హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Unstoppable 2: సీఎం వైఎస్ఆర్ ఆదేశాలను కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారా..? ఆ రోజు ఏం జరిగింది అంటే?

Unstoppable 2: సీఎం వైఎస్ఆర్ ఆదేశాలను కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారా..? ఆ రోజు ఏం జరిగింది అంటే?

మూడు రాజధానులపై మాజీ సీఎం కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మూడు రాజధానులపై మాజీ సీఎం కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Unstoppable 2: ఊహించినట్టే బాలయ్య టాక్ షో అన్ స్టాప్ బుల్ సీజన్ 2.. నాలుగో ఎపిసోడ్ రాజకీయాను టచ్ చేసింది. వైఎస్ఆర్ రాజశేఖర్ మరణం.. ఆయనతో అప్పటి స్పీకర్ గా కిరణ్ కుమార్ రెడ్డికి ఆయనతో ఉన్న అనుబంధం.. విబేధాలు లాంటి అంశాలపై సంచలన సమాధానాలు రాబట్టారు బాలయ్య..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Unstoppable 2: రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారంతా ఎంతో ఆస్తికగా ఎదురు చూసిన ఆన్ స్టాప్ బుల్ 2  నాలుగో ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది.. నందమూరి నట సింహం బాలయ్య (Nandamuri Balayya) తనకు స్నేహితులతో ఉన్న అనుబంధం.. కాలేజీ రోజుల్లో చేసిన అల్లరి.. లాంటి విషయాలను అందరితో పంచుకున్నారు. చిన్న నాటి స్నేహితులు అయిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Ex CM  Kiran Kumar Reddy).. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి (Suresh Reddy)ల నుంచి చాలా కీలక సమాధానాలు రాబట్టారు. ముఖ్యంగా వైఎస్ఆర్ మరణం.. అప్పటి కేబినెట్ లో సీఎంతో  కిరణ్ కుమార్ రెడ్డికి విబేధాలు.. అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం అయ్యే ఛాన్స్ ఎలా వచ్చింది. వైఎస్ఆర్ ఆజ్ఞలను సైతం కిరణ్ కుమార్ తిరస్కరించారా.. అసలు ఆ రోజు ఏం జరిగింది లాంటి విషయాలు తెలుసుకోవాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూశారు.. అయితే వాటన్నింటికీ కిరణ్ కుమార్ రెడ్డి సంచలన సమాధానాలు చెప్పారు.

ముఖ్యంగా సీఎంగా రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో.. కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ గా ఉండేవారు. అయితే పలు కమిటీలు వేసే అధికారం స్పీకర్ కు ఉంటుంది. ఆ సమయంలో పీఏసీ కమిటీ విషయంలో.. రాజశేఖర్ రెడ్డి నిర్ణయాన్ని తాను పక్కర పెట్టినట్టు కిరణ్ కుమార్ రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. అయితే ఆ నిర్ణయం కారణంగానే ఆయన.. రచ్చబండకు సీఎంతో పాటు వెళ్లలేదని.. ఆ రోజు వైెఎస్ఆర్ మరణం రోజు ఏం జరిగిందో వెల్లడించారు..

సాధారణంగా పీఏసీ కమిటిలో ప్రతిపక్షం సూచించే సభ్యుడికి అవకాశం ఇస్తారు స్పీకర్.. అయితే ఆ సమయంలో సీఎం తనకు ఫోన్ చేసి.. పీఏసీ కమిటీని నిమించారా అని అడిగారాని.. అప్పుడు తాను ప్రతిక్షత సభ్యుడు నాగం జనార్థన్  రెడ్డికి అవకాశం కల్పించినట్టు చెప్పానని.. అయితే కానీ రాజశేఖర్  రెడ్డి మాత్రం.. ఆ పేరును పక్కనపెట్టి.. శోభానాగిరెడ్డి పేరును పెట్టాలని సూచించారని కిరణ్ కుమార్  వెల్లడించారు.

ఇదీ చదవండి : చంద్రబాబు బంట్రోతు పవన్ అంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. మంత్రులకు నిజాయితీ ఉందా అని జనసేన ప్రశ్న

ఆ ఫోన్ వచ్చిన వెంటనే తనకు.. రాజశేఖర్  రెడ్డి పక్కన ఆ సీనియర్ మంత్రి ఉన్నారన్న విషయం అర్థమైంది అన్నారు. దీంతో సార్ మీ పక్కన ఆ వ్యక్తి ఉన్నారా అని అడిగానని.. అందుకు ఆయన అవును అని సమాధానం చెప్పడంతో.. ప్రస్తుతానికి కమీటీలను తాను పూర్తి చేయడం లేదని.. స్వయంగా మిమ్మల్ని కలిసిన తరువాత.. మూడు కమిటీల జాబితాను చూపిస్తానని.. మీరు ఓకే అన్నతారువాత వాటిని మార్చాలా.. కొనసాగించాలా అని నిర్ణయం తీసుకుందామని కోరాను అన్నారు.

అయితే  ఆ కమీటీలను మరుచటి రోజు పూర్తి చేయాల్సి ఉండడంతో.. తాను తప్పని సరిపరిస్థితుల్లో స్పీకర్ చాంబర్ కు వెళ్లాల్సి వచ్చిందని.. దాంతో వైఎస్ఆర్ తో పాటు.. రచ్చబండకు వెళ్లాలి అనుకున్నా.. కుదరలేదని.. ఆ కమిటీల ఎంపిక పూర్తి చేయండి అని సీఎం సూచనతో తాను అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో ఉండిపోవాల్సి వచ్చింది అన్నారు.

ఇదీ చదవండి: వీర విధేయులు.. మాజీ మంత్రులకు ఊహించని షాక్.. వారిని తప్పించడానికి కారణాలు ఇవే..?

అయితే కాసేపటి తరువాత.. తాను అధికారులకు ఫోన్ చేసి.. సీఎం రచ్చబండకు చేరుకున్నారా అని ఆరా తీస్తే ఇంకా రాలేదని చెప్పారు. దీంతో అప్పుడు అందరికి ఏదో అయ్యింది అనే అనుమానం మొదలైందని.. వెంటనే జాతీయ భద్రతా విమానాలు రంగంలోకి దిగిన తరువాత.. ప్రమాదం విషయం వెలుగులోకి వచ్చిందని నాటి విషయాలను గుర్తు చేసుకుంటూ.. తీవ్ర ఆవేదన కు గురియ్యారు కిరణ్  కుమార్ రెడ్డి..  బాలయ్య సైతం.. వైఎస్ఆర్ మహోన్నత వ్యక్తి అని.. పార్టీలకు అతితంగా అలాంటి వ్యక్తులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

First published:

ఉత్తమ కథలు