హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ap: ఆ జీవోను అసలు చదివారా? ప్రతిపక్షాల రాద్ధాంతంపై మంత్రి బొత్స ఫైర్

Ap: ఆ జీవోను అసలు చదివారా? ప్రతిపక్షాల రాద్ధాంతంపై మంత్రి బొత్స ఫైర్

మంత్రి బొత్స సత్యనారాయణ

మంత్రి బొత్స సత్యనారాయణ

ప్రతిపక్ష పార్టీలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. జీవో నెంబర్ 1లో ఎక్కడా కూడా ర్యాలీలు, రోడ్డు షోలపై నిషేధం అని ఎక్కడుందో చెప్పాలని అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే దీనిపై రాద్ధాంతం చేస్తున్నాయి. ముందు జీవోను చదవాలని సూచించారు. పదే పదే విమర్శలు చేయడం కాదు. ముందు ప్రతిపక్షాలు జీవోను చదివాయా అని ఎద్దేవా చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

ప్రతిపక్ష పార్టీలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. జీవో నెంబర్ 1లో ఎక్కడా కూడా ర్యాలీలు, రోడ్డు షోలపై నిషేధం అని ఎక్కడుందో చెప్పాలని అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే దీనిపై రాద్ధాంతం చేస్తున్నాయి. ముందు జీవోను చదవాలని సూచించారు. పదే పదే విమర్శలు చేయడం కాదు. ముందు ప్రతిపక్షాలు జీవోను చదివాయా అని ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు సభకు లక్షలాది మంది వస్తుంటే వారిని ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపణలు చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. ఇదిలా ఉంటే ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట కారణంగా 11 మంది మృతి చెందారు. ఈ కారణంగా ప్రభుత్వం జీవో నెంబర్ 1ను తీసుకొచ్చింది.

MLC Anantababu: ఇప్పుడేం చేద్దాం..! అనంతబాబు కేసులో పోలీసులకు కొత్త తలనొప్పులు

ఈ జీవో ప్రకారం రోడ్డుపై సభలు, సమావేశాలను నిర్వహించకూడదు. అత్యవసరం అయితే పోలీసుల అనుమతి తప్పనిసరని సర్కార్ జీవోలో పేర్కొంది. అయితే ఈ జీవో వచ్చినప్పటి నుండి ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. వైసీపీకి ఒక రూల్ మిగతా వారికి ఒక రూల్ అంటూ టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నారు. మొన్న చంద్రబాబు కుప్పం పర్యటనలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో ఈ జీవో రగడ మరింత ముదిరింది. ఈ క్రమంలో బొత్స సత్యనారాయణ ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

AP Sankranti Holidays: ఏపీ విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త.. సంక్రాంతి సెలవుల పొడిగింపు.. పూర్తి వివరాలివే

ప్రభుత్వం ఇచ్చిన జీవోలో సమావేశాలు, సభలకు నిషేధం విధించినట్లు ఉందా? అని మంత్రి సూటిగా ప్రశ్నించారు. రోడ్డుపై మాత్రమే సమావేశాలకు, సభలకు అనుమతి లేదని జీవోలో ఉంది. ఒకవేళ అవసరం అయితే పోలీసుల అనుమతి తీసుకొని పెట్టుకోవచ్చు. దీనికి ఇంత రాద్ధాంతం చేయనవసరం లేదు. ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా అందుకే జీవోను తీసుకొచ్చింది. చంద్రబాబు సభలో 11 మంది నిండు ప్రాణాలు పోతే కనీసం బహిరంగ క్షమాపణ కూడా చెప్పలేదని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ప్రచార పిచ్చితో అమాయక ప్రజల ప్రాణాలు తీస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అన్నారు.

జీవో 1ను తీసుకొచ్చాం. కానీ అనుమతితో సభలు, సమావేశాలు పెట్టుకోవచ్చన్నారు. గతంలో ఎన్నో సభలు, సమావేశాలు, పాదయాత్రలు జరిగాయి. కానీ ఎప్పుడూ కూడా చంద్రబాబు సభలో జరిగినట్లు జరగలేదు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు మైండ్ సెట్ మార్చుకోవాలని సూచించారు. మరి బొత్స వ్యాఖ్యలపై ప్రతిపక్ష నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

First published:

Tags: Andhrapradesh, Ap, AP News, Botsa satyanarayana

ఉత్తమ కథలు