Home /News /andhra-pradesh /

AP POLITICS EX HOME MINSTER MEKATHOTI SUCHARITHA KEY COMMENTS ON HER RESIGNATION NGS

Mekathoti Sucharitha: థ్యాంక్స్ గివింగ్ నోట్ ఇస్తే.. రాజీనామా అన్నారు.. మాజీ హోం మంత్రి క్లారిటీ

సుచరిత రాజీనామా

సుచరిత రాజీనామా

Mekathoti Sucharitha: మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత పార్టీకి రాజీనామా చేయలేదా..? మరి ఆమె రాసిన నోట్ ఏంటి..? ఆ ప్రచారం ఎందుకు వచ్చింది..? అసలు ఆమె అలకకు కారణం ఏంటి.. ఈ విషయాలపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు.

  Mekathoti Sucharitha: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కేబినెట్ పునర్వవ్యవస్తీకరణ సెగలు చల్లారినట్టేనా..? కొత్త కేబినెట్ (New Cabinet) లో మంత్రుల జాబితా ప్రకటించిన వెంటనే.. వైసీపీ (YCP)లో ఉన్న అసమ్మతి జ్వాలు ఎగసిపడ్డాయి. కొందరైతే కన్నీరు పెట్టుకున్నారు. మరికొందరైతే ప్రత్యేక సమావేశాలయ్యారు. మరి కొందరు రాజీనామాకు కూడా సిద్దమయ్యారు. ముఖ్యంగా సీఎం జగన్ (CM Jagan) కు వీర విధేయులు అని ముద్ర వేసుకున్నవారు కూడా.. మంత్రుల ప్రమాణ స్వీకారానికి డుమ్మ కొట్టారు. ఇంకొందరైతే సజ్జల బుజ్జగించినా ససేమిరా అన్నారు. దీంతో వైసీపీలో ఏదో జరుగుతోంది అంటూ ప్రచారం మొదలైంది.  విషయం సీఎం వరకు వెళ్లడంతో ఆయన అలర్ట్ అయ్యారు. వెంటనే అసమ్మతి నేతలపై ఫోకస్ చేశారు. విడతల వారిగా ఒక్కక్కర్ని తన దగ్గరకు పిలిపించుకుని.. వ్యక్తిగతంగా వారితో మాట్లాడారు.. ఏ పరిస్థితుల్లో మంత్రి వర్గ విస్తరణ చేయాల్సి వచ్చింది వివరించారు. అలాగే మంత్రి పదవులు ఇవ్వలేకపోయిన వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించారు. దీంతో అసమ్మతి అంతా టీ కప్పులో తుఫానులా చల్లారుతోంది..

  ముఖ్యంగా మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత (Mekathoti Sucharitha) తీరుపై విపరీతమైన చర్చ జరిగింది. ఆమె రాజీనామా కూడా చేశారని ప్రచారం జరిగింది. గత కేబినెట్ లో ఉన్న  ఎస్సీ మంత్రులను అందరినీ కొనసాగించి.. తనను మాత్రమే ఎందుకు తప్పించారు అనే ఉద్దేశంతో ఆమె అలకపూనారంటూ వార్తలు వాచ్చాయి. ముఖ్యంగా స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా కూడా చేశారంటూ.. ఆమె నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాడానికి అసహనంతో వున్నారని, ఆమె రాజీనామా చేశారనే వార్తలు వచ్చాయి.

  ఇదీ చదవండి : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అమ్మాయిల కోసం ప్రత్యేక కాలేజీలు.. 8వ తరగతి నుంచి ఈ ఏడాది ఇంగ్లీష్ మీడియం

  ఈ నేపథ్యంలోఆమె సీఎం జగన్‌ తో భేటీ అయ్యారు. ఆ వెంటనే ఆమె పార్టీకి రాజీనామపై వివరణ ఇచ్చారు. తనకు పార్టీ, సీఎం జగన్ ఎంతో గౌరవించి.. పదవులు కట్టబెట్టారని గుర్తు చేశారు. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

  ఇదీ చదవండి: ఏపీలో మరో బాదుడు.. ఆర్టీసీ చార్జీలు పెంచుతూ నిర్ణయం.. కొత్త ఛార్జీలు ఇలా

  మంత్రివర్గం నుంచి కొంత మందిని తొలగిస్తామని.. కొందరికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని జగన్ చెప్పారన్నారు. అయితే మమ్మల్ని కెబినెట్ నుంచి తొలగించే పరిస్థితుల్లో సీఎం జగన్ బాధ పడితే.. తాను ఫర్వాలేదు.. బాధ పడొద్దని చెప్పాను అన్నారు. మంత్రి పదవి నుంచి తప్పించినప్పుడు కొంత భావోద్వేగానికి గురయ్యాను అన్నారు. అయితే తానకు అండగా నిలుస్తున్నందుకు.. తాను థ్యాంక్స్ గివింగ్ నోట్ ఇస్తే.. అది రాజీనామా లేఖగా అందరూ పొరపాటు పడ్డారని వివరణ ఇచ్చారు.

  ఇదీ చదవండి: రోజా మంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు ముద్దు పెట్టిన కూతురు.. భర్త ఏం చేశారంటే.. ఆమె తొలి సంతకం దేనిపై అంటే..?

  ఈ ఎపిసోడుకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతున్నాను అన్నారు. సీఎం జగన్ తనను చెల్లిగా చూశారని గుర్తు చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్‌తోనే ఉంటానని.. రాజకీయాలకు దూరంగా ఉండదల్చుకుంటే వైసీపీ కార్యకర్తగా.. ఓటరుగానే ఉంటాను అన్నారు. పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. మా అమ్మాయి పొరపాటున ఏదో మాట్లాడింది. ఓ చిన్న పిల్ల మాటను పట్టుకుని ఇంత ఇష్యూ చేయడం సరి కాదు. అయినా అప్పుడే పక్కనున్న మా అబ్బాయి థ్యాంక్స్ గివింగ్ లెటర్ అని చెబుతున్నాడు.. కానీ దాన్ని హైలైట్ చేయలేదన్నారు సుచరిత.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Mekathoti sucharitha

  తదుపరి వార్తలు