Ex Minster Sucharitha: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ పునర్వ వ్యవస్థీకరణ మంటలు చల్లారడం లేదు. అసమ్మతి జ్వాలు ఎగసిపడుతూనే ఉన్నాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా అధినేతకు మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత (Mekathoti Sucharitha) షాక్ ఇచ్చారు. ఏకంగా తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఎవరూ ఊహించి ఉండరు.. మొన్నటి వరకు కేబినెట్ లో ఉన్నప్పుడు సీఎం జగన్ వీర విధేయురాలిగా ఉండేవారు.. జగనన్న ఏం చేప్తే అది చేయడమే తన కర్తవ్యం అనేవారు.. అసలు తొలి కేబినెట్ లో ఎవరూ ఊహించని విధంగా ఆమెకు మంత్రి పదవితో పాటు.. కీలక మైన హోం శాఖ అప్పగించారు సీఎం జగన్ (CM Jagan).. కానీ రెండున్నరేళ్లలో పరిస్థితి మొత్తం మారిపోయింది. సీఎం జగన్ ముందు చెప్పినట్టే.. కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ చేశారు. అయితే ముందుగానే ఈ విషయంపై అందరికీ క్లారిటీ ఇచ్చారు.. ఒప్పించి మరి రాజీనామాలు చేయించారు.. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే ఇద్దరు ముగ్గురు మినహా అందర్నీ జగన్ తప్పిస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఆ సంఖ్యను 11కు పెంచారు సీఎం జగన్.. దీంతో మాజీలైన మంత్రులకు అధినేత షాక్ ఇచ్చినట్టు అయ్యింది..
అయితే తన రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన సుచరిత సంచలన వ్యాఖ్యలు చేశారు.. తనకు మరోసారి మంత్రి పదవి దక్కలేదని ఏమాత్రం బాధలేదన్నారు. మంత్రి పదవి ఇవ్వాల వద్దా అన్నది సీఎం కు పూర్తి స్వేచ్ఛ ఉందని.. అలాగే మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే విషయం ముందునుంచే తెలుసు అన్నారు. దానికి అంతలా బాధపడాల్సిన అవసరం తనకు లేదన్నారు. కానీ కొన్ని విషయాలు తన దృష్టికి వచ్చాయని.. అవి తెలిసినప్పుడు చాలా బాధ వేసింది అన్నారు. ఆ బాధతోనే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది అన్నారు సుచరిత.
పదవి కొనసాగించాలేదనే కారణంతో తాను రాజీనామా చేశానని వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను అన్నారు. కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని వివరణ ఇచ్చారు. అయితే పదవిలో లేకపోయినా రాజకీయాల్లో తాను ఉన్నంత కాలం.. జగన్ కోసం మాత్రమే పని చేస్తాను అన్నారు. తన వల్ల పార్టీకి చెడ్డపేరు రాకూడదు అన్నదే తన అభిప్రాయం అన్నారు. మనసు ఒప్పుకోకపోవడంతోనే తప్పని సరి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చింది అన్నారు.
ఇదీ చదవండి : సీఎం చేతిని ముద్దాడి.. కాళ్లకు నమస్కారం.. ప్రమాణ స్వీకార హైలైట్స్ ఇవే
అయితే మొదటి విడత కేబినెట్ లో ఏకంగా హోం మంత్రి దక్కించుకున్న సుచరిత రెండోసారి దెబ్బతిన్నారు. మంత్రి పదవి కోల్పోయారు. మొన్నటిదాకా రాష్ట్ర హోం మంత్రిగా ఉన్న ఆమెకు.. ఈసారి కేబినెట్ బెర్త్ దక్కలేదు. ఈ క్రమంలోనే ఆమె ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారని ఆమె అనుచరలు అంటున్నారు. ఇదే సమయంలో పార్టీలోని కార్యకర్తలెవరూ రాజీనామా చేయవద్దని, పార్టీకి నష్టం చేయవద్దని ఆమె సూచించారు. కానీ ఆమెను నమ్ముకున్న కొంతమంది కార్యకర్తలు మాత్రం అసంతృప్తులను భరించలేక ప్రత్తిపాడులో కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm jagan, AP News, Mekathoti sucharitha