Breaking News: ఊహించిందే జరిగింది.. ఎప్పటి నుంచో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ.. సొంత పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakhsmi Narayana) బీజేపీ (BJP) కి బైబై చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) కు రాజీనామా లేఖ సమర్పించారు. అయితే తాను పార్టీ వీడడానికి ప్రధాన కారణం కూడా వివరించారు.. ముఖ్యంగా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు (Somu verraju) తీరు కారణంగానే పార్టీని వీడాల్సి వచ్చిందని పరోక్షంగా చెప్పారు. అలాగే బీజేపీ ఎంపీ జీవీఎల్ (MP GVL) తీరుపైనా విమర్శలు చేశారు. ఆ విమర్శల సంగతి పక్కన పెడితే.. కన్నా భవితవ్యం ఏంటి అన్నదానిపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే గత కొంత కాలంగా ఆయన జనసేన పార్టీలో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. ఇటీవల ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో ప్రత్యేకంగా సమావేశం కూడా అయ్యారు. దీంతో కన్నా జనసేనలో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆయన టీడీపీలో చేరుతున్నట్టు అనుచురలకు చెప్పినట్టు తెలుస్తోంది.
గత పది రోజుల క్రితం కన్నా లక్ష్మీ నారాయణతో టీడీపీ నేతలు హైదరాబాద్ లో సమావేశం అయినట్టు తెలుస్తోంది. వారితో భేటీ సమయంలోనే టీడీపీలో చేరాలని కన్నా నిర్ణయం తీసుకున్నట్టు టాక్.. ఈ నెల 23 లేదా25వ తేదీల్లో కన్నా అధికారికంగా చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఆయన ముందుగా జనసేనలో చేరాలి అనుకున్నప్పటికీ.. ఇప్పటి వరకు టీడీపీ, జనసేన పొత్తుపై క్లారిటీ రాకపోవడంతో.. మనసు మార్చుకున్నారని అనుచరుల ద్వారా తెలుస్తోంది. అయితే ఆయన జనసేన లో జాయిన్ అయినా.. టీడీపీలో ఉన్నా.. సత్తెనపల్లి సీటు ఆశిస్తున్నారు. తన మనసులో మాట టీడీపీ నేతలకు చెప్పారని.. దానికి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. సైకిల్ ఎక్కేందుకు కన్నా డిసైడ్ అయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతున్నారు అన్నదానిపై నేడు.. లేదా రేపు అధికారకంగా కన్నానే ప్రకటించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి : వైసీపీలో మొదటి, చివరి టాప్ 10 ఎమ్మెల్యేలు ఎవరో తెలుసా..? సీఎం జగన్ ఏం చెప్పారంటే..?
మరోవైపు కన్నా పార్టీ మారడంతో బీజేపీ పెద్దలు సైతం అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా కాపు సంఘాల నేతలు పార్టీకి దూరం అవ్వకుండా ఉండే చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా.. ఓ వైపు కన్నా.. తన అనుచరులతో సమావేశం అవ్వగానే.. పార్టీకి చెందిన కీలక కాపు నేతలతో ఎంపీ జీవీఎల్ సమావేశమయ్యారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Bjp, Kanna Lakshmi Narayana, TDP