Home /News /andhra-pradesh /

AP POLITICS EX MINISTER DL RAVEENDRA REDDY MADE SENSATIONAL COMMENTS ON YS JAGAN AND YS AVINASH REDDY IN YS VIVEKANANDA REDDY MURDER CASE FULL DETAILS HERE PRN GNT

YS Viveka Muder Case: వివేకా హంతకులెవరో పులివెందులలో అందరికీ తెలుసు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

వైఎస్ వివేకా (ఫైల్)

వైఎస్ వివేకా (ఫైల్)

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) పై ఏపీ రాజకీయాల్లో విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో సీఎం జగన్ (AP CM YS Jagan), ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష టీడీపీ (TDP) ఆరోపణల చేస్తుంటే.. వైసీపీ(YSRCP) కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇస్తోంది.

ఇంకా చదవండి ...
    మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) పై ఏపీ రాజకీయాల్లో విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో సీఎం జగన్ (AP CM YS Jagan), ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష టీడీపీ (TDP) ఆరోపణల చేస్తుంటే.. వైసీపీ(YSRCP) కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంలో కొన్ని సంచలన ఆరోపణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. వివేకా హత్యపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. వివేకాను ఎవరు హత్య చేశారో పులివెందులలో అందరికీ తెలుసంటూ హాట్ కామెంట్స్ చేశారు రవీంద్రా రెడ్డి.

    ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఈ కేసు నుంచి తప్పించుకోలేరని.. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం మంచిది కాదని  డీఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. తనకు సీబీఐ మీద  నమ్మకం ఉందని  ఆయన వ్యాఖ్యానించారు. పాత్రధారులు, సూత్రధారులు జైల్లో ఉన్నారని.., అవినాష్ రెడ్డి హత్య చేశారని తేలితే ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామన్నారన్న సంగతిని గుర్తు చేశారు.

    ఇది చదవండి: వైసీపీలో కేబినెట్ బెర్త్ కోసం పోటాపోటీ.. ఆ జిల్లాలో చాంతాడంత లిస్ట్..


    ఎర్ర గంగిరెడ్డి ఎప్పుడూ వివేకా దగ్గర ఉండేవారన్న రవీంద్రా రెడ్డి.. ఆ రోజు గంగిరెడ్డికి ఫోన్ చేస్తే గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పారని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నుండి దేవిరెడ్డి శంకర్రెడ్డికి ఎర్ర గంగిరెడ్డి టచ్‍లో ఉన్నాని.., వివేకా పీఏ కృష్ణారెడ్డి సైతం శంకర్ రెడ్డికి టచ్‍లో ఉన్నాడు. ఇది తెలియక కృష్ణారెడ్డితో సునీత కంఫ్లైంట్ ఇప్పించారని రవీంద్రా రెడ్డి చెప్పారు. శంకర్ రెడ్డి ఏం చెబితే అది కంప్లైంట్‍లో కృష్ణారెడ్డి రాసిచ్చారని ఆయన ఆరోపించారు.

    ఇది చదవండి: త్వరలో జగనన్న ఓటీటీ..? విద్యార్థులకు ల్యాప్ టాప్ లు.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..


    సునీత, రాజశేఖర్‍ను పక్కన పెట్టుకుని చంద్రబాబు హత్య చేయించారని జగన్ సాక్షిలో నారాసుర రక్త చరిత్ర అని రాయించారని.., సునీత, రాజశేఖర్ చంపారని సాక్షిలో రాయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. కోడికత్తి కేసును అడ్డంపెట్టుకొని జగన్ రాజకీయాలు చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్‍కు డబ్బుతో పనిలేదు, ప్రజలకు సేవ చేస్తారని ఆశించాం కానీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి భిన్నంగా ఉందన్నారు.

    ఇది చదవండి: కేబినెట్ లో కొనసాగేది వీరేనా..? సీఎం జగన్ మనసులో ఏముంది..? ఆ ఇద్దరి పరిస్థితి ఏంటి..?


    ఇక ప్రభుత్వ సలహాదార సజ్జల రామకృష్ణారెడ్డిపై డీఎల్ రవీంద్రా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ సాధారణ విలేఖరి.. వందల కోట్లకు అధిపతి అయ్యారని.. పది మంది అనుచరులతో వసూళ్లకు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు తన కుమారుడితో హైదరాబాద్‍లో పరిశ్రమలు పెట్టిస్తున్నారని విమర్శించారు. వివేకా హత్య కేసులో ఆయన సునీతపై సునీతపై సజ్జల అనవసర ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Kadapa, Ys viveka murder case

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు