హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Cabinet: కూరలో కరివేపాకులా కీలక జిల్లా.. సీఎం జగన్ నిర్ణయంపై వైసీపీ నేతల షాక్..

AP Cabinet: కూరలో కరివేపాకులా కీలక జిల్లా.. సీఎం జగన్ నిర్ణయంపై వైసీపీ నేతల షాక్..

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా జిల్లాలకు మంత్రి పదవు కేటాయింపు హైలెట్ అవుతోంది. విశాఖపట్నం విషయంలో ఏపీ వైసీపీ సర్కారుకు అంత మంచి అభిప్రాయం ఉన్నట్టు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకుల మాట.

ఇంకా చదవండి ...

  P Anand Mohan, News18,Visakhapatnam

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా జిల్లాలకు మంత్రి పదవు కేటాయింపు హైలెట్ అవుతోంది. విశాఖపట్నం విషయంలో ఏపీ వైసీపీ సర్కారుకు అంత మంచి అభిప్రాయం ఉన్నట్టు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకుల మాట. చిన్న జిల్లాగా మర్చేయడం.. రాజధాని విషయమే ఎత్తకపోవడం.. ఇప్పుడు మంత్రి పదవి కూడా కేటాయించకపోవడం పై వైసీపీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. బయటకు ఎవరూ నోరెత్తకపోయినా.. సీఎం జగన్ నిర్ణయం పై పెదవివిరుస్తున్నాయి పార్టీ వర్గాలు. ఇది వైసీపికి అతి పెద్ద మైనస్ అవుతుందని.. ప్రతిపక్ష టీడీపీకీ అస్త్రం అవుతుందని అంటున్నారు. తర్వాత ఎన్నికలకు ఇది ఏమంత మంచి సంకేతం కాదంటూ మాట్లాడుకుంటున్నారు.

  ఒకప్పుడు అతిపెద్ద జిల్లా విశాఖ. దాన్ని ఎలాగూ జిల్లాల ఏర్పాటులో అతి చిన్న జిల్లాగా మార్చేశారు. పోనీ అప్పుడైనా దానికి ప్రాధాన్యత దక్కుతుందని విశాఖ వాసులు సరిపెట్టుకున్నారు. కానీ.. విశాఖకి అసలు ఉనికే లేకుండా చేద్దామనే ప్రయత్నాలు ఇప్పుడు వైసీపీలో జరుగుతున్నాయనేది టాక్. వైసీపీ విశాఖ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు పెద్ద పొరపాటుగానే చూడాలంటారు రాజకీయ విశ్లేషకులు. విశాఖ విషయంలో ఇప్పటికే తప్పిదాలు జరిగాయని.. మళ్లీ మరిన్ని తప్పులు చేస్తూ పోతోందని.. పార్టీ పై బహిరంగంగానే కార్యకర్తలు ఆడిపోసుకుంటున్నారు.

  ఇది చదవండి: సీబీఐకి దత్తపుత్రుడు.. చర్లపల్లి షటిల్ టీమ్..! జగన్ కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్..


  విశాల నగరం విశాఖ కుంచించుకుపోయింది. ఇప్పుడు కేవలం ఏడు నియోజకవర్గాల నగరం జిల్లా అయిపోయింది. మొదట్లో పదిహేను నియోజకవర్గాలు ఉన్న విశాఖ జిల్లా ఇప్పుడు కేవలం ఏడు నియోజకవర్గాల తీర ప్రాంత నగరం. గత టీడీపీ హయాంలో ఆర్ధిక రాజధాని అంటే నగరవాసులు పొంగిపోయారు. వైసీపీ వచ్చిన తర్వాత మూడు రాజధానులు.. పరిపాలనా రాజధాని అంటే మురిసిపోయారు. కానీ.. రాజధాని లేదు. జిల్లాను చిన్నగా మార్చేశారు. మొన్నటి కొత్త మంత్రివర్గం ఏర్పాటులో కనీసం ఈ జిల్లాకు ప్రాధాన్యత లేదు. ఇక్కడ ముగ్గురు ఎమ్మెల్యే ఉన్నారన్న సోయ లేదు. కనీసం ఈ నగరాన్ని తర్వాత గెలుచుకుంటామన్న ఆలోచన కూడా లేదా.. అంటూ కార్యకర్తల ప్రశ్న.

  ఇది చదవండి: రాసిపెట్టుకోండి.. చరిత్ర తిరగరాస్తా.. స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు..


  ఇక కొత్త విశాఖ జిల్లా నగరాన్ని టీడీపీ తన వైపు తిప్పుకోవడానికి అట్టే సమయం పట్టేటట్టు లేదు. వైసీపీ మొదట్నించి విశాఖ విషయంలో పెద్ద ఫోకస్ చేస్తున్నట్టు కనిపించలేదు. 2019 ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాలైన ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ టీడీపీ గెలుచుకుంది. అంతటి జగన్ వేవ్ లో కూడా నలుగురు ఎమ్మెల్యేలని గెలిపించారు విశాఖ వాసులు. పక్కనే ఉన్న భీమిలీ, గాజువాక, పెందుర్తి అక్కడి రాజకీయ కారణాలతో కొద్దిపాటి ఓట్ల తేడాతోనే టీడీపీ నేతలు ఓడిపోయారు. ఇదంతా కూడా వైసీపీ సరిగ్గా ఫోకస్ చేయని కారణంగానే జరిగిందని.. కూడా అప్పట్లో టాక్ నడిచింది.

  ఇది చదవండి: కేబినెట్ ఏర్పాటు తర్వాత జగన్ తొలి రివ్యూ ఆమెతోనే.. విడదల రజినీ లక్కీ ఛాన్స్..


  కట్ చేస్తే.. విశాఖకు సారధిగా వచ్చిన విజయసాయిరెడ్డి ఈ పరిస్థితిని అప్పుడే గమనించి.. మినీ ఎన్నికలైన పంచాయితీ.. జీవిఎంసీ ఎన్నికల్లో టీడీపి ప్రభావాన్ని తగ్గించాలని చూశారు. దానికి తగ్గట్టు లోకల్ రాజకీయాల్లో తన మార్క్ ను ప్రదర్శించారు. దీంతో పంచాయితీ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీని సంపాదించి పెట్టారు. కానీ.. జీవిఎంసీ ఎన్నికల్లో టీడీపీ ఏ ప్రయత్నం చేయకుండా ముప్పై వార్డులు గెలుచుకుంది. ఇక్కడ ముప్పై కీలక వార్డుల్లో టీడీపీ కార్పొరేటర్లు గెలిచి టీడీపీ పనైపోలేదని నిరూపించారు. నిజానికి టీడీపీ కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే.. మరో ఇరవై వార్డులు గెలుచుకునేది. అయితే అప్పటి రాజకీయ పరిణామాల నేపధ్యంలో టీడీపి వెనక్కి తగ్గిందని టాక్ కూడా నడిచింది. మొత్తం మీద విజయసాయిరెడ్డి తన మార్క్ రాజకీయాల్ని వాడి.. ఇక్కడి టీడీపీని తగ్గించే ప్రయత్నం చేశారు.

  ఇది చదవండి: ఒకప్పుడు ఐరన్ లెగ్ ముద్ర.. ఇప్పుడు మంత్రి పదవి.. రోజాకు కలిసొచ్చిన అంశాలేంటి..!


  ఇక ఆతర్వాత వైసీపీ ఎక్కడా పుంజుకునే ప్రయత్నం చేయలేదనే చెప్పాలి. జీవిఎంసీ ఎన్నికల గెలుపు తర్వాత వైసీపీ విజయసాయిరెడ్డిని కొన్నాళ్లు పక్కన పెట్టిందనే టాక్ నడిచింది. ఇక ఆ తర్వాత మళ్లీ ఆయనకు రాష్ట్రంలో కీలక బాధ్యతలు ఇవ్వగానే విశాఖ వైపు విజయసాయి ఫోకస్ ప్రారంభించారు. కానీ.. మంత్రి వర్గం విస్తరణలో మొత్తం గాలి తీసేసింది వైసీపీ అధిష్టానం. మంత్రి వర్గ కూర్పులో ఉత్తరాంధ్ర బాధ్యుడు విఎస్ఆర్ కు ఎలాంటి సమాచారం.. ప్రాధాన్యత లేదని చెప్పుకుంటున్నారు. అలాగే విశాఖకి కూడా ఎలాంటి మంత్రి పదవి కేటాయించకుండా వదిలేశారు. మొన్నటిదాకా కొనసాగిన మంత్రి అవంతిని కూడా ఇప్పుడు మాజీ మంత్రిగా కూర్చోబెట్టారు.

  ఇది చదవండి: టాలీవుడ్ హీరోగా ఏపీ మంత్రి.. వైరల్ అవుతున్న ఫోటోలు.. మీరు గుర్తుపట్టగలరా..?


  ఇంతకీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో.. అర్థం కాక వైసీపీ నేతలు బుర్రలు గోక్కుంటున్నారు. విశాఖను ఏం చేద్దామని వీళ్లు నిర్ణయించుకున్నారో తెలియడం లేదని గింజుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ ప్రభావం గ్రౌండ్ లెవెల్లో స్పష్టంగా ఉంది. ఇలాంటి సమయంలో వైసీపీ క్యాడర్ కి ఊతమిచ్చే పని చేయకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంతో ఇబ్బందులు తప్పవని ఇక్కడి నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఏతావాతా.. ఇది టీడీపీకీ కలిసొచ్చే అంశం కావడంతో ఇక్కడి ముఖ్యనాయకులకు మరింత మండిపోతోంది. అధిష్టానం తమ మాట వినడం లేదనే బాధ కూడా వారిలో కనిపిస్తోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Visakhapatnam

  ఉత్తమ కథలు