Home /News /andhra-pradesh /

AP POLITICS ED RIDES ON 8 MULTIPLE PLACE ON CASINO ORGANIZERS IN HYDERABAD AND LINKS WITH DUDIWADA CASINO NGS

Casino: తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో కలకలం.. ఈడీ రైడ్స్ తో తెరపైకి గుడివాడ వ్యవహారం.. నేపాలే ప్రధాన అడ్డా..?

తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో కలకలం

తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో కలకలం

Casino: తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో వ్యవహారం మళ్లీ కలకలం రేపుతోంది.. తాజాగా హైదరాబాద్ లో ఈడీ రైడ్స్ తో మళ్లీ గుడివాడ వ్యవహారం తెరపైకి వచ్చినట్టైంది. అయితే ఈ సారి వ్యవహరాంలో అనేక సంచలన వ్యాస్తావాలు వెలుగులోకి వచ్చాయి. గుడివాడలో క్యాసినో నిర్వహించిన ప్రవీణే.. ఈ వ్యవహరానికి మొత్తం సూత్రదారి అని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
  Casino: తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో (Caisno) వ్యవహారం సంచలనంగా మారింది. సంక్రాంతి సందర్భంగా గుడివాడ (Gudivada) లో బయటపడ్డ క్యాసినో వ్యవహారం.. ఇప్పుడు హైదరాబాద్ (Hyderabad) ఇష్యూతో మళ్లీ తెరపైకి వచ్చింది. జూదం పేరుతో నిధుల మళ్లిస్తున్నారనే అనుమానంతో పలువురు టూర్‌ ఆపరేటర్లపై హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED)వరుస సోదాలు నిర్వహించింది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా గుడివాడలో క్యాసినో నిర్వహణ మొదలు విదేశాల్లోనూ ప్రత్యేక ఈవెంట్ల పేరుతో క్యాసినో పేరుతో ప్రజలను తరలిస్తున్న వీరి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు ముమ్మర సోదాలు చేశారు. దీంతో ఈ సోదాలు రాజకీయ, వ్యాపారవర్గాల్లో సంచలనమవుతున్నాయి. కొందరు ప్రముఖులు జూదం ఆడేందుకు విదేశాలకు వెళ్లిన వివరాలన్నీ ఈడీ సోదాల్లో బయటపడమే ఈ సోదాలకు కారణమని తెలుస్తోంది. గోవాలో క్యాసినోలు నిర్వహించడంతోపాటు నేపాల్‌, థాయ్‌లాండ్‌లలో జరిగే జూదంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు చెందిన చీకోటి ప్రవీణ్‌ (Chikoti Praveen), మాధవరెడ్డి (Madhav Reddy) సహా కొందరు ప్రత్యేక టూర్లు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది. రానుపోను ఖర్చులతో కలిపి 5 రోజులపాటు విదేశాల్లో ఉండేందుకు ఒక్కొక్కరి నుంచి దాదాపు 3 లక్షల వరకు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఎక్కువ మందిని శ్రీలంక (Srilanka) తీసుకెళ్లేవారని.. ఇప్పుడు అక్కడి పరిస్థితులు బాగోకపోవడంతో నేపాల్‌కు తరలిస్తున్నట్టు సమాచారం.

  బుధవారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు బోయిన్‌పల్లిలోని మాధవరెడ్డి ఇంట్లో సోదాలు జరగ్గా.. సైదాబాద్‌లోని చీకోటి ప్రవీణ్‌ ఇంట్లో అర్ధరాత్రి సోదాలు కొనసాగాయి. జూబ్లీహిల్స్‌ తదితర మరో 8 ప్రాంతాల్లో ఈడీ బృందాలు సోదాలు మొదలుపెట్టాయి. సాయంత్రం వరకూ జరిగిన ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జూదం ఆడటానికి ఉపయోగించే టోకెన్లు పెద్ద మొత్తంలో దొరికినట్లు సమాచారం. ఈ టూర్లను నిర్వహించే ఆపరేటర్ల కార్యాలయాలపై ఈడీ దాడులు నిర్వహించినట్లు తెలియగానే తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, అధికారులకు వణుకు మొదలైందని తెలుస్తోంది.  ముఖ్యంగా ఈ టూర్ ల పేరుతో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. పేకాట ఆడేందుకు దొడ్డిదారిలో విదేశాలకు సొమ్ము తీసుకెళుతున్నారని, గెలుచుకున్న డబ్బును దొడ్డిదారిలోనే స్వదేశానికి రప్పించుకుంటున్నారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మధ్యకాలంలో నగరానికి చెందిన ఓ వ్యక్తి పెద్దత్తంలో జూదంలో గెలుచుకొని దాన్ని హవాలా మార్గంలో స్వదేశానికి రప్పించినట్లు ఈడీకి సమాచారం అందిందని.. దాని ఆధారంగానే దాడులు నిర్వహించారని తెలుస్తోంది. అంతేకాదు ఈ క్యాసినో పర్యటనలు నిర్వహించేవారికి టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌కు చెందిన అనేకమంది స్టార్లతో సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది తెలుస్తోంది.

  ఇదీ చదవండి : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్.. మెరుగైన వైద్యమే లక్షం

  ఈ వ్యవహారం ఇప్పుడే మొదలవ్వలేదు. చీకోటి ప్రవీణ్‌ చీకటి దందా ఏళ్ల క్రితం నుంచే నడుస్తోంది. గోవా, శ్రీలంక, నేపాల్‌, థాయ్‌లాండ్‌లలో క్యాసినోల నిర్వహణతోపాటు స్థానికంగానూ జూదం సాగించి అతడు పోలీసులకు చిక్కిన ఉదంతాలున్నాయి. నగరంలోని కొన్ని క్లబ్‌లు ఇతడి కనుసన్నల్లో నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నగర శివార్లలోని తన ఫామ్‌హౌస్‌లో కొండచిలువలు, రామచిలకలు, గుర్రాలు, ఉడుములు, ఆస్ట్రిచ్‌, బాతుల్లాంటి వన్యప్రాణుల్ని చీకోటి ప్రవీణ్‌ పెంచుకుంటున్నట్లు తేలింది.

  ఇదీ చదవండి : బామ్మతో సెల్ఫీ.. బురదలో వాకింగ్.. పేదలకు తోడుగా లోకేష్ తోపుడు బండ్లు

  నేపాల్ అయితే ఇలాంటి వాటికి సేఫ్ అని నిర్వాహకుల నమ్మకం. అందుకే ప్రవీణ్‌ ఇటీవలి కాలంలో నేపాల్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తన దందాకు ప్రచారం కోసం పలువురు సినీతారల్ని వినియోగించాడు. గత నెలలో జరిగిన క్యాసినో కోసం అమీషా పటేల్‌, ఈషా రెబ్బా, డింపుల్‌ హయతీ, ముమైత్‌ఖాన్‌తో ప్రచారం చేసి ఆ వీడియోల్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పెట్టుకున్నాడు. తాము ఆ క్యాసినోకు వస్తున్నట్లు సినీతారలతో చెప్పించి పెద్ద ఎత్తున పంటర్లను ఆకర్షించాడు.

  ఇదీ చదవండి : చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ వెనుక ఉన్నది బాలయ్యేనా.. అసలు మ్యాటర్ అదేనా?

  మరి మాధవరెడ్డి ఎవరంటే..? బోయిన్‌పల్లిలో నివాసం ఉండే మాధవరెడ్డి 6 నెలల క్రితం వరకు ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా పనిచేసేవాడు. గతంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మాధవరెడ్డి ప్రవీణ్‌ దందాలో భాగస్వామిగా చేరిన తర్వాత బాగా సంపాదించినట్లు తెలుస్తోంది. ఈడీ దాడి సమయంలో మాధవరెడ్డి కారుపై తెలంగాణ మంత్రికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉండటం గమనార్హం. తెలంగాణకు చెందిన చీకోటి ప్రవీణ్‌.. గతంలో గోవాలోని ఓ క్యాసినోలో టేబుల్‌ నిర్వాహకుడిగా పనిచేసేవారు. ఆంధ్ర్రప్రదేశ్ లోని రెండు కీలక నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు నాయకులు అక్కడికి తరచూ వెళ్తుండటంతో వారితో ప్రవీణ్‌కు పరిచయం ఉందనే ప్రచారం కూడా ఉంది. వారి ద్వారానే గుడివాడలో క్యాసినో ఏర్పాటు చేశారు. ఆ ఒక్క ఈవెంట్‌ ద్వారానే కోట్లలో కూడబెట్టారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Gudivada, Hyderabad

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు