హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ysrcp: ఆ జిల్లా వైసీపీ నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు.. ఇద్దరు ఎమ్మెల్యేల పక్కచూపులు ?

Ysrcp: ఆ జిల్లా వైసీపీ నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు.. ఇద్దరు ఎమ్మెల్యేల పక్కచూపులు ?

వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తి..!

వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తి..!

AP Politics: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఇరువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలోకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జోరు అందుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రభుత్వ పథకాల అమలుపై క్షేత్రస్థాయి ప్రచారం చేసి సార్వత్రిక ఎన్నికల్లో లబ్ది పొందాలన్న వైసీపీ(Ysrcp) నాయకత్వం ఆశయానికి ఆ పార్టీ నేతలే పలు చోట్ల అడ్డంకిగా మారుతున్నారు. నేతల మధ్య సమన్వయం కొరవడటం, ఆధిపత్య పోరు, ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు, తదితర కారణాలతో పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని(krishna District) పలు నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు రోడ్డున పడ్డాయి. కొన్ని నియోజక వర్గాల్లో ఎమ్మెల్యే మాటే శాసనం కావడంతో పలువురు నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీనికితోడు నియోజకవర్గాల్లో టికెట్ ఆశించే పోటీదారులు బహిరంగంగా ముందుకు రావటంతో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఒక ముఖ్య ప్రజాప్రతినిధి నియోజకవర్గంలో మరో ముఖ్య ప్రజా ప్రతినిధి అభివృద్ధి పనులు మంజూరు చేశారు. అయితే ఆ ముఖ్య ప్రజా ప్రతినిధి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందన్న భయంతో ఆ పనులు చేపట్టేందుకు స్థానిక అధికారులు అడుగు ముందుకు వేయడం లేదు. దీంతో కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఇరువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలోకి(TDP) వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జోరు అందుకుంది. తన నియోజకవర్గంలో ముఖ్య ప్రజాప్రతినిధి వర్గం జోక్యం శృతిమించడం, ఆ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లిన ప్రయోజనం లేదన్న అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తనకు సరైన గుర్తింపు లభించలేదని అసంతృప్తి మరో శాసనసభ్యుడు కూడా పార్టీ మారాలని యోచన చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఆ ఇరువురు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టికెట్ ఇచ్చేందుకు టిడిపి అధిష్టానం సుముఖంగా లేదని సమాచారం. మచిలీపట్నంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో రెండు ఎకరాల స్థలం విషయంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య ఆదిపత్య పోరు జరుగుతుంది. అవనిగడ్డ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి పిఏ గరికపాటి శివపై దాడికి పాల్పడం సంచలనం సృష్టించింది.

కొంతకాలం నుంచి ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే సింహాద్రి మధ్య పలు అంశాల వల్ల విభేదాలు తలెత్తాయి. అలాగే పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్, కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక రాము మధ్య ఆదిపత్య పోరు సాగుతోంది. జడ్పీ చైర్ పర్సన్ పెడన నియోజకవర్గం కావడంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు, అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కల మారింది. గన్నవరం నియోజకవర్గం శాసనం సభ్యులు వల్లభనేని వంశీ మోహన్ టిడిపిని వీడి వైకాపాలోచేరడంతో ఇక్కడ గ్రూపు రాజకీయాలు ఊపొందు కున్నాయి. ఎమ్మెల్యే వంశీమోహన్ వర్సెస్ దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వర్గాల నడుమ ఎడతెగని యుద్ధం సాగుతోంది. రెండు మూడు విడతలగా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సయోధ్య ప్రయత్నాలు చేసిన ఫలితం లభించలేదు. ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వల్లభనేని వంశీ మోహన్ కొడాలి నానీలను ఉద్దేశించి దుట్టా రామచంద్రరావు యార్లగడ్డ వెంకట్రావు చేసిన వివాదా స్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

Pawan Kalyan: సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ బిరుదు..వైరల్ గా మారిన ఆ కార్టూన్!

YS Jagan: జనంలోకి జగన్.. ఏప్రిల్‌ నుంచి సరికొత్త కార్యక్రమం..

మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేశ్ వర్గాల మధ్య వర్గ పోరు పతాకస్థాయికి చేరింది. సోషల్ మీడియా గ్రూపుల్లో రెండు వర్గాలు వ్యక్తిగత ఆరోపణలతో ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ దగ్గరకు తన నియోజకవర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నేతను ఎందుకు తీసుకెళ్లావ్ అంటూ మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోక ఒక దశలో ఉదయభానును ఒక ఫంక్షన్ లో ప్రశ్నించడంతో ఇరువురు కలబడే పరిస్థితి ఏర్పడింది. అయితే అక్కడ ఉన్న నేతలు ఇరువురికి సర్ధి చెప్పారు.సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సైతం అసమ్మతి సెగ ఎదుర్కొంటున్నారు. తిరువూరులోనూ ఎమ్మెల్యే రక్షణనిధిపై సొంత పార్టీ నాయకుల నుంచే తీవ్రస్థాయిలో అసమ్మతి వ్యక్తమవుతోంది. దీంతో కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయని క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది.

First published:

Tags: Andhra Pradesh, Krishna District, Ysrcp

ఉత్తమ కథలు