Home /News /andhra-pradesh /

AP POLITICS DUGGIRALA MPP SEAT WIN YCP WITH OUT STRENGTH BECAUSE NO WOMEN BC CANDIDATE IN TPD JANASENA NGS GNT

YCP Win: బలం లేకున్నా.. సభ్యులు గైర్హాజరైనా..? వైసీపీదే దుగ్గిరాల పీఠం.. ఎంపీపీగా రూపవాణి

ఆర్కే వర్సెస్ నారా లోకేష్

ఆర్కే వర్సెస్ నారా లోకేష్

YCP WIn: ఏపీలో తీవ్ర ఉత్కంఠ రేపిన దుగ్గిరా ఎంపీపీ ఎన్నికలో చివరి వరకు హై డ్రామా కొనసాగింది. ప్రతిపక్షాలకు బలం ఉండడం.. వైసీపీకి మెజార్టీ లేకపోవడంతో ఎన్నిక ఇంట్రెస్టింగ్ గా మారింది. కానీ చివరికి బలం లేకపోయినా.. వైసీపీనే ఎంపీపీ పీఠం వరించింది. ఎలాగో తెలుసా..?

ఇంకా చదవండి ...
    YCP Win: అక్కడ జరిగింది ఏంపీపీ ఎన్నికే అయినా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నింపింది.. ఎందుకంటే.. అది నారా లోకేష్ (Nara Lokesh) పోటీ చేసి ఓడిన మంగళగిరి నియోజకవర్గం.. ఆ పరిధిలోకి వచ్చే దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక కావడం.. అందులోనూ టీడీపీ (TDP)కి బలం ఎక్కువగా ఉండడం.. టీడీపీకి జనసేన (Janasena) మద్దతు ఇవ్వడంతో ఈ ఎన్నికపై ఉత్కంఠ పెరిగింది. చివరి వరకు హైడ్రామా కొనసాగింది. రెండు రోజుల నుంచి తీవ్ర ట్విస్టులు కనిపించిన ఈ ఎన్నిక.. ఉత్కంఠ మధ్యే ముగిసింది. గతేడాది జరిగిన ఎంపీటీసీ  (MPTC) ఎన్నికల్లో వైసీపీ (YCP) కంటే టీడీపీకి మెజారిటీ స్ధానాలు లభించాయి. దానికి తోడు జనసేన మద్దతు ఇచ్చింది. మరోవైపు వైసీపీలో రెబల్స్ బయటకు వచ్చారు. అయినా.. అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేసి ఈ ఎన్నికను తమవైపు తిప్పుకుంది. అధికార పార్టీ వ్యూహాలు అన్ని వర్కౌట్ అయ్యాయి. దీంతో వైసీపీ ఎంపీపీ అభ్యర్ధిగా నిలబెట్టిన సంతోషి రూపవాణి (Santhoshi Rupa Vani) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గతేడాది జరిగిన దుగ్గిరాల ఎంపీపీ పరిధిలోని ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తం 18 సీట్లకు గానూ టీడీపీకి 9, వైసీపీకి 8, జనసేనకు 1 సీటు దక్కింది. ఇక్కడ సీఎం జగన్ ఉండే మంగళగిరి నియోజకవర్గం పరిధిలో దుగ్గిరాల ఉండడంతో ఈ ఎన్నికను అధికార పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే వైసీపీ ఓడితే విపక్ష టీడీపీ అది జగన్ ఓటమిగా ప్రచారం చేసే అవకాశం ఉంది. అంతేకాదు దీన్ని లోకేష్ గెలుపుగా కూడా చెప్పుకునే ప్రమాదం ఉంది. అందుకే అధికార పార్టీ మొదటి నుంచి వ్యూహాత్మకంగా పావులు కదిపింది.

    ఇదీ చదవండి : పెద్దమనసు చాటుకున్న బాలయ్య.. అనారోగ్యం బారిన పడిన అభిమానికి వీడియో కాల్? ఏం మాట్లాడారో చూడండి.?

    ముందుగా బీసీ మహిళకు రిజర్వ్ అయిన ఎంపీపీ స్ధానానికి పోటీ పడుతున్న టీడీపీ ఎంపీటీసీని బీసీ ధృవపత్రం ఇవ్వకుండా అనర్హురాలిగా ప్రకటించింది. ఇక ఆ తరువాత వైసీపీ నుంచి గెలిచి ఎంపీపీ స్ధానానికి రెబల్ గా పోటీ పడుతున్న పద్మావతి అనే మరో ఎంపీటీసీని కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అది కూడా స్థానిక ఎమ్మెల్యే ఆర్కేనే ఆమెను కిడ్నాప్ చేశారని.. ఆమె కుటుంభ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఆరోపణలు ఎలా ఉన్నా..? ఎమ్మెల్యే ఆర్కేతో పాటు క్యాంప్ కు వెళ్లిన పద్మావతి నేటి ఎన్నికకు గైర్హాజరయ్యారు.

    ఇదీ చదవండి : : రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు.. నిబంధనలు ఇవే.. ఒక్క నిమిషం ఆలస్యం అయితే నో ఎంట్రీ

    దీంతో వైసీపీ వ్యూహం ఏంటో విపక్షాలకు అర్థమైనా.. మరో బీసీ అభ్యర్థి లేకపోవడంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. 18 సీట్ల బలం ఉన్న చోట.. వైసీపీకి కేవలం ఐదు సీట్లే ఉన్నా..? ఆ సభ్యుల మద్దతుతోనే వైసీపీ సొంతం చేసుకుంది. ఎందుకంటే ఎంపీటీసీ సంతోషి రూపవాణి మినహా మరో అభ్యర్ధి మూడు పార్టీల్లోనూ బీసీ మహిళ దొరకలేదు. దీంతో ఏకైక బీసీ మహిళ అయిన రూపవాణి ఎన్నిక ఏకగ్రీవంగా మారింది. రెండు వైస్ ఎంపీపీ సీట్లను మాత్రం టీడీపీ, జనసేన చెరొకటి దక్కించుకున్నాయి. అయితే ఈ ఎన్నికల్ని మాత్రం వైసీపీ సభ్యులు బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Janasena, Mangalagiri, Nara Lokesh, TDP, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు