Home /News /andhra-pradesh /

AP POLITICS ELECTION STRATEGIST PRASHANT KISHORE SUGGESTED CONGRESS PARTY TO MAKE ALLIANCE WITH YS JAGAN LED YSRCP FULL DETAILS HERE PRN

YCP -Congress Alliance: ఏపీలో వైసీపీతో కాంగ్రెస్ పొత్తు..? అధిష్ఠానానికి పీకే సూచన.. జగన్ ఒప్పుకుంటారా..?

సోనియా, ప్రశాంత్ కిశోర్, జగన్ (ఫైల్)

సోనియా, ప్రశాంత్ కిశోర్, జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా..? వచ్చే ఎన్నికల నాటికి సరికొత్త పొత్తులు పొడవనున్నాయా..? ఎన్నికలేవైనా ఒంటరిగానే పోటీ చేస్తామంటున్న వైసీపీ (YSRCP) త్వరలో మరోపార్టీతో జతకట్టబోతోందా..?

ఇంకా చదవండి ...
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా..? వచ్చే ఎన్నికల నాటికి సరికొత్త పొత్తులు పొడవనున్నాయా..? ఎన్నికలేవైనా ఒంటరిగానే పోటీ చేస్తామంటున్న వైసీపీ (YSRCP) త్వరలో మరోపార్టీతో జతకట్టబోతోందా..? ఆ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) ఈ కొత్తపొత్తుకు నాంది పలకబోతున్నారా..? పొత్తుల విషయంలో వైసీపీ వైఖరి ఎలా ఉన్నా.. కాంగ్రెస్ (Congress Party) కు పూర్వ వైభవం తెచ్చేందుకు యత్నిస్తున్న అధిష్టానానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఊహించని ప్రతిపాదన చేశారు. దేశంలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరాలంటే కొన్ని మార్పులు అవసరమని సూచించారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ నేతలకు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోని అంశాలు బయటకొచ్చాయి.

ఇందులో భాగంగా పలురాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తుపెట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించినట్లు తెలుస్తోంది. ఏపీలో దాదాపు కనుమరుగైన పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీతో జతకట్టాలని పీకే సూచించినట్లు సమాచారం. 168 ఎంపీ స్థానాల్లో ప్రాంతీయ పార్టీలో కలిసి బరిలో దిగితే మంచి ఫలితాలుంటాయని ఆయన చేసిన ప్రధాన సూచన.

ఇది చదవండి: "మతి తప్పిన బాబు.., ఎంతలేపినా కష్టమే.." చంద్రబాబు బర్త్ డేనీ వదలని వైసీపీ..


ఐతే ఏపీ విషయానికి వస్తే ప్రస్తుతానికి వైసీపీకి పొత్తులతో పనిలేదు. ఎన్నిక ఏదైనా సింగిల్ గానే బరిలో దిగుతామని ఆ పార్టీ నేతలు ప్రతి రోజూ ప్రకటిస్తూనే ఉన్నారు. 2019లో ఒంటరిగానే పోటీ చేసిన వైసీపీ.. అధికారంలో ఉన్న టీడీపీని ఓడించి ఏకంగా 151 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 80 శాతానికి పైగా అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థులే విజయం సాధించారు. ఇలాంటి పరిస్థితుల్లో పీకే సలహా మేరకు కాంగ్రెస్ నుంచి పొత్తు ప్రతిపాదన వస్తే జగన్ అంగీకరిస్తారా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో నేరుగా స్నేహం చేయకపోయినా బయటి నుంచి సహకారం అందిస్తోంది వైసీపీ. ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు అంటే మాత్రం బీజేపీని విమర్శించకపోయినా కయ్యానికి దిగినట్లే అవుతుంది.

ఇది చదవండి: వారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. 2500 మందికి ఉద్యోగాలు


ఐతే వైసీపీతో పొత్తుకు సోనియా గాంధీ అంగీకరిస్తే.. జగన్ ను ఒప్పించే బాధ్యతను పీకేకే అప్పగించే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే ఏపీతో పాటు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉనికిలో లేదు. పికే సూచన కూడా ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని సూచించడంతో ఆ పార్టీలు ఇందుకు అంగీకరిస్తాయా..? లేదా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరోవైపు ఇటీవల టీడీపీ ఇద్దరు టీడీపీ ఎంపీలు.. సోనియా గాంధీని కలిసి పొత్తు విషయం మాట్లాటారాన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
Published by:Purna Chandra
First published:

Tags: Congress, Prashant kishor, Ysrcp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు