హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Perni Nani: పవన్‌ వీకెండ్ పొలిటీషియన్.. చిరంజీవినే తప్పు పడతారా అంటూ పేర్ని నాని ఫైర్

Perni Nani: పవన్‌ వీకెండ్ పొలిటీషియన్.. చిరంజీవినే తప్పు పడతారా అంటూ పేర్ని నాని ఫైర్

Pawan Kalyan and Chiranjeevi Twitter

Pawan Kalyan and Chiranjeevi Twitter

Perni Nani: మొన్న కేబినెట్ మినిస్టర్లకు సీఎం జగన్ క్లాస్ పీకిన తరువాత.. మంత్రుల తీరులో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం.. పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శల దాడి పెంచుతున్నారు. అందుకే ఆయన్ను మళ్లీ కేబినెట్ లో తీసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

    Perni Nani: ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టడంలో మంత్రులు ఘోరంగా ఫెయిల్ అవుతున్నారంటూ ఇటీవల కేబినెట్ లో సీఎం జగన్ (CM Jagan) ఫైర్ అయ్యారు. ఇదే పరిస్థితి కొనసాగిస్తే.. కొందరి మంత్రులపై వేటు వేయడం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆ వార్నింగ్ వారిపై పని చేసిందో లేదో కానీ.. మాజీ మంత్రి పేర్ని నాని (Ex Minster Perni Nani) మాత్రం.. తనదైన స్టైల్లో మంత్రిగా ఉన్నప్పుడు పవన్ కు ఎలా కౌంటర్లు ఇచ్చారో.. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలకు తనదైన స్టైల్లో సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే.. సొంత ఆస్తుల కోసం మాత్రం సీఎం జగన్ తోడ బుట్టిన చెల్లితోనే గొడవపడుతున్నారు.. కానీ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము మాత్ర ఇష్టానుసారం మళ్లించినా ఎవరూ ప్రశ్నించటం లేదన్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలు ఏ ఆలోచనలోనే వైసీపీకి ఓట్లు వేశారని వ్యాఖ్యానించారు.

    151 సీట్లు వచ్చినంత మాత్రాన మహానుభావులు కాలేరని పవన్ చెప్పుకొచ్చారు. ప్రతి దానికి ఒక ఎక్స్ పైర్ డేట్ ఉంటుందని.. అలాగే వైసీపీకి ఎక్స్ ఫైర్ డేట్ అయిపోయింది అన్నారు. వైసీపీకి 45 నుంచి 67 స్థానాలకే పరిమితం అవుతుందని.. జనసేనకు ఆదరణ పెరుగుతోందని.. మనిషికైనా, అధికారానికైనా ఎక్స్‌పెయిరీ డేట్ ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి.

    జనసేనాని పవన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ముందు మీరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో సర్వే చెప్పలేదా? అందులో ఎన్ని గెలుస్తారనేది చిలక జోస్యంలో రాలేదా? అంటూ పేర్నినాని పవన్‌పై మండిపడ్డారు.. చిరంజీవి రాజకీయంగా చాలా తప్పులు చేసినట్లు పవన్‌ కల్యాణ్ మాట్లాడడం దుర్మార్గమైన విషయమంటూ మండిపడ్డారు.

    ప్రజారాజ్యం పార్టీకి, సొంత అన్నకు పవన్‌ వెన్నుపోటు పొడిచారంటూ పేర్నినాని ఆరోపించారు. చిరంజీవి దయతో ఉన్నతస్థాయికి వచ్చిన పవన్‌.. పరోక్షంగా చిరంజీవిని తప్పుబడుతూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్‌ కల్యాణ్‌ ఓ వీకెండ్ పొలిటీషియన్ అంటూ ఫైరయ్యారు. గతంలో ఆయన మాట్లాడిన మాటలు అందరికీ గుర్తున్నాయన్నారు.

    ఇదీ చదవండి : వేలాదిగా వస్తున్నాయి.. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.. ఆ జిల్లాను వణికిస్తున్న చీమలు

    కేవలం వైఎస్‌ జగన్‌పై ఉన్న అక్కసుతో.. పవన్ ప్రతిరోజూ విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నారంటూ విమర్శించారు. చంద్రబాబు తప్పులను ఎత్తిచూపడం లేదంటూ విమర్శించారు. 2009లో చంద్రబాబును తప్పుబట్టిన పవన్‌.. 2014లో అదే వ్యక్తికి ఓటేయమని ప్రజల్ని కోరారని గుర్తు చేశారు. ఇలా మొదటి నుంచి పవన్ తీరు చూస్తే.. రాజకీయాల్లో పవన్ చేసినన్ని తప్పులు చిరంజీవి చేయలేదని పేర్ని నాని అభిప్రాయపడ్డారు.

    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Pawan kalyan, Perni nani

    ఉత్తమ కథలు