Pawan Bike Riding: వేగం నడిచే ఇంజిన్లో ఉండదు.. నడిపేవాడి నరాల్లో ఉంటుంది.. ఈ డైలాగ్ పవర్ స్టార్ పవన్ కు సరిగ్గా సరిపోతుంది. అందుకు నిదర్శనమే తాజాగా సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు. వీడియోలు.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఆయన ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu) మూవీని త్వరితగతిన పూర్తీ చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఇటు ఏపీలో ఎన్నికలు తరుముకొస్తున్నాయి.. ఏ క్షణమైనా ఎన్నికలు అంటూ వైసీపీ సిగ్నల్ ఇస్తోంది. ఇదే సమయంలో ఇప్పటికే రాజకీయ వ్యవహారాలు వల్ల సినిమా షూటింగ్ చాలా లేటు అయ్యింది. త్వరలోనే పవన్ బస్సు యాత్ర చేపట్టాల్సి ఉంది. ఆ యాత్ర మొదలయ్యేలోపు సినిమా షూటింగ్ ను కుదిరినంత వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే గత వారం రోజులుగా హైదరాబాద్ (Hydrabad) రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్ లో వెయ్య మంది ఆర్టిస్ట్ లు మధ్య పవన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ‘BMW R1250 GS’ మోడల్ బైక్ వేసుకొని ఫిల్మ్ సిటీ లో చక్కర్లు కొడుతున్న వీడియో బయటకి వచ్చింది.
షూటింగ్ విరామం సమయంలో పవన్ బైక్ వేసుకొని రయ్యి రయ్యి మంటూ రైడ్ చేస్తూ కాసేపు సరదాగా తిరిగారు. ఆ సమయంలో కొందరు ఆ దృశ్యాన్ని వీడియోలు తీసి నెట్టింట పోస్ట్ చేశారు. ఆ వీడియోలు కాస్త వైరల్ కావడంతో, అభిమానులు పవన్ ‘గోపాల గోపాల’ సినిమాలోని “వేగం నడిచే ఇంజిన్లో ఉండదు మిత్రమా, నడిపేవాడి నరాల్లో ఉంటది” అనే డైలాగ్ ని కామెంట్ చేస్తున్నారు. ఇటు జనసైనికులు.. అటు పవన్ అభిమానులు.. ఈ ఫోటోలను, వీడియోలను వైసీపీ నేతలకు షేర్ చేస్తూ.. ఇది మా పవర్ స్టార్ పవర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి : కూతురు పెళ్ళికి పవన్ ఎందుకు రాలేదంటే..? ఆలీ చెప్పిన సమాధానం ఇదే
హెవీ లగ్జరీ బైక్ పై సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్న పవన్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. ఈ బైక్ ఏంటి.. ఖరీదు ఎంత అని ఆరాతీస్తున్నారు. అయితే ఈ ప్రత్యేక బైక్ ఖరీదు.. ఏకంగా 24 లక్షల రూపాయలు పైనే అనే విషయం తెలియడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. బైక్ కోసం పవన్ అన్ని లక్షలు ఖర్చు చేశారా అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కుతుండగా పవన్ పాత్ర కొత్తగా ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుండగా పవన్ అభిమానులకు కిక్కిచ్చే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి టార్గెట్ గా ఈ సినిమా షూట్ జరుగుతుండగా ఆ సమయానికి ఈ సినిమా రిలీజవుతుందో లేదో చూడాల్సి ఉంది. అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన వెంటనే పవన్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Janasena, Pawan kalyan