హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: హీటెక్కిన గన్నవరం రాజకీయాలు.. వచ్చే ఎన్నికల్లో వంశీకి సీటు ఇస్తే అంతే?

AP Politics: హీటెక్కిన గన్నవరం రాజకీయాలు.. వచ్చే ఎన్నికల్లో వంశీకి సీటు ఇస్తే అంతే?

దుట్టా రామచంద్రరావు, వల్లభనేని వంశీ (ఫైల్)

దుట్టా రామచంద్రరావు, వల్లభనేని వంశీ (ఫైల్)

AP Politics: గన్నవరం రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార పార్టీలో వర్గ పోరు వేరే లెవెల్ కు చేరింది. వారేమైనా మహేష్ బాబు, ప్రభాస్ లా అంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు.. అదే స్థాయిాలో కౌంటర్లు ఇస్తున్నారు దుట్టా, యార్లగడ్డ.. అంతేకాదు అధిష్టానానిక అల్టిమేటమ్ కూడా ఇచ్చారు.

ఇంకా చదవండి ...

  Andhra Pradesh Politics:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎలక్షన్లు దగ్గరపడే కొద్దీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార  వైఎస్సార్‌సీపీ (YSRCP) లో వర్గపోరులు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. నిన్నటి నిన్న మచిలీపట్నం (Machilipatnam) లో పేర్ని నాని, బాలశౌరి వర్గీయులు బాహాబాహీకి దిగగా.. తాజాగా గన్నవరం రాజకీయాలు భగ్గుమంటున్నాయి.  వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) వ్యాఖ్యలకు దుట్ట రామచంద్ర, యార్లగడ్డ ఇద్దరూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దుట్టాకు చెందిన ఆస్పత్రి శంకుస్థానకు వెళ్లిన యార్లగడ్డ మొదట కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 గన్నవరం అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓ విలన్‌పై పోటీ చేసి ఓడిపోయానని.. మట్టి తవ్వకాల్లో అక్రమాలు జరిగాయి అంటూ ఆయక వల్లభనేనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  తాను విలనో, హీరోనో గన్నవరం ప్రజలకు తెలుసునని. అతనో హీరో మహేష్ బాబు, అతని పక్క ఉన్న వ్యక్తి హీరో ప్రభాస్ కాదు కదా అంటూ వల్లభనేని వంశీ తనదైన శైలిలో ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఆ వ్యాఖ్యలపై దుట్ట, యార్లగడ్డ తీవ్రంగా స్పందించారు.

  తాను ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడం లేదన్నారు దుట్టా రామచంద్రరావు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ అధిష్టానం వల్లభనేని వంశీకి టికెట్ ఇస్తే.. తాను కచ్చితంగా సహకరించేది లేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా అధిష్టానానికే చెప్పాను అన్నారు. వైసీపీ కార్యకర్తలు పడే ఇబ్బందుల నేపథ్యంలోనే తాను వంశీకి సహకరించేది లేదని స్పష్టం చేశారు.    యార్లగడ్డ కూడా స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇచ్చారు. వంశీ తరహాలో మాట్లాడడనాకి తమకు సంస్కారం అడ్డువస్తోంది అన్నారు. సినిమాల్లో మహేష్ లాంటి వాడిని అని తాను ఎప్పుడూ అనలేదు అన్నారు. మట్టి తవ్వకాలపై ఎక్కడ.. ఎవరితోనైనా తాను చర్చలకు సిద్ధం అన్నారు. అలాగే సంస్కారం లేని వాడు మాత్రమే ఆయనలా మాట్లాడుతారు అంటూ ఆరోపించారు. వంశీ అంటే తాము భయపడాల్సిన అవసరం లేదన్నారు యార్లగడ్డ.
  ఓ వైపు వైసీపీ అధిష్టానం అందరూ సర్దుకుపోవాలని పదే పదే చెబుతోంది. ఇటీవలే వైసీపీ నేతలను పిలిచి మరీ పార్టీ పెద్దలు క్లాస్ పీకారు.. ఆ తరువాత కూడా పరిస్థితి సద్దుమణగలేదు. అధిష్టానం మందలిచినా పార్టీలో ముఖ్యనేతలంతా ఇలా బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు.  ఓ రేంజ్ లో విమర్శలు చేసుకుటున్నారు.  దీంతో గన్నవరం రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. తాజాగా దుట్టా, యార్లగడ్డ వ్యాఖ్యలపై వంశీ ఎలా స్పందిస్తారో..? మరి దీనిపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. నియోజవర్గంలో ఉన్న కేడర్ మాత్రం తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Gannavaram, Vallabaneni Vamsi, Ysrcp

  ఉత్తమ కథలు