Kodali Nani: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు వేడెక్కాయి. మాటల యుద్ధం పీక్ కు చేరింది. పొత్తులపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా.. జనసేన-టీడీపీ (Janasena-TDP) కలిసే ఎన్నికలకు వెళ్తున్నాయని అంతా ఫిక్స్ అయ్యారు. అందుకే అధికార పార్టీ నేతలు.. ఇప్పుడు ఉమ్మడి కూటమి టార్గెట్ గానే విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మొన్నటి వ్యాఖ్యల దూమారం ఇంకా ఆగలేదు. వరుసగా మంత్రులు ఎదురు దాడి చేస్తూనే ఉన్నారు. ఇక మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) వరుసగా మూడు రోజుల నుంచి మాటల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్, చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) అంటే పిల్లి అనుకున్నారా..? పులి అంటూ కౌంటర్ ఇచ్చారు. ఒక్కొక్కరిగా కాదు.. అందరూ కట్టకట్టుకొని వచ్చినా.. పవన్ చంద్రబాబు కలిసి పోటీ చేసినా..? వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పక బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు.
రాజధాని పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడిస్తున్నాడన్నారు. వికేంద్రీకరణ నిర్ణయంపై పవన్ కళ్యాణ్ తో జగన్ ను చంద్రబాబు తిట్టిస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ పనికిమాలినవాడు కాబట్టే పక్కపార్టీలతో చంద్రబాబు తిట్టిస్తున్నాడని మండిపడ్డారు.
ఎమ్మెల్యేగా గెలవలేని చవట దద్దమ్మ లోకేష్ అంటూ కొడాలి నాని తిట్ల దండకం అందుకున్నారు. జయంతికి, వర్ధంతికి కూడ లోకేష్ కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఏపీలో మూడు రాజధానులపై చర్చ జరగవద్దనే టీడీపీ ఇలా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. అమరావతి పాదయాత్రను స్థానికులు అడ్డుకుంటే అది దారుణమా అని ఆయన ప్రశ్నించారు.
ఇదీ చదవండి : పవన్ నాలుగో పెళ్లి లోపు.. పోలవరం పూర్తి.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
మరి గతంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవాలని టీడీపీ నేతలకు కొడాలి నాని సూచించారు. అమిత్ షా తిరుపతిలో దైవ దర్శనం కోసం వచ్చిన సమయంలో ఆయన కాన్వాయ్ పై దాడి చేయించింది చంద్రబాబు కాదా అని కొడాలి నాని ప్రశ్నించారు. మోదీ పర్యటన సమయంలో ఆయనకు వ్యతిరేకంగా నల్లబెలూన్లు ఎగురవేసింది ఎవరో చెప్పాలన్నారు.
ఇదీ చదవండి: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. నేటి నుంచి పైసా ఖర్చు లేకుండా అన్ని ఆరోగ్య సేవలు
విశాఖలో జగన్ పర్యటనకు వెళ్లినప్పుడు ఎలా అడ్డుకున్నారో గుర్తుకు లేదా అని కొడాలి నాని ప్రశ్నించారు. ఏడాది పాటు రోజాను అసెంబ్లీలోకి రాకుండా సస్పెండ్ చేసిన విషయాన్ని టీడీపీ నేతలు మరిచిపోయారా అని ప్రశ్నించారు. ఈ విషయాలను చంద్రబాబు నాయుడు మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదన్నారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోలేదా అని నిలదీశారు. తప్పులన్నీ మీరు చేసి.. ఇప్పుడు జనగ్ పై ఏడిస్తే ఎలా అని ప్రశ్నించారు. కాపులు అంటూ గోల చేసిన పవన్ కళ్యాణ్.. గత ప్రభుత్వం హయాంలో కాపు నేత అయిన ముద్రగడ పద్మనాభాన్ని ఎలా అవమానించారో మరిచిపోయారా అని ప్రశ్నించారు. పిల్లనిచ్చిన మామాను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Kodali Nani, Pawan kalyan