AP POLITICS EX MINISTER GANTA SRINIVASA RAO SHOCKS TDP LEADERS BY ENTERING VIZAG PARTY OFFICE AFTER LONG TIME FULL DETAILS HERE PRN
AP Politics: కార్యకర్తలను ఆశ్చర్యపరిచిన టీడీపీ ఎమ్మెల్యే.. ఆ ఆలోచన విరమించుకున్నట్లేనా..?
టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో గంటా శ్రీనివాసరావు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ (TDP). పేరుకే ప్రతిపక్షం కానీ చెప్పుకోదగ్గ సీట్లు రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న ఆ పార్టీ కేవలం 23 సీట్లకే పరమితమైంది. వారిలో కొందరు పార్టీకి దూరంగా ఉంటూ సీఎం జగన్ (CM YS Jagan) కు మద్దతిచ్చారు. మిగిలిన వారిలో అతికొద్ది మందే పార్టీని అంటిపెట్టుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ (TDP). పేరుకే ప్రతిపక్షం కానీ చెప్పుకోదగ్గ సీట్లు రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న ఆ పార్టీ కేవలం 23 సీట్లకే పరమితమైంది. వారిలో కొందరు పార్టీకి దూరంగా ఉంటూ సీఎం జగన్ (CM YS Jagan) కు మద్దతిచ్చారు. మిగిలిన వారిలో అతికొద్ది మందే పార్టీని అంటిపెట్టుకుంటున్నారు. ముఖ్యమైన నేతలు గెలిచినా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. అలాంటి వారిలో మాజీ మంత్రి, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఒకరు. ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన మాత్రం పార్టీకి దూరంగానే ఉంటున్నారు. జిల్లా సమీక్షా సమావేశాలకు పిలిచినా.. గంటా హాజరుకాలేదు. పైగా చంద్రబాబుతో మాట్లాడతానంటూ రిప్లై కూడా ఇచ్చిన సందర్భాలున్నాయి.
రెండున్నరేళ్లుగా గంటా శ్రీనివాసరావు పార్టీ కార్యకలపాల్లో కనిపించడం లేదు. ఎప్పుడైనా ఒకసారి కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. అంతకుమించి ఆయన టీడీపీలో యాక్టివ్ గా లేరు. కొంతకాలంగా ఆయన వైసీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ వెళ్లలేదు. కొన్నాళ్లు బీజేపీ, ఆ తర్వాత జనసేన పేర్లు కూడా వినిపించినా అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి. స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసి సంచలన సృష్టించిన గంటా.. పొలిటికల్ గా అటెన్షన్ సాధించుకున్నారు. ఆ తర్వాత కాపు నాయకులతో భేటీలు నిర్వహిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల గంటా చేసిన పని తెలుగుదేశం నాయకుల్లో ఉత్సాహాన్ని నింపింది. మార్చి 29న టీడీపీ ఆవిర్భావదినోత్సం జరిగింది. పార్టీ ఏర్పడి 40ఏళ్లు పూర్తైన సందర్భంగా నాయకులు, కార్యకర్తలు వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో గంటా శ్రీనివాసరావు కూడా పాల్గొని అందరికీ ఆశ్చర్యంలో మంచెత్తారు. చాలా కాలం తర్వాత ఆయన విశాఖ పార్టీ కార్యాలయానికి వచ్చి ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.
ఇన్నాళ్లూ గంటా వంటి నేత అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటంతో విశాఖ టీడీపీలో నిస్తేజం నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ఇతర పార్టీ ఈవెంట్లలో ఆయన కనిపించకపోవడంతో నియోజకవర్గ నేతలు కూడా ఉత్సాహంగా రాని పరిస్థితి. ఇప్పుడాయన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనడంటో ఇక చురుగ్గా ఉండబోతున్నారన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే పలు పార్టీలతో చర్చలు జరిపారన్న టాక్ వినిపిస్తుండటంతో ఆయన టీడీపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విశాఖలో టీడీపీ బలంగా ఉండటం, ఓటు బ్యాంకు చెదరకుండా కొనసాగుతుండటంతో ఆయన సైకిల్ దిగే యోచనను విరమించుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ కు లేఖ రాయిన ఆయన.. అందుకోసం కోర్టుకు సైతం వెళ్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.