AB Venkateswara Rao: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఉన్నతాధికారుల మధ్య మరో యుద్ధం మొదలు కానుందా..? తాజాగా సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పు తరువాత ఎలాంటి పరిణమాలు చోటు చేసుకోనున్నాయి. గతంలో టీడీపీ (TDP) సర్కార్ హయాంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత వైసీపీ (YCP) సర్కార్ హయాంలో సస్పెన్షన్ కు గురైన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు (AB Venkateswara Rao) సుప్రీంకోర్టు తీర్పు భారీ ఊరట కలిగించింది. ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ఉంటూ ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు కొన్నారని ఆరోపిస్తూ వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఇవాళ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై రెండేళ్లకు పైగా కొనసాగుతున్న సస్పెన్షన్ ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ తీర్పు తర్వాత రిలాక్సెడ్ గా కనిపించిన ఏబీ.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కార్ ను ఓ రేంజ్ లో టార్గెట్ చేశారు. ఏ కళ్లలో ఆనందం చూడటానికి ఇదంతా చేసారంటూ ఆయన ప్రశ్నించారు.
మొద్దు సీను డైలాగ్ ను వాడేసిన ఏబీ.. గతంలో టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మొద్దు శీను తన బావ కళ్లల్లో ఆనందం కోసమే ఈ హత్య చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు కూడా అదే డైలాగ్ వాడుతూ..ఏ బావ కళ్లల్లో ఆనందం కోసం ఇదందా చేశారంటూ జగన్ సర్కార్ ను ప్రశ్నించారు. తనకు చట్టపరంగా ఉన్న అవకాశాలు వాడుకున్నానని, తన వాదనను హైకోర్టు, సుప్రీంకోర్టు మన్నించాయని ఏబీ తెలిపారు. ఇవాళ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో ఓడిపోవడానికి కారకులెవరంటూ ఏబీ ప్రశ్నించారు. ఏ సైకో ఆనందం కోసం ఇదంతా చేశారంటూ అధికారుల్ని ఆయన ప్రశ్నించారు.
అక్కడితో ఆగని ఆయన.. తనపై మోపిన అభియోగాలపై కోర్టులో వాదించేందుకు సీనియర్ న్యాయవాది ప్రకాశ్ రెడ్డికి ఫీజుగా 20 లక్షల రూపాయలు చెల్లించిందని, దీనిపై జీవో కూడా ఇచ్చారని ఏపీ అన్నారు. ఆ తరువాత కేసు హైకోర్టుకు చేరిందని, అక్కడా భారీగా ఖర్చుపెట్టారన, చివరికి సుప్రీంకోర్టులో ఈ కేసు వాదనల కోసం టీమ్ ను పెట్టుకుని మరీ కోట్లు ఖర్చు పెట్టారని ఏబీ ఆరోపించారు. అలాగే తనకూ కొంత ఖర్చయిందని, ప్రభుత్వం ఈ కేసులో పెట్టిన ఖర్చుకు సమానంగా తనకూ కోర్టు ఫీజు చెల్లించాలని ఏబీ వెంకటేశ్వరరావు కోరారు. ఇదే విషయాన్ని త్వరలో ప్రభుత్వాన్ని కోరతానన్నారు. ఆ తప్పుడు రిపోర్ట్ వల్లే సస్పెన్షన్ తన సస్పెన్షన్ కు దారి తీసిన ఘటనల్ని కూడా ఏబీ ప్రస్తావించారు.
ఇదీ చదవండి : విశ్వరూపం అంటే ఇదేనా? ప్రశ్నించిన అధికారులపై జేసీబీలతో దాడులు చేయడమా?
ఓ డీజీపీ ఇచ్చిన ఫోర్జరీ మెమో ఆధారంగా సీఐడీ ఏడీజీ ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ తోనే అప్పటి సీఎస్ ఏమీ చదవకుండా తనను 24 గంటల్లోనే సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తప్పుల్ని ప్రభుత్వానికి నివేదించినా పట్టించుకోలేదన్నారు. అసలు కొనుగోలే జరగని కేసులో అవినీతి ఎలా జరుగుతుందని ఏ ఒక్కరూ ప్రశ్నించరా అంటూ ఆయన అధికారుల్ని నిలదీశారని.. మీరంతా ఎక్కడి నుంచో వచ్చారని.. తాను మాత్రం లోకల్ ఎవర్నీ వదిలిపెట్టను అంటూ.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనను అభిమానించే వేల మందిని క్షోభపెట్టి ఏం సాధించారంటూ సస్పెన్షన్ కు కారణమైన అధికారుల్ని ఏబీ ప్రశ్నించారు. ప్రజల సొమ్మును ఇలా దుర్వినియోగం చేసే అధికారం ఎవరిచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు తెచ్చారంటూ ప్రశ్నించారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్న అధికారుల్ని శిక్షించాలని, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని అలాంటి అధికారుల నుంచి రికవరీ చేయాలని ఏబీ డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, AP News, AP Politics, Supreme Court