Home /News /andhra-pradesh /

AP POLITICS EX MINISTER BALINENI SRINIVAS REDDY MADE INTERESTING COMMENTS ON AP CABINET AFTER MEETING CM YS JAGAN FULL DETAILS HERE PRN GNT

Balineni Comments: రాజీనామాపై నోరువిప్పిన బాలినేని.. సీఎంతో భేటీ తర్వాత కీలక వ్యాఖ్యలు..

రాజీనామాపై స్పందించిన బాలినేని

రాజీనామాపై స్పందించిన బాలినేని

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ (AP New Cabinet) తర్వాత అధికార వైసీపీలో సంతృప్తి జ్వాలలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. అసంతృప్త నేతల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి (Minister Balineni Srinivas Raddy) ముందున్నారు. తనను కాదని ఇతర సీనియర్లను కొనసాగించడంపై అలకబూనిన ఆయన.. రాజీనామాకు కూడా సిద్ధపడ్డారన్న ప్రచారం జరిగింది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ (AP New Cabinet) తర్వాత అధికార వైసీపీలో సంతృప్తి జ్వాలలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. అసంతృప్త నేతల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి (Minister Balineni Srinivas Raddy) ముందున్నారు. తనను కాదని ఇతర సీనియర్లను కొనసాగించడంపై అలకబూనిన ఆయన.. రాజీనామాకు కూడా సిద్ధపడ్డారన్న ప్రచారం జరిగింది. ఇక బాలినేనికి అన్యాయం జరిగిందంటూ పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఏకంగా సీఎం జగన్ (AP CM YS Jagan) కు వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) స్వయంగా బాలినేని ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేసినా ఆయన శాంతించలేదు. ఈ నేపథ్యంలో సీఎ జగన్ స్వయంగా బాలినేనిని క్యాంప్ కార్యాలయానికి పలిపించుకొని మాట్లాడారు. దీంతో ఆయన శాంతించారు. సీఎం జగన్ తో చర్చల అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు.

    జగన్ తో భేటీ తర్వాత పూర్తిగా తన వైఖరి మార్చుకున్న ఆయన... రాజీనామా చేస్తానంటూ వచ్చిన వార్తలను ఖండించారు. అంతేకాదు రాజీనామా చేస్తానంటూ రాసిన వారిపై పరువునష్టం దావా వేస్తానని కూడా ప్రకటించారు. సీఎం తన ఆలోచన ప్రకారమే పదవులు ఇస్తారని.. మంత్రి పదవి కోసం తాను ఎప్పుడూ నేను పాకులాడలేదని స్పష్టం చేసారు. సీఎం జగన్ చెప్పగానే 24 మంది మంత్రులు రాజీనామా చేశామని.. పదవి లేనప్పుడు కొంచెం ఫీల్ అవటం ఎవరికైనా సాధ్యమన్నారు బాలినేని.

    ఇది చదవండి: ఏపీ మంత్రుల చదువు, కెరీర్ వివరాలివే..! బాగా చదువుకున్న మంత్రులు వీళ్లే..!


    తాను వైఎస్సార్ ఫ్యామిలీకి చెందినవాడినని.. అలాంటి తేడాలేవీ ఉండవని క్లారిటీ ఇచ్చారాయన. ఇక ఆదిమూలపు సురేష్ కి మంత్రి పదవి ఇస్తే తాను అలిగానని రాయడం సరికాదన్నారు. సురేష్, నేను కలిసి ఆ క్యాబినెట్ లో పనిచేశామని.., ఇద్దరం వేర్వేరు శాఖలు నిర్వహించామని.. పార్టీలో సురేష్ ఎప్పుడూ అనవసరంగా జోక్యం చేసుకోలేదని బాలినేని స్పష్టం చేశారు. ఇద్దరం కలిసి పార్టీ అభివృద్ధికి పనిచేస్తామని.., మావాళ్లు కొందరు రాజీనామా లు చేసినా, అవన్నీ వెనక్కి తీసుకుంటామని చెపపారు. సీఎం ఎలాంటి బాధ్యతలు బాప్పగించినా నెరవేర్చుతానన్న బాలినేని.. సీఎం 23న ఒంగోలులో ఒక సమావేశానికి వస్తున్నారని.. దాని గురించి చర్చించినట్లు వివరించారు.

    ఇది చదవండి: సంబరాల్లో మంత్రి రోజా.. భర్తతో కలిసి వేడుకలు.. సీఎంతో సెల్ఫీ..

    కొత్త క్యాబినెట్ లో అందరూ సత్తా ఉన్నవాళ్లేనని.., బీసీ, ఎస్సీలకు ప్రాధాన్యనిచ్చారన్నారు. పార్టీ కుటుంబం లాంటిదని.. అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. పదవులు రానివారు బాధపడవద్దన్న ఆయన.. అందరికీ ఒకేసారి పదవులు ఇవ్వడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Politics, Balineni srinivas reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు