హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP POLITICS: చంద్రబాబుతో రజనీకాంత్ భేటీ ..స్నేహమా..? యాధృచ్చికమా..? వ్యూహమా..?

AP POLITICS: చంద్రబాబుతో రజనీకాంత్ భేటీ ..స్నేహమా..? యాధృచ్చికమా..? వ్యూహమా..?

rajini,chandrababu(Photo:Twitter)

rajini,chandrababu(Photo:Twitter)

AP POLITICS: సౌత్ సూపర్ స్టార్ టీడీపీ అధినేతను కలవడం స్నేహమా లేక వ్యూహమా అది కాక యాధృచ్చికమా..? ఇప్పుడు ఈ అంశంపైనే ఏపీ రాజకీయాల్లో హాట్‌ హాట్ చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్‌ భేటీ అయిన మరుసటి రోజే తలైవా కలవడానికి కారణం ఏమై ఉండవచ్చని అంటున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఏపీలో రాజకీయ నేతల్ని దక్షిణాది తారలు కలవడం పొలిటికల్‌ సర్కిల్‌లో చర్చనీయాంశమవుతోంది. ఈమధ్య కాలంలో జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పార్టీ నేతలను ఏదో ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులు కలవడం, వారితో చర్చించడం రాజకీయంగా కొత్త చర్చకు తావిస్తోంది. ఇదంతా ఇప్పుడెందుకు తెరపైకి వచ్చిందంటే..సోమవారం హైదరాబాద్‌కు వచ్చిన సౌత్ సూపర్‌ స్టార్, తలైవా రజనీకాంత్‌ (Rajinikanth)మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. అంతే కాదు..ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రియమైన మిత్రుడు రజనీకాంత్‌ను శాలువతో సత్కరించారు. తన స్నేహితుడ్ని కలవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందంటూ చంద్రబాబునాయుడు(Chandrababu naidu)ట్విట్‌(Tweet) చేశారు. అయితే కొద్ది రోజుల క్రితమే తమిళ సినీ రంగానికి చెందిన విశాల్‌(Vishal)సైతం ప్రస్తుత సీఎం జగన్‌(Jagan)ను కలవడం కూడా జరిగింది. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు, ఎంపీ రాహుల్‌గాంధీ(Rahul Gandhi)ని లోకనాయకుడు కమల్‌హాసన్‌(Kamal Haasan)కలిశారు. రీసెంట్‌గా యూపీ సీఎం యోగీ(YOGI)తో బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్‌(Akshay Kumar)భేటీ అయ్యారు. జాతీయ స్థాయి నేతల్ని కలిసిన సంగతి పక్కన పెడితే ..ఏపీలో మాత్రం రజనీకాంత్‌ చంద్రబాబు కలయిక వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందనే చర్చ మొదలైంది.

Anantapur: పవన్ ఇక్కడ నుంచి పోటీ చేస్తే? త్యాగానికి సిద్ధం.. టీడీపీ నేత సంచలన నిర్ణయం

పొలిటికల్ డెవలప్‌మెంట్..

రాజకీయాల్లోకి సినిమా తారలు ప్రవేశించడం కారణమో లేక మరేదైనా కారణమో తెలియదు కాని సినిమా హీరోలు ..రాజకీయ నాయకుల్ని కలవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ..సోమవారం హైదరాబాద్‌లోని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి నివాసానికి వెళ్లారు. సౌత్ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్.ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. కాసేపు ముచ్చటించారు. తనను కలిసేందుకు ప్రియమిత్రుడు రజనీకాంత్ రావడం తాలా సంతోషంగా ఉందని .. చంద్రబాబు ట్వీట్ చేశారు. అయితే వీరిద్దరి భేటీలో రాజకీయ ప్రాధాన్యత లేకపోయినప్పటికి కలుసుకోవడంపై మాత్రం పొలిటికల్ సర్కిల్‌లో విస్తృతమైన చర్చ జరుగుతోంది.

టీడీపీ అధినేతతో తలైవా భేటీ..

హీరో రజనీకాంత్‌ షూటంగ్‌ నిమిత్తం హైదరాబాద్‌ వచ్చి చంద్రబాబును కలిశారా లేక కుప్పం ఘటన తెలుసుకొని మిత్రుడికి మద్దతివ్వడానికి వచ్చారా అనే విషయాలు మాత్రం బయటకురాలేదు. తలైవా టీడీపీ అధినేతతో భేటీకి ముందు రోజే టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చంద్రబాబుతో భేటీ కావడం ..సుమారు రెండు గంటల పాటు చర్చించడం ఏపీ పాలిటిక్స్‌లో కాక రేపింది. ఇక ఇదే టైమ్‌లో రజనీకాంత్‌ కూడా చంద్రబాబుని కలవడం చూస్తుంటే పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన రజనీకాంత్‌ రాజకీయ పార్టీ ప్రకటించి...ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబును కలవడం చూస్తుంటే తన మద్దతు, తన అభిమానుల మద్దతు టీడీపీకే ఉందని చెప్పడానికే తలైవా బాబును కలిశారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

స్నేహమా లేక వ్యూహమా..?

రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా తమిళ నటుడు విశాల్ పోటీ చేస్తారనే వార్త జోరుగా ప్రచారం జరిగింది. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే చర్చ జరుగుతుండగానే ..విశాల్ ఏపీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ని తాడేపల్లి వెళ్లి కలిశారు. అనంతరం జగన్ అన్న అంటే ఇష్టమని చెప్పిన విశాల్ అలాగని కుప్పం నుంచి తాను పోటీ చేయడం అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. విశాల్,జగన్ ఎపిసోడ్‌ ముగిసిన కొద్ది రోజులకే రజనీకాంత్‌ చంద్రబాబుని కలయికపై కూడా కొత్త చర్చ జరుగుతోంది. తలైవా రజనీకాంత్‌ ఫాలోయింగ్‌ని ఉపయోగించుకొని చిత్తూరు జిల్లాలోని తమిళనాడుకు దగ్గరగా ఉన్న కుప్పం, నగరి వంటి నియోజకవర్గాల్లో గెలుపు కోసమే అనే వార్తలు వినిపిస్తున్నాయి.

First published:

Tags: Andhra pradesh news, Chandrababu Naidu, Super star Rajinikanth

ఉత్తమ కథలు