హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Devineni Uma: మాజీ మంత్రి దేవినేని ఉమాకు బెయిల్... హైకోర్టులో ఊరట

Devineni Uma: మాజీ మంత్రి దేవినేని ఉమాకు బెయిల్... హైకోర్టులో ఊరట

మీడియాతో మాట్లాడుతున్న దేవినేని ఉమ (ఫైల్)

మీడియాతో మాట్లాడుతున్న దేవినేని ఉమ (ఫైల్)

ఏపీ హైకోర్టులో (AP High Court) మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమాకు (Devineni Uma Maheswara Rao) ఊరట లభించింది.

  టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్ మంజూరైంది. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ పరీశీలకు వెళ్లిన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో ఆయనపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద జి.కొండూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఐతే తనపై అక్రమంగా కేసులు బనాయించారంటూ దేవినేని ఉమా హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ పై బుధవారం విచారణ జరిపిన ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దేవినేని ఉమాకు బెయిల్ మంజూరవడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నేతలు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే ఉమాపై అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపుకు పాల్పడుతోందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ దోపిడీని ప్రశ్నించిన వారిపై కేసుల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  కాగా గత నెల 28వ తేదీన కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ దేవినేని ఉమాతో పాటు పలువురు టీడీపీ నేతలు మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ వైసీపీ నేతలు, కార్యకర్తలు దేవినేని ఉమా వర్గాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ కార్యకర్తలు దేవినేని ఉమా కారుపై రాళ్లు రువ్వారు. ఐతే ఈ వ్యవహారంలో దేవినేని ఉమా కావాలనే అక్కడికి వెళ్లి ఘర్షణ రేపారని పోలీసులు తెలిపారు.

  ఇది చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్... ఇకపై ప్రతి గ్రామంలో హై స్పీడ్ ఇంటర్నెట్…  అనంతరం పోలీసులు దేవినేని ఉమాను అరెస్ట్ ఆయనపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, మరికొన్ని కేసులు నమోదు చేశారు. ఆయన్ను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రెండు వారాల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఐతే జైలులో ఆయనకు ప్రాణహాని ఉందంటూ దేవినేని ఉమా కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై పోలీసులు పెట్టిన కేసులు అక్రమమని.. అలాగే ఆయా సెక్షన్లకు సంబంధించిన నేరాలకు పాల్పడలేదంటూ ఉమా తరపు లాయర్లు హైకోర్టులో వాదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

  ఇది చదవండి: బర్త్ డే పార్టీ పేరుతో అర్ధరాత్రి అమ్మాయిలతో... సీ.ఐ సమక్షంలోనే రచ్చరచ్చ


  ఇదిలా ఉంటే దేవినేని ఉమా వ్యవహారం టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. కొండపల్లిలో అక్రమ మైనింగ్ టీడీపీ హయాంలోనే జరిగిందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. అనుమతులు లేకుండా గ్రావెల్ తరలించి వందల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. ఐతే దీనికి కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేతలు వైఎస్ హయాంలోనే రిజర్వ్ ఫారెస్టులో కొండలను తవ్వేశారని.. ఆ అవినీతికి ఆద్యుడు వైఎస్ఆర్ అని ఆరోపించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP High Court, Devineni Uma Maheswara Rao

  ఉత్తమ కథలు