YCP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన తరువాత.. తీవ్ర ఇబ్బంది పడ్డ ప్రతిపక్ష నేతల్లో కేంద్ర మాజీ మంత్రి.. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు (Ashok Gajapatiraju) ఒకరు.. గ్యాప్ లేకుండా ఆయనకు షాక్ లపై షాక్ ఇస్తూ వచ్చింది వైసీపీ ప్రభుత్వం (YCP Government) .. రాజకీయంగా ఆయన్ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది అనే చెప్పాలి.. మళ్లీ అశోక్ గజపతి రాజు కోలుకోవడం కష్టమే అనే రేంజ్ లో ఆయన్ను వివాదాల్లోకి నెట్టింది.
విజయనగరం జిల్లాపై పూర్తిగా పట్టు సాధించాలి అంటే.. అశోక్ గజపతి రాజు లాంటి నేతను కట్టడి చేస్తే.. ఇక తిరుగు ఉండదని వైసీపీ లెక్కలు వేసుకుంది.. కానీ ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అన్నట్టు తయారైంది అంటున్నారు పరిస్థితి. ఎందుకంటే ఆయన్ను పూర్తిగా రాజకీయంగా తొక్కేయాలి అనుకుంటే.. ఇప్పుడు ఆ ప్లాన్ రివర్స్ అయ్యింది అంటున్నారు.
గత ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేశారు. అలాగే అదే అసెంబ్లీ స్థానం నుంచి తన కుమార్తె అతిది గజపతిరాజును బరిలోకి దించారు. కానీ ఇద్దరూ ఓడిపోయారు. అయితే కుమార్తె 5 వేల ఓట్లతో ఓటమి చవిచూడగా.. అదే నియోజకవర్గం నుంచి అశోక్ గజపతిరాజుకు మాత్రం ఎంపీగా 25 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. అంటే కేవలం అభ్యర్థి మార్పు వల్లే ఇక్కడ ఓటమి ఎదురైందని టీడీపీ అధిష్ఠానం గుర్తించింది. అందుకే ఈసారి ప్లాన్ మారుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి అశోక్ గజపతిరాజును పోటీచేయించాలని హైకమాండ్ నిర్ణయించినట్టు టాక్.
సాధారణంగానే అశోక్ గజపతిరాజు అంటే జిల్లా ప్రజలు ఒకరకమైన అభిమానం చూపుతూ వస్తున్నారు. అవినీతి వంటి వాటికి దూరంగా ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్ అంటున్నారు. అటు రాజవంశీయులుగా కూడా మంచి గుర్తింపే ఉంది. అయితే ముక్కుసూటిగా వెళ్లడం, ఇప్పటి రాజకీయాలకు అనుగుణంగా వెళ్లకపోవడం ఆయనకు మైనస్ అయ్యింది. కానీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకున్న అశోక్.. ఇప్పుడు ప్రజల బాట పట్టారని తెలుస్తోంది. కాకపోతే గతంలో కంటే ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటన్నారు. కేవలం సొంత నియోజకవర్గంపై ఫోకస్ చేయడమే కాదు.. జిల్లా మొత్తంపై ఆయన ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు కారణం కూడా ఉంది. ఎందుకంటే తనను ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టిందని.. దానికి రివేంజ్ తీర్చుకోవాలనే పట్టుదలతో ఆయన కనిపిస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Vizianagaram