P Bhanu Prasad, News18, Vizianagaram
మాజీ డిప్యూటీ సీఎం, కురుపాం వైసీపీ (YSRCP) ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి (Pushpa Srivani).. ఫైర్ బ్రాండ్ గా మారిపోయారు. మంత్రి పదవి పోయినా.. నియోజకవర్గంలో మాత్రం విస్తృతంగా పర్యటిస్తున్న ఆమె.. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి.. హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. ప్లేస్ మీరు చెప్పినా.. నన్ను చెప్పమన్నా.. ఎక్కడైనా ఎప్పుడైనా అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమని.. నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానంటూ ఛాలెంజ్ చేశారు. 2014 ఎన్నికల్లో 14 వేల మెజారిటీ, 2019 లో 26 వేలకు పైగా మెజారిటీ వచ్చిందని.., రాబోయే ఎన్నికల్లో అంతకు మించిన మెజారిటీతో గెలవబోతున్నా అంటూ ధీమా వ్యక్తం చేశారు. మీరు ఎన్ని విమర్శలు చేసుకుంటారో చేసుకోండంటూ సవాల్ విసిరారు.
ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు పట్టించుకోనని, తానేంటో నియోజకవర్గ ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు తెలుసునంటూ జాతకాన్ని రెండేళ్ల ముందే ప్రకటించుకున్నారు. కురుపాం లో జరిగిన పార్టీ నియోజకవర్గ ప్లీనరీలో నాయకులు, కార్యకర్తల మధ్య ఈ ప్రకటన చేసారు. ఇక తనపై కొందరు టీడీపీ నేతలు సహా మరికొందరు చేస్తున్న అవినీతి ఆరోపణలను రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానంటూ సవాల్ విసురుతున్నారు.
మును పెన్నడూ లేని విధంగా కురుపాం నియోజకవర్గంలో సుమారు 800 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, తాను ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎం జగన్ అండతో నియోజకవర్గాన్ని అభివ్ళద్ది చేయగలుగామన్నారు. అయినా కొందరు నాయకులు తమపై చౌకబారు ఆరోపణలు చేస్తూ కాలం వెల్లబుచ్చుతున్నారంటూ మండిపడ్డారు. మహిళనని కూడా చూడకుండా కొందరు నాపై విచక్షణా రహితంగా ఆరోపణలు చేస్తున్నారని, గడప గడపకు మేము వెళ్తుంటే కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
నియోజకవర్గంలో 150 కోట్లతో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చామని, మరికొద్ది రోజుల్లో ఆ పనులు పూర్తవుతాయని, భద్రగిరి ఆసుపత్రి నుంచి సుమారు 9 కోట్ల రూపాయలు, కురుపాం ఆసుపత్రి అభివ్ళద్ది కోసం 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని, ఇలా అనేక అభివ్ళద్ది కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.
మీకున్న కార్యకర్తలతో చిన్న చిన్న ఆటంకాలు కల్పిస్తున్నారని, వేలమంది సైన్యమున్న వైసీపీ కార్యకర్తలకు నేను పిలుపు ఇస్తే.. మా పొలిమేరలకు కూడా మీరు రాలేరంటూ.. టీడీపీ నేతలను ఉద్దేశించి పుష్ఫశ్రీవాణి హెచ్చరించారు. స్ధానిక టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, రానున్న కాలంలో మరింత దీటుగా వాటిని ఎదుర్కొంటామన్నారు. తనకు రూ.500 కోట్ల అక్రమాస్తులున్నాయని ఆరోపిస్తున్నవారు.. రూ.5 కోట్లున్నట్లు నిరూపించినా పాలిటిక్స్ వదిలేస్తానని సవాల్ చేశారామ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.