హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

బీజేపీలోకి మాజీ సీఎం... నేడు అమిత్ షా సమక్షంలో చేరిక

బీజేపీలోకి మాజీ సీఎం... నేడు అమిత్ షా సమక్షంలో చేరిక

నాదేండ్ల భాస్కర్ రావు

నాదేండ్ల భాస్కర్ రావు

గుంటూరు జిల్లా దోనేపూడిలో 1935 జూన్‌ 23న జన్మించిన నాదెండ్ల, 1978లో తొలిసారి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

  మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు నేడు బీజేపీలో చేరనున్నారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్‌ షా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించి నాదేండ్ల అనుచరులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

  1980 దశకంలో ఏపీ రాజకీయాల్లో నాదేండ్ర భాస్కరరావు కీలక పాత్ర పోషించారు. గుంటూరు జిల్లా దోనేపూడిలో 1935 జూన్‌ 23న జన్మించిన నాదెండ్ల, 1978లో తొలిసారి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983లో ఎన్టీఆర్‌ టీడీపీని పెట్టినప్పుడు, ఆయనతో కలిసి నడిచారు నాదెండ్ల. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా, నాదెండ్ల భాస్కరరావు ఆయన మంత్రి వర్గంలో కేబినెట్ హోదా కలిగిన ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుసటి సంవత్సరం ఎన్టీఆర్ ను పీఠం నుంచి దింపేసి, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 వరకు, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

  ఆపై పదవి దిగిన తరువాత, 1998లో తిరిగి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా విజయం సాధించారు.నాదెండ్ల భాస్కరరావు, మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గములో, టి.అంజయ్య మంత్రివర్గములో కూడా మంత్రిగా పనిచేశాడు. 1998లో ఖమ్మం నియోజక వర్గం నుండి పన్నెండవ లోక్‌సభకు ఎన్నికై పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఆ తరువాత దాదాపు రెండు దశాబ్దాల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న నాదెండ్ల, తాజాగా బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడం గమనార్హం. ఇదిలావుండగా, ఆయన కుమారుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో స్పీకర్‌ గా పనిచేసిన, నాదెండ్ల మనోహర్, ప్రస్తుతం పవన్ కల్యాణ్ పార్టీ జనసేనలో ఉన్నారు.

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: Andhra Pradesh, AP Politics, Bjp, Congress, Nadendla Manohar

  ఉత్తమ కథలు