Home /News /andhra-pradesh /

AP POLITICS DIVYA VANI MADE SENSATIONAL ALLEGATIONS ON TDP AS SHE RESIGNS TO PARTY FULL DETAILS HERE PRN

Divya Vani: ఆ ఇడియట్ అన్యాయం చేశాడు.. టీడీపీ నేతపై దివ్యవాణి సంచలన కామెంట్స్.. పార్టీకి రాజీనామా

దివ్యవాణి సంచలన కామెంట్స్

దివ్యవాణి సంచలన కామెంట్స్

తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) కి ఆ పార్టీ అధికార ప్రతినిథి దివ్యవాణి (Divya Vani) రాజీనామా చేశారు. పార్టీలో ఎదురవుతున్న అవమానాలు భరించలేకే తాను బయటకు వస్తున్నట్లు తెలిపారు.

    తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) కి ఆ పార్టీ అధికార ప్రతినిథి దివ్యవాణి (Divya Vani) రాజీనామా చేశారు. పార్టీలో ఎదురవుతున్న అవమానాలు భరించలేకే తాను బయటకు వస్తున్నట్లు తెలిపారు. ఓ మంచి నాయకుడితో పనిచేయలనే లక్ష్యంతోనే టీడీపీలో చేరినట్లు ఆమె తెలిపారు. గత ఏడాదిగా పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. టీడీపీ ముఖ్యనేతల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ మతమార్పిడుల గురించి మాట్లాటితే తాను ప్రశ్నించానని దివ్యవాణి గుర్తుచేశారు. ఓ వ్యక్తి గురించి వ్యవస్థను ఎలా అంటారని ప్రశ్నించినట్లు తెలిపారు. అప్పటి నుంచి పార్టీలో తనను అవమానాలకు గురిచేస్తున్నారని.. చంద్రబాబుకు కొందరు రాంగ్ డైరెక్షన్స్ ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. డబ్బులిస్తే వచ్చే రిపోర్టులపై ఆధారపడవద్దన్నారు. మత మార్పిడుల విషయంలో తానిచ్చిన సమాచారాన్ని టీడీ జనార్ధన్ వేరొకరికి ఇచ్చి చెరప్పించారన్నారు. ఆ తర్వాత తాను మాట్లాడిన విషయాలతో క్రైస్తువుల్లో టీడీపీపై ఉన్న వ్యతిరేకత పోయిందన్నారు.

    పార్టీలో టీడీ జనార్ధన్ తనకు అన్యాయం చేశారని ఆమె ఆరోపించారు. కొంతమంది డబ్బులు తీసుకొని తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారంటూ సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీలో మహిళా నేతలు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వారిని వేధిస్తునారంటూ దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది బయటపడలేక కుమిలిపోతున్నారని.. పదవుల కోసం వేధిపులు భరిస్తున్నారన్నారామె. గాడ్ ఫాదర్స్ ఉన్న నేతలకే పదవులు, ప్రాధాన్యత దక్కుతున్నాయన్నారు.

    ఇది చదవండి: వైసీపీ ప్లీనరీకి ముహూర్తం ఫిక్స్.. 2024 ఎన్నికలే టార్గెట్.. జగన్ వ్యూహం ఇదేనా..!


    ఐతే తనకు ఎలాంటి పెద్దల సపోర్ట్ లేదన్నారు. కొంతమంది నాయకులు టీడీపీ కార్యాలయ సిబ్బందికి మామూళ్లిచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారన్నారు. చంద్రబాబుకు మనస్సాక్షి ఉంటే నిజాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. ప్రెస్ మీట్లు పెట్టాలంటే పార్టీ నేతలను అడుక్కోవాల్సి ఉంటుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

    ఇది చదవండి: విశాఖపై టీడీపీ కీలక నిర్ణయం..? ప్లేస్ మారనున్న బాలయ్య చిన్నల్లుడు..?


    ముక్కుసూటితనంగా మాట్లాడుతున్నందునే తనను పార్టీలో తొక్కేశారని దివ్యవాణి ఆరోపించారు. టీడీ జనార్ధన్ ను ప్రశ్నించినందుకే తనను అవమానించారన్నారు. ఇక మహానాడులో మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదని చెప్పారు. మాట్లాడేందుకు అవకాశమివ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు పలువురు నేతలను అడుక్కున్నా పట్టించుకోలేదన్నారు.

    ఇది చదవండి: ఏపీలో వాళ్లకే బీపీ ఎక్కువ.. సర్వేలో షాకింగ్ నిజాలు


    ప్రస్తుతానికి టీడీపీ నుంచి బయటకు వచ్చానని.. రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు దివ్యవాణి. ప్రజశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనను పిలిచి మాట్లాడారన్నారు. పార్టీలోకి వస్తే మంచి స్థానమిస్తామన్నారని చెప్పారు. కేఏ పాల్ అంటే ఓ కామెడీ అయిపోతున్నాడు చూసుకోండి అని సూచించగా.. కొందరు తన కామెంట్స్ ను కామెడీ చేస్తున్నట్లు పాల్ తనతో చెప్పినట్లు దివ్యవాణి వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను అనవసర విషయాల్లోకి లాగొద్దన్నారు దివ్యవాణి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, TDP

    తదుపరి వార్తలు