ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీఎం జగన్ ఇప్పటి నుంచే ప్రజల్లో వుంటున్నారు. అయితే మరో ఏడాదిన్నరలోపే ఎన్నికలు ఉంటాయని సీఎం జగన్ (CM Jagan) బయటకు చెబుతున్నారు. అయినా కానీ ముందస్తు ఎన్నికలపై వైసిపి నాయకుల కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. అసలు ఏపీలో షెడ్యూల్ ప్రకారం 2024లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ అంతకంటే ముందే 2023 సెప్టెంబర్ లేదా నవంబర్ కంటే ముందే అసెంబ్లీని రద్దు చేసే యోచనలో సీఎం జగన్ ఉన్నారని సమాచారం అందుతోంది. ఇప్పటికే దీనిపై వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs), నియోజకవర్గ ఇంఛార్జులకు పరోక్షంగా సమాచారం ఇచ్చినట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలో ఏ క్షణమైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఏపీ మంత్రి సీదిరి అప్పల్రాజు (Ap minister sidhiri appalaraju) సంచలన కామెంట్స్ చేశారు. బ్రతికున్నంత కాలం సీఎం జగనే (Cm Jagan). మరోసారి ఆయనను సీఎంను చేద్దాం అని అప్పల రాజు (Ap minister sidhiri appalaraju) అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జరుగుతుందని రేపే ఎన్నికలు జరుగుతాయి అనేలా నాయకులు, కార్యకర్తలు పని చేయాలనీ మంత్రి అప్పలరాజు (Ap minister sidhiri appalaraju) వ్యాఖ్యానించారు.
అధిష్టానం క్లియరెన్స్ ఇచ్చిందా..
అయితే అధిష్టానం ఇచ్చిన సంకేతాలతో వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ఇటీవల అధిష్టానం నుంచి కొందరి నేతలకు ఫోన్ లు వచ్చినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని బూత్ లెవెల్ నేతలు, సమన్వయ కర్తల ఫోన్ నెంబర్లు.. పూర్తి సమాచారం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఎందుకు వారి వివారాలు అడుగుతున్నారని.. నేతలు ఆరా తీయగా.. ముందుగానే ఎన్నికలు ఉండే అవకాశం ఉందని చెప్పినట్టు టాక్. ఇటు ఏపీ, అటు తెలంగాణ ఎన్నికలు ఒకే టైంలో జరుగుతాయనే చర్చ జోరుగా సాగుతుంది.
మంత్రి సీదిరి అప్పలరాజు (Ap minister sidhiri appalaraju) వ్యాఖ్యలతో ఏపీలో ముందస్తు ఎన్నికలు అంశం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. మరి సీఎం జగన్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళతారా లేక షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయో చూడాలి. అసలు సీఎం జగన్ (Cm jagan) మనసులో ఏముందో ఇప్పటికైతే సస్పెన్సే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, Ap cm jagan, AP News, Cm jagan