JD Lakshminarayana: ఆ చేతులతో ఎంతో మంది అక్రమార్కుల ఆట కట్టించారు. ఆ చేతులతోనే ఎంతో మందిచేత ఆదర్శపాఠాలు దిద్దించారు. అదే చేతులతో తన జీవితంలో సరికొత్త ప్రస్థానానికి నాంది పలికారు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ (Ex CBI Joint Director Lakshminarayana). ప్రస్తుతం రాజకీయాల చిన్న విరామం ఇచ్చిన ఆయన.. లక్ష్మీనారాయణ సరికొత్త అవతారం ఎత్తారు. సీబీఐకి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన.. గత ఎన్నికల్లో విశాఖపట్నం (Visakhapatnam) ఎంపీగా జనసేన (Janasena) నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి తన లక్ ను పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. అప్పటి వరకు రెస్ట్ తీసుకోకుండా.. ఈ మధ్య రైతు అవతారం ఎత్తారు. వ్యవసాయదారుడికి అండగా ఉండేలా మాజీ జేడీ ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ రైతులకు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా రైతులు సహజ సిద్ధమైన పద్దతులతో,సేంద్రియ విధానంలో పంటలు పండించే విధంగా తాను స్వయంగా హలం పట్టి పొలంలోకి దిగారు. వ్యవసాయం చేస్తున్నారు.
కాకినాడ జిల్లా (Kakinada District) ప్రత్తిపాడు మండలం ధర్మవరం, రాచపల్లి గ్రామంలో మాజీ సిబిఐ జెడి వి వి లక్ష్మీనారాయణ 12 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకి తీసుకున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రంలో ఆర్గానిక్ (Organic Farming) పద్దతిలో పంట పండించనున్నారు. ఈరోజు తాను కౌలుకు తీసుకున్న చేలో వి వి లక్ష్మీనారాయణ స్వయంగా వరి నాట్లు నాటారు. వ్యవసాయ కూలీలతో కలిసి వరి నాట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, జేడీ అభిమానులు కూడా పాల్గొని.. వరి నాట్లు వేశారు. ఇలాంటి సంఘటన సర్వసాధారంగా సినిమాల్లోనే చూస్తాం.. నిజ జీవితంలో అరుదు అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో 12 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్న ఆయన వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. కౌలుకు తీసుకున్న పొలంలో ఆయన వరి నాట్లు వేశారు. ఈ పొలంలో ఆయన సాధారణ వరితోపాటు.. నల్ల బియ్యాన్ని సాగు చేస్తున్నారు. భవిష్యత్తులో ధర్మవరం గ్రామాన్ని వ్యవసాయ ప్రయోగాత్మక కేంద్రంగా మారుస్తామన్నారు. తాను కౌలు రైతుగా మారడం వెనుక కారణాన్ని ఆయన మీడియాకు వివరించారు. కౌలు రైతుల సాధకబాధకాలను తెలుసుకోవడం కోసం, వారి కష్ట నష్టాలను అర్థం చేసుకోవడం కోసమే కౌలు రైతుగా మారాను అన్నారు.
కౌలు రైతులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కౌలు వ్యవసాయం లాభసాటిగా ఉండేందుకు రైతులు అనుసరించాల్సిన విధానాలు ఏంటనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రయోగాత్మకంగా వ్యవసాయం చేస్తున్నాను అన్నారు. వ్యవసాయం పట్ల యువత మక్కువ పెంచుకోవాలని మాజీ జేడీ లక్ష్మీనారాయణ సూచించారు.
ఇదీ చదవండి : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మనవైపే పెద్ద కంపెనీల చూపు.. 56 కంపెనీలు వస్తున్నాయన్న సీఎం జగన్
మహారాష్ట్రలో అడిషనల్ డీజీపీ హోదాలో పని చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ 2018లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తరువాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన ఆయన.. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. జనసేన పార్టీలో చేరిన లక్ష్మీ నారాయణ.. విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఎన్నికల్లో ఓడినప్పటికీ.. గట్టి పోటీని ఇచ్చారు. తరువాత జనసేన నుంచి బయటకొచ్చిన ఆయన.. రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ.. ప్రజలతో మమేకం అవుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటికే ఫిక్స్ అయ్యారు.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ఇంకా నిర్ణయించుకోలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Farmer, JD Lakshmi Narayana, Visakhapatnam