హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Cm Jagan: శ్రీకాకుళంలో శాశ్వత భూహక్కు పత్రాల పంపిణీ..సీఎం జగన్ కీలక ప్రకటన

Cm Jagan: శ్రీకాకుళంలో శాశ్వత భూహక్కు పత్రాల పంపిణీ..సీఎం జగన్ కీలక ప్రకటన

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

శ్రీకాకుళంలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా నరసన్నపేటలో జగనన్న శాశ్వత భూహక్కు-భూ రక్షణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి విడతలో 2 వేల గ్రామాల్లో రైతులకు భూహక్కు పత్రాలను పంపిణి చేశారు. రెండో దశ 2023 ఫిబ్రవరి నాటికి 4 వేల గ్రామాల్లో పూర్తి కానుంది. ఇలా నెలల వారీగా ఆయా గ్రామాల్లో సర్వే పూర్తి చేయనున్నారు. ఇక డిసెంబర్ 2023 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం పూర్తి కావాలని సీఎం వెల్లడించారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh |

శ్రీకాకుళంలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా నరసన్నపేటలో జగనన్న శాశ్వత భూహక్కు-భూ రక్షణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి విడతలో 2 వేల గ్రామాల్లో రైతులకు భూహక్కు పత్రాలను పంపిణి చేశారు. రెండో దశ 2023 ఫిబ్రవరి నాటికి 4 వేల గ్రామాల్లో పూర్తి కానుంది. ఇలా నెలల వారీగా ఆయా గ్రామాల్లో సర్వే పూర్తి చేయనున్నారు. ఇక డిసెంబర్ 2023 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం పూర్తి కానుందని సీఎం వెల్లడించారు.

Unstoppable 2 with NBK: బాలయ్య షోలో ఏపీ క్యాపిటల్‌ హీట్.. 3 రాజధానులపై మాజీ సీఎం, స్పీకర్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

2 ఏళ్ల క్రితమే ప్రారంభం..

భూవివాదాలు లేకుండా చేయడం మా లక్ష్యం. 2 ఏళ్ల క్రితమే భూ రికార్డు ప్రక్షాళన మొదలయింది. లంచాలు అడిగే పరిస్థితి రావొద్దు. లంచాలు అడగాలంటే జగనన్న ఉన్నారనే భయం ఉంటుంది. మొదటి దశలో 2 వేల గ్రామాల్లో సర్వే పూర్తి అయింది. రెండో దశలో 4 వేల గ్రామాల్లో సర్వే ఫిబ్రవరి నాటికి పూర్తి కానుంది. ఇక మూడో విడత సర్వే 6 వేల గ్రామాల్లో మే నెలలోపు పూర్తి అవుతుందని సీఎం తెలిపారు.  2023 డిసెంబర్ కల్లా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తి అవుతుందన్నారు.

ఇదీ చదవండి : రేప్ కు గురి కాకుండా క్షణాల్లో మహిళను కాపాడిన దిశా యాప్.. అసలు ఏం జరిగింది అంటే..? యాప్ ఎలా ఉపయోగించాలి?

మరో 17 కాలేజీలు..

రాష్ట్రంలో మరో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్టు సీఎం తెలిపారు. అలాగే ఇచ్చాపురం కిడ్నీ బాధితుల కోసం మానవతా దృక్పధంతో డయాలసిస్ చికిత్స కోసం రూ.10 వేలు ఇచ్చే గొప్ప కార్యక్రమం చేపట్టామని జగన్ గుర్తు చేశారు. ఇన్ని రోజులు చంద్రబాబుకు వీరు గుర్తు రాలేదని ఎద్దేవా చేశారు.

సొంత మామకే వెన్నుపోటు..

ఆస్తిని అనుభవించేవాడిని హక్కుదారుడని అంటాం. కానీ ఇతరుల ఆస్తులను కాజేసే వాళ్ళను కబ్జాదారుడని అంటారు. తన భార్య కోసం యుద్ధం చేస్తే రాముడు అంటాం. కానీ పరాయి స్త్రీ కోసం చేస్తే రావణుడని అంటాం. మామకు వెన్నుపోటు పొడిచే వారిని చంద్రబాబు అంటాం. సొంతంగా పార్టీని పెట్టి ఎదిగితే ఎన్టిఆర్, ఎంజీఆర్, జగన్ అంటారు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన వారిని చంద్రబాబు అంటారు. మరి రావణుడిని సమర్ధించే వాడిని రాక్షసుడు అంటాం.  మరి మామకు వెన్నుపోటు పొడిచి సిటు లాక్కున్న వాడిని అసెంబ్లీకి పంపాలా అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తికి మరో ఛాన్స్ ఇస్తారా లేక, మీ సేవలు వద్దు బాబోయ్ బై బై అని ఇంటికి పంపాలా? వద్దా అని అన్నారు.

First published:

Tags: Ap, Ap cm jagan, AP News

ఉత్తమ కథలు