు, పెళ్లిరోజులు చేసే చంద్రబాబు తండ్రిని పట్టించుకోలేదన్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని ఒక్కమాటంటే వెక్కివెక్కి ఏడ్చిన చంద్రబాబు.. తండ్రి ఖర్జూరనాయుడుని ఎన్నిమాటలన్నా పట్టించుకోలేదని విమర్శించారు. మామ ఎన్టీఆర్ కే కాదు అవకాశం కోసం ఎవరికైనా వెన్నుపోటు పొడిచే వ్యక్తి చంద్రబాబుని విరమర్శించారు.
ఇది చదవండి: గ్రామ సచివాలయాల్లో పెళ్లి సందడి.. పిల్లనిచ్చేందుకు పోటీ..
ఇక కొడాలి నాని వ్యాఖ్యలతో గన్నవరం వైసీపీలో కలకలం మొదలైంది. వంశీని వ్యతిరేకిస్తున్న దుట్టా, యార్లగడ్డ వర్గాల్లో కలవరం మొదలైంది. ఇటీవల ఒకేరోజు అటు వంశీ, అటు యార్లగడ్డ, దుట్టా ఘాటైన విమర్శలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారం ఏకంగా సీఎం దగ్గరకు చేరడంతో ఆయన కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సీఎం జగన్.. వంశీకి అనుకూలంగానే ఉన్నా.. మిగిలిన రెండు వర్గాలు మాత్రం ముఖ్యమంత్రి మాటను లెక్కచేయడం లేదు. వంశీతో కలిసి నడవాలని అధిష్టానం సూచిస్తున్నా.. తమ వల్లకాదని తేల్చిచెప్తున్నారు. వైసీపీలోనే ఉంటామని.. అదే వంశీ వైసీపీ తరపున పోటీ చేస్తే ఆయన్ను ఓడిస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో గన్నవరం వైసీపీ ప్లీనరీలో కొడాలి నాని చేసిన కామెంట్స్ మరోసారి చర్చనీయాంశమయ్యాయి. వంశీ లేకపోయినా తన చేతులమీదుగానే ప్లీనరీని నిర్వహించిన ఆయన.. గన్నవరం విషయంపై తేల్చేశారు. విభేదాలుంటే సీఎం జగన్ పిలిచి మాట్లాడతారంటూ కొడాలి నాని తేల్చిచెప్పారు. మరి కొడాలి నాని కామెంట్స్ పై దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kodali Nani, Vallabhaneni vamsi, Ysrcp