హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

JD Laxminarayana: పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మాజీ జేడీ.. పొలంలో అది పోయింది అంటూ కేసు.. ఏం జరిగిందో తెలుసా?

JD Laxminarayana: పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మాజీ జేడీ.. పొలంలో అది పోయింది అంటూ కేసు.. ఏం జరిగిందో తెలుసా?

ఫ్లెక్సీ పోయింది అంటూ జేడీ ఫిర్యాదు

ఫ్లెక్సీ పోయింది అంటూ జేడీ ఫిర్యాదు

JD Laxminarayana: ఈ మధ్య పోలీసు స్టేషన్ కు కొత్త కొత్త కేసులు వస్తున్నాయి. ఈ మధ్య చిన్న పిల్లలు సైతం పెన్సిల్ పోయింది.. నాన్న తిట్టాడు అంటూ స్టేషన్ మెట్లు ఎక్కిన వార్తలు వైరల్ అయ్యాయి.. ఇప్పుడు వాటికి భిన్నంగా ఓ కేసు నమోదైంది. ఆ కేసు ఏంటోప తెలిస్తే షాక్ అవుతారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18. 

JD Laxminarayana: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో  పెద్ద పెద్ద రాజకీయ నేతలు.. బడా బాడా వ్యాపర వేత్తలను భయపెట్టిన అధికారి మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీ నారాయణ (JD Lakshmi Narayana).. ఆయనే ఇప్పుడు ఆయనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే చాలామంది తమ ఇంట్లో భారీగా చోరీ జరిగిందని.. లేదా నగదు పోయిందని.. బంగారం పోయిందని.. వాహనం పోయిందనని.. ముబైల్ పోయిందని ఇలా వివిధ రకాలతో ఫిర్యాదులు చేస్తుంటారు.. ఇక మిస్సింగ్ కేసులు అంటే.. బిడ్డలు కనిపించడం లేదనో.. వయసు పెద్ద అయినా వాళ్లు కనిపించడంలో లేదనో.. లేక భార్య, భర్త ఇలా ఎవరో ఒకరు మిస్ అయ్యారని కేసులు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో కొందరు కోడి మిస్సైందని.. కుక్క మిస్ అయ్యిందని కూడా అప్పుడప్పుడూ వింత కేసులు వస్తున్నాయి. చిన్న పిల్లలు సైతం పెన్ను పోయింది అంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇంట్లో కుటుంబసభ్యులు ఎవరైనా మిస్సైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కానీ పొలంలో పెట్టిన ఫ్లెక్సీ పోయిందని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సాధారణంగా అయితే ఫ్లెక్సీ పోయిందని ఫిర్యాదు (Flexi Missing Complaint) చేస్తే పెద్దగా పట్టించుకోరు.. కానీ ఫ్లెక్సీ పోయిందని ఫిర్యాదు రాగానే పోలీస్ యంత్రాంగం కేసు దర్యాప్తు ముమ్మరం చేసింది. నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారా.. ఫ్లెక్సీ మిస్సింగ్ పై ఇంత వేగంగా దర్యాప్తు ఏంటని షాక్ తినే ఉంటారు. అందుకు కారణం. ఫిర్యాదు ఇచ్చింది మాజీ ఐపీఎస్ అధికారి, సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన జెడి.లక్ష్మినారాయణ. ఇండియన్ పోలీస్ సర్వీసెస్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత.. వ్యవసాయం పై మక్కువతో మాజీ జెడి.లక్ష్మినారాయణ సేంద్రీయ వ్యవసాయం చేయడం ప్రారంభించారు.

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం, రాచపల్లి గ్రామాల పరిధిలో దాదాపు 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరినాట్లు వేశారు. గత కొనేళ్లుగా ఈ వ్యవసాయ క్షేత్రాన్ని కౌలుకు తీసుకుని సేంద్రీయ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు. దీనిలో భాగంగా తన పొలంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నట్లుగా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ నెల 1వ తేదీ రాత్రి నుంచి తన పంట పొలంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కనబడటం లేదు. దీంతో తన పొలంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ మిస్సైందని మాజీ జెడి.లక్ష్మినారాయణ ప్రత్తిపాడు పోలీసులను ఆశ్రయించారు.

ఇదీ చదవండి : బాబోయ్ బాహుబలి ఎద్దు..! రూపమే కాదు.. పేరు కూడా అలనే ఉంది

మాజీ జెడీ. లక్ష్మి నారాయణ పొలంలో కాపలా ఉన్న దొరబాబు ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిసి ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని ప్రత్తిపాడు సీఐ కిషోర్ బాబు లక్ష్మినారాయణకు హామీ ఇచ్చారు. మాజీ జేడీ లక్ష్మినారాయణ పొలంలో ఫ్లెక్సీ ఎందుకు మిస్ అయింది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తొలగించారా, లేదంటే ఆకతాయిలు ఎవరైనా ఫ్లెక్సీ ఎత్తుకెళ్లారా అనే విషయాలు పోలీసుల విచారణలో తేల్చనున్నారు. అయినా ఫ్లెక్సీ మిస్సింగ్ పై మాజీ జెడి.లక్ష్మినారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారంటే ఇది ఎవరో కుట్రపూరితంగా చేశారనే అనుమానాలు కలుగుతున్నాయి.

First published:

Tags: Andhra Pradesh, AP News, JD Lakshmi Narayana, Kakinada

ఉత్తమ కథలు