Home /News /andhra-pradesh /

AP POLITICS EX CHIEF MINSTERS READY TO CONSTRICTION NEW HOUSE IN THEIR WON VILLAGE NGS

Ex CM House: ఒకేసారి సొంత ఇంటికోసం ఇద్దరు మాజీ సీఎం అడుగులు.. ఇద్దరి టార్గెట్ ఒక్కటే

సొంత ఇంటి నిర్మాణంలో మాజీ సీఎంలు

సొంత ఇంటి నిర్మాణంలో మాజీ సీఎంలు

Ex CM House: ఇద్దరికి రాజకీయంగా ఘన చరిత్ర ఉంది.. ముఖ్యమంత్రిగా అనుభవం ఉంది.. ప్రస్తుతం ఇద్దరూ మాజీలే.. అయితే ఒకరు మళ్లీ సీఎంగా ఎన్నిక అవ్వడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. మరొకరు మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరి టార్గెట్ ఒకటే.. అందుకే ఒకేసారి సొంత ఇంటికోసం అడుగులు వేస్తున్నారు.

ఇంకా చదవండి ...
    Ex CM House: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ సీఎం లు.. నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu).. నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి (Nallari kiran Kumar). ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన నేతలు.. కానీ పార్టీలు..  నియోజకవర్గాలు వేరు. ఇద్దరికీ జిల్లాలో సొంత ఊళ్లల్లో తాతల కాలం నాటి ఇళ్లు ఉన్నాయి. అయితే ఇద్దరూ సొంతంగా ఇళ్లు నిర్మించుకున్న పరిస్థితి లేదు. కానీ.. ఇప్పుడు అనూహ్యంగా వివిద కారణాలతో చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలు వేర్వేరు ప్రాంతాల్లో ఒకేసారి సొంత ఇంటి నిర్మాణం దిశగా అడుగులు వేయడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

    చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజవర్గంలోని నారావారిపల్లె చంద్రబాబు నాయుడు సొంత ఊరు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన చంద్రబాబు మూడు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న నియోజకవర్గం కుప్పం. అయితే అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సీఎంగా.. విపక్ష నేతగా ఉన్నా.. కుప్పంలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేదు.



    ఎప్పుడూ సొంత నియోజకవర్గానికి వచ్చినా ప్రభుత్వ అతిథి గృహంలోనే బస. ఇదే ఆయన ప్రత్యర్థులకు అస్త్రంగా మారేది. టైమ్‌ దొరికితే చంద్రబాబు ఇంటి గురించి విమర్శలు చేసేవారు వైసీపీ నేతలు. అయితే ఆ విమర్శ ప్రభావమో.. సొంత నియోజకవర్గంలో రాజకీయంగా ప్రతికూల వాతావరణం కనిపించడమో.. కారణం ఏదైనా.. తనకంటూ సొంత ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించారు చంద్రబాబు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో రోడ్డుపక్కన స్థలాన్ని కొనుగోలు చేశారు. త్వరలో ఆ స్థలంలో ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టబోతున్నారు టీడీపీ అధినేత.

    ఇదీ చదవడం : పొత్తుల విషయంలో పవన్ ఒత్తిడిలో ఉన్నారా.. ఆ లైన్ దాటలేకపోతున్నారా?

    చిత్తూరు జిల్లాలోని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంతూరు కలికిరి మండలం నగరిపల్లె. నల్లారి సోదరులంతా నగరిపల్లెలోని పూర్వీకుల ఇంట్లోనే ఉండేవారు. సీఎంగా ఉన్నప్పుడు కూడా అదే ఇంటికి వచ్చేవారు కిరణ్‌ కుమార్‌రెడ్డి. 2014 రాష్ట్ర విభజన సమయంలో సొంత పార్టీ పెట్టి ఘోరంగా ఓడాక రాజకీయాలకు దూరమయ్యారు. గత కొంతకాలంగా రాజకీయాకు దూరంగా ఉన్న ఆయన.. మళ్లీ కాంగ్రెస్‌లో యాక్టివ్‌ అయ్యే పనిలో పడ్డారు. కానీ కిర్‌ణ్‌ కుమార్‌రెడ్డి సొదరుడు కిశోర్‌ కుమార్‌రెడ్డి టీడీపీలో ఉన్నారు. గత ఎన్నికల్లో పీలేరు నుంచి టీడీపీ టికెట్‌పైనే పోటీ చేసి ఓడిపోయారు. పీలేరు టీడీపీ ఇంఛార్జ్‌ కూడా ఆయనే. స్థానిక రాజకీయాలపై ఎక్కువ ఫోకస్‌ పెట్టిన కిశోర్‌ కుమార్‌రెడ్డి నగరిపల్లెలోని పూర్వీకుల ఇంటిలోనే ఉంటున్నారు.

    ఇదీ చదవడం: అధికార పార్టీ దూకుడికి ఆ జిల్లాలో స్పీడ్ బ్రేకర్లు.. సొంత నేతలే అడ్డుపడుతున్నారా..?

    ఇక సోదరుడు ఒక పార్టీ.. తానొక పార్టీలో కొనసాగుతూ ఒకే ఇంటిలో ఉంటే ఇబ్బంది అనుకున్నారో ఏమో.. సొంతూరుకు రావడం తగ్గించేశారు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి. హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. పూర్వీకుల ఇంట్లో సోదరుడితో కలిసి ఉండటం కంటే.. సొంతంగా ఇల్లు కట్టుకోవాలని భావించి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సైతం సొంతూరు నగరి పల్లెలో ఇటీవలే సుమారు 7 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. త్వరలో ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడతారట.

    ఇదీ చదవడం: పనస తొనలతో వీర్య వృద్ధి... సంతాన భాగ్యం.. కొనాలి అంటే భయం భయం

    ఇలా ఇద్దరు మాజీ సీఎంలు ఇన్నేళ్లకు సొంత జిల్లాలో సొంత ఇంటి నిర్మాణం ఒకేసారి చేపట్టడం రాజకీయ వర్గాల్లోనూ.. సాధారణ ప్రజానీకంలోనూ చర్చగా మారింది. కాకపోతే వైసీపీ విమర్శల వల్ల చంద్రబాబు.. చంద్రబాబును చూసి కిరణ్‌ కుమార్‌రెడ్డి ఇల్లు కట్టుకుంటున్నారని పొలిటికల్‌ సర్కిళ్లలో సెటైర్లు పేలుతున్నాయి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Chitoor

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు