Unstoppable 2: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్-2 టాక్ షో (Unstoppable 2 talk show) సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అంతేకాదు రాజకీయ పరంగా సంచనాలకు వేదిక అవుతోంది. రెండో సీజన్ తొలి ఎపిసోడ్ కు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), మాజీ మంత్రి లోకేష్ (Nara Lokesh) ఇద్దరూ గెస్ట్ లు గా రావడం.. ఇప్పటి వరకు బయటకు చెప్పని అనేక విషయాలపై వారు క్లారిటీ ఇవ్వడంతో ఆ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ పదవి నుంచి తప్పిస్తూ.. చంద్రబాబు నాయుడు సీఎంగా మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నదానిపై తొలిసారి చంద్రబాబు నాయుడు, బాలయ్యలు స్పందించడంతో ఆ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా మారింది. తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Nallari Kiran Kumar Reddy) వంతు వచ్చింది.
కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయినప్పుడు చాలా ఉత్కంఠభరిత పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన సీఎం అవుతారని ఎవరూ ఊహించలేదు కానీ అనూహ్యంగా ఆయన పేరు అప్పట్లో తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. దానిపైనా తాజా ఎపిసోడ్ లో కిరణ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రోమోలో ఆ విషయాన్ని బాలయ్య హైలైట్ చేశారు.
అన్ స్టాపబుల్-2 ప్రోమోను ఆహా ఓటీటీ లేటెస్ట్ గా విడుదల చేసింది. ఇందులో బాలకృష్ణ మాట్లాడుతూ, ఇటీవల బాలయ్య కుటుంబాన్ని చూశారు, ఇప్పుడు బాలయ్య స్నేహాన్ని చూస్తారు అంటూ ప్రకటించారు. అన్నట్టుగానే తన కాలేజీ స్నేహితులైన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డిలను ఆహ్వానించి.. కాలేజ్ డేస్ నుంచి కిరణ్ కుమార్ సీఎం అయిన వరకు జరిగిన ముచ్చట్లను ప్రజలముందు ఉంచారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Another blasting episode loading ????????#UnstoppableWithNBKS2 #NandamuriBalakrishna #KiranKumarReddy #SureshReddy #Radhika #GodOfMassesNBK pic.twitter.com/VpZUCJvzIg
— Gopi Nath NBK (@Balayya_Garu) November 17, 2022
సీఎం అవ్వడానికి కారణం ఏంటని బాలయ్య అడగగా.. అసలు తాను బతికుండబట్టే సీఎం అయ్యానని సంచలన సమాధానం చెప్పారు కిరణ్ కుమార్ రెడ్డి. అదే సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదాన్ని ప్రస్తావించారు. ఓ సీనియర్ మంత్రి వైఎస్సార్ ను తప్పుదోవ పట్టిస్తుండేవారని వెల్లడించారు. దీంతో ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగానే వైఎస్ఆర్ కు కిరణ్ కుమార్ రెడ్డి చాలా సన్నిహితంగా ఉండేవారు.. కిరణ్ ను వైఎస్ఆర్ చాలా నమ్మకంగానే చూసేవారు. మరి అలాంటి కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో అప్పటి సీఎం వైఎస్ఆర్ ను తప్పు దోవ పట్టించిన మంత్రి ఎవరు అంటూ అంతా ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి : తాడేపల్లి ప్యాలెస్ కు లారీల్లో డబ్బులు.. అభివృద్ధి ఆగి.. రౌడీయిజం పెరిగిందన్న చంద్రబాబు
ఆయన చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2009 ఎన్నికల్లో నెగ్గిన ఆయన వైఎస్ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉండేవారు.. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో కూడా ఉన్నారని ఆయన గురించే కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారని టాక్.. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే.. ఆయన తనయుడు జగన్ కు, కిరణ్ కు మధ్య విబేధాలు తలెత్తాయి.. ఆ వివాదాలకు చిత్తూరుకు చెందిన కీలక నేతే కారణమని అప్పట్లో ప్రచారం ఉంది.
ఇదీ చదవండి : ఫ్యాన్ ను నమ్ముకుంటే లాభం లేదని.. కత్తిని నమ్ముకున్నారా అంటూ నారా లోకేష్ ఫైర్
చిత్తూరు జిల్లాలో కిరణ్ కు.. ఆయన కుటుంబానికి.. ఆ సీనియర్ నేతే ప్రత్యర్థిగా ఉండేవారు.. అలాంటి వ్యక్తిని మంత్రిని చేయాలని అప్పట్లో జగన్ తన తండ్రి రాజశేఖర్ రెడ్డికి సిఫార్సు చేసినట్టు టాక్.. ఆఅప్పటి నుంచే కిరణ్ కుమార్ రెడ్డికి.. ఆ కీలక నేతకు మధ్య విబేధాలు తారస్థాయికి చేరినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆయన మంత్రి అయిన తరువాత.. వైఎస్ఆర్ కు కిరణ్ కు మధ్య తగువులు పెట్టే ప్రయత్నం చేశారని.. కిరణ్ కుమార్ రెడ్డి సన్నిహితులు చెబుతున్న మాట..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Nallari Kiran Kumar Reddy, Nandamuri balakrishna, Unstoppable With NBK S2