Home /News /andhra-pradesh /

AP POLITICS DIRECTOR RAGHAVENDRA RAO SAID THAT HE WANTS TO SEE CHANDRABABU AS THE CHIEF MINISTER AGAIN TO SERVE THE TDP SNR

Raghavendra Rao:మళ్లీ చంద్రబాబును సీఎంగా చూడాలి..అందుకోసం ఆయన ఏం చేయమన్నా చేస్తా

(డైరెక్టర్ డైలాగ్స్)

(డైరెక్టర్ డైలాగ్స్)

Raghavendra Rao:చంద్రబాబు మీ రుణం తీర్చుకోలేనిదన్నారు డైరెక్టర్ రాఘవేంద్రరావు. మిమ్మల్ని మళ్లీ సీఎంగా చూడాలని ఆశీస్తున్నానని మనసులో మాట బయటపెట్టారు. అందుకు మీరు ఏం చేయమంటారో చెప్పండి చేయడానికి మేం సిద్ధంగా ఉన్నామని టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకల్లో చెప్పారు.

ఇంకా చదవండి ...
నాలుగు దశాబ్ధాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం (Telugudesam)పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ ఓ మౌనమునిగా మాట్లాడారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ నుంచి ఇప్పడున్న జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు (Chandrababu)పై తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఓపెన్‌గా చెప్పేశారు. ఆయన ఎవరో కాదు గ్రేట్ డైరెక్టర్ కే. రాఘవేంద్రరావు(Raghavendra Rao). పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సాక్షిగా టీడీపీ(TDP)కే కాదు మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీరు స్టార్ట్ అంటే చాలు మేం యాక్షన్‌లోకి దిగుతామని దర్శకుడి బాడీ లాంగ్వేజ్‌లో తన పొలిటికల్‌ సపోర్ట్‌ని ఇచ్చారు రాఘవేంద్రరావు. మిమ్మల్ని మళ్లీ మా ముఖ్యమంత్రి(Chief Minister)గా చూడాలని మేం అందరం ఆశీస్తున్నామని చంద్రబాబు వంక చూసి తన మనసులో మాట చెప్పారు కే. రాఘవేంద్రరావు. పొలిటికల్, సినిమా వేదికలపై పెద్దగా కనిపించని రాఘవేంద్రరావు పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు రాసిన నేను తెలుగుదేశం పుస్తక ఆవిష్కరణ సమయంలో ఈ కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయ్యాయి. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్‌ అడవిరాముడే కాదని అయోధ్య రాముడని చంద్రబాబు చంద్రుడని కొనియాడారు రాఘవేంద్రరావు. ఎంతో విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని స్వర్ణాంధ్ర సృష్టికర్త, నవ్యాంధ్ర రూపకర్తగా చంద్రబాబు ఎప్పటికి చరిత్రలో గుర్తుండిపోతారని మెగా డైరెక్టర్ రాఘవేంద్రరావు కితాబిచ్చారు.

డైరెక్టర్ డైలాగ్స్ ..
ఇదే వేదికపై తాను పార్టీకి చేసిన సేవ..అందుకు పార్టీ ఇచ్చిన గుర్తింపుపై కూడా గర్వంగా చెప్పుకొచ్చారు రాఘవేంద్రరావు. ఎంతో చరిత్ర కలిగిన తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో తనపై నమ్మకం ఉంచి ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అనే పోస్ట్‌తో ప్రజలకు సేవ చేసే అదృష్టం కల్పించారని చెప్పారు. పార్టీకి తాను చేసిన సేవలను గుర్తించి ఎస్వీబీసీ ఛైర్మెన్‌ వంటి పదవులు కట్టబెట్టి సాక్షాత్తు ఆ వెంకటేశ్వరస్వామికి సేవ చేసుకునే భాగ్యం కల్పించడం ఎప్పటికి మరిచిపోలేనని చెప్పారు రాఘవేంద్రరావు.

మీరు సై అంటే చాలు..
రాఘవేంద్రరావు గతంలో ఎన్నో సార్లు టీడీపీ ఆవిర్భావ సభలకు హాజరైనప్పటికి ఈ స్థాయిలో మాట్లాడింది లేదు. చివరగా మీ రుణం తీర్చుకోలేనిది..ఎప్పటికైనా తీర్చుకుంటామని చెప్పడంపై అధికార వైసీపీ సెటైర్లు వేస్తోంది. చంద్రబాబు యాక్షన్ చెప్పడానికి మీరు క్లాప్ కొట్టడానికి ఇదేం సినిమా కాదంటూ సోషల్ మీడియా వేదికగా కౌంటర్‌లు ఇస్తున్నారు.

అక్కడ కూడా తగ్గేదేలే..
పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు విదేశాల్లో సైతం ఘనంగా జరుగుతున్నాయి. ఎన్నారై తెలుగుదేశం, అమెరికా తెలుగు విభాగం ఆధ్వర్యంలో అమెరికా వ్యాప్తంగా సుమారు 40నగరాల్లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నారు పార్టీ శ్రేణులు.

భవిష్యత్‌ ఎలా ఉండనుందో..
సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు ఆశించినట్లుగా గెలుపు సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.
Published by:Siva Nanduri
First published:

Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Director Raghavendra Rao, TDP

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు