హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Liquor Issue: ఏపీలో మద్యపాన నిషేధం సాధ్యమేనా..? ఆ విషయంలో జగన్ సర్కార్ ఫెయిల్ అయిందా..?

AP Liquor Issue: ఏపీలో మద్యపాన నిషేధం సాధ్యమేనా..? ఆ విషయంలో జగన్ సర్కార్ ఫెయిల్ అయిందా..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో దశలవారీగా సంపూర్ణ మధ్యపాన నిషేధం అమలుచేస్తామంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం జగన్ (CM YS Jagan) హామీఇచ్చారు. అనుకున్నట్లుగానే వైసీపీ (YSRCP) అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం దిశగా అడుగులు పడినట్లు కనిపించినా ఆ తర్వాతి కాలంలో మాత్రం ఆదిశగా తీసుకుంటున్న చర్యలు మాత్రం శున్యం అనే చెప్పాలి.

ఇంకా చదవండి ...

  Anna Raghu, News18­, Guntur

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో దశలవారీగా సంపూర్ణ మధ్యపాన నిషేధం అమలుచేస్తామంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం జగన్ (CM YS Jagan) హామీఇచ్చారు. అనుకున్నట్లుగానే వైసీపీ (YSRCP) అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం దిశగా అడుగులు పడినట్లు కనిపించినా ఆ తర్వాతి కాలంలో మాత్రం ఆదిశగా తీసుకుంటున్న చర్యలు మాత్రం శున్యం అనే చెప్పాలి. 2019లో కొత్త ప్రభుత్వం ఏర్పడేనాటికి రాష్ట్రంలో అప్పటికే ఉన్న 4,380 వైన్ షాపులు ఉండగా వాటిని 3,500 కు తగ్గించటంతో పాటు వీటిని ప్రభుత్వమే నడపేలా చర్యలు తీసుకున్నారు. ప్రతియేటా 20% వైన్ షాపులను తగ్గిస్తూ ఐదేళ్ళ కాలంలో పూర్తిగా వైన్ షాపులను ఎత్తేస్తామంటూ అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. మద్యం తాగాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు కల్పిస్తామని,పెద్దపెద్ద మాల్స్,5నక్షత్రాల హోటల్స్ లో మాత్రమే మద్యం అందుబాటులో ఉండేలా చేస్తామని అక్కడకూడా ధరలు భారీగా ఉండేలా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

  సీన్ కట్ చేస్తే మూడేళ్ళలో ప్రభుత్వం మద్యం షాపులపై అనేక పిల్లిమొగ్గలు వేసిందనే చెప్పాలి. ప్రభుత్వం వైన్ షాపులలో మద్యం ధరలను అమాంతం పెంచేయడంతో పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ మద్యం ఏరులై పారింది. దీనిని కట్టడి చేయటానికి నానాతంటాలు పడిన ప్రభుత్వం చివరికి ధరలను కొంతమేర తగ్గించక తప్పలేదు. పై పెచ్చు అనేక రకాల కొత్త రకం బ్రాండ్లను మార్కెట్ లోకి విడుదల చేసి అప్పటి వరకు ఉన్న బ్రాండ్ లలో దాదాపు 90% బ్రాండ్ లను ఎత్తేసింది.

  ఇది చదవండి: తుఫాన్ గా మారనున్న అల్పపీడనం.. ఏపీపై ప్రభావం ఇలా.. వారికి హెచ్చరిక

  దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. ఏ ప్రభుత్వానికైనా మద్యంపై వచ్చే ఆదాయమే సింహభాగం ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అసలే ఆర్ధిక లోటు పైగా ప్రభుత్వానికి ఏ విధమైన రాబడి లేక పోవడంతో చివరికి మద్యంపై వచ్చే ఆదాయంపై ఆధారపడక తప్పలేదు. దీంతో విహారస్థలాలు పేరుతో సుమారు 175 వాల్క్ ఇన్ ఇక్వర్ మాల్స్ ను ఏర్పాటు చేసింది.

  ఇది చదవండి: మళ్లీ అదే ఫార్ములాను నమ్ముకున్న జగన్.. ఈసారి కూడా వర్కవుట్ అవుతుందా..

  ఇక ప్రభుత్వ దుకాణాలలో దొరుకుతున్న కొత్త బ్రాండ్ ల మద్యం నాసిరకంగా ఉందంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. జగన్ తన సొంత మనుషులతో వివిధ రకాల బ్రాండ్ లను తయారు చేపించి మార్కెట్ లోకి వదులుతున్నారని, దీంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మద్యం తయారీ దారుల నుండి ముఖ్యమంత్రికి ఏడాదికి రూ.5వేల కోట్ల మేర ముడుపులు అందుతున్నాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రమైన విమర్శలే చేశారు. దీంతో ప్రభుత్వ వైన్ షాపులలో పూర్వం లభించిన బ్రాండ్ల మధ్యం కూడా అందుబాటులో ఉంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

  ఇది చదవండి: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్స్ కొత్త షెడ్యూల్ ఇదే..

  ఒకానొక దశలో ప్రభుత్వంలోని కొందరు మంత్రులు మాట్లాడుతూ మేము మద్యపాన నిషేధం అని ఎప్పుడూ చెప్పలేదని ,మద్యపాన నియంత్రణ అని మాత్రమే కొత్తపల్లవి అందుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కరకట్ట రోడ్డులో వెలసిన ఫ్లెక్సీలలో సీఎం జగన్, ఎక్సైజ్ మంత్రి నారాయణ, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ల ఫోటోలతో వెలసిన ఫ్లెక్సీలలో "మద్యపాన నియంత్రణ"అంటూ రాసి ఉండటం ప్రభుత్వ ఆలోచన తెలియజేసేలా ఉంది.

  ఇది చదవండి: ఇంటిపన్ను కట్టకుంటే సామాన్లు జప్తు.. వాహనంతో సహా బయలుదేరిన అధికారులు..

  ప్రస్తుత ఆధునిక సమాజంలో మద్యం ప్రజల జీవనంలో భాగం అయింది అనేది కాదనలేని సత్యం, అలానే ప్రభుత్వాలు మనుగడ సాగించాలన్నా మద్యంపై వచ్చే ఆదాయమే ప్రధాన వనరుగా మారింది అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితులలో ఏ ప్రభుత్వమైనా మద్యపాన నిషేధం అమలు చేయాలంటే పాలకుల్లో ఎంతో చిత్తశుధ్ధి అవసరం. అలాకాకుండా సరైన విధివిధానాలు లేకుండా తూతూమంత్రంగా వ్యవహరిస్తే మాత్రం జంగారెడ్డిగూడెం వంటి ఘటనలు పునరావృతమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  First published:

  Tags: Andhra Pradesh, Ap government, Liquor ban

  ఉత్తమ కథలు