Home /News /andhra-pradesh /

AP POLITICS DID ALL IS WELL IN YSRCP AFTER MEETING WITH CM JAGAN MOHAN REDDY ALL LEADERS SAYS HAPPY NGS

CM Jagan: టీ కప్పులో తుఫాను చల్లారిందా? సీఎం అలర్ట్ తో అసంతృప్తులు దారికొచ్చారా? వైసీపీలో ఏం జరుగుతోంది

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

CM Jagan: మొన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క అన్నట్టు మారింది వైసీపీ పరిస్థితి.. సాధరణంగా పార్టీ అధినేత జగన్ ఏది చెబితే అదే ఫైనల్ మరో మాటాడే ప్రసక్తే లేదన్నది మొన్నటి మాట.. కానీ కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ తరువాత సీన్ మారింది. ఆ పార్టీలోనూ అసమ్మతి జ్వాలలు ఎగసి పడ్డాయి. అయితే త్వరగానే అలర్ట్ అయిన సీఎం.. ఒక్కొకరితో ప్రత్యేకంగా భేటీ అవ్వడంతో.. వివాదం సద్దుమణిగిందా..? లకే నివురుకప్పని నిప్పులో.. ఎదో ఒకరోజు బయట పడుతుందా..?

ఇంకా చదవండి ...
    CM Jagan: వైఎస్ఆర్సీసీపీ (YSRCP) అంటే వన్ మ్యాన్ షో.. అధినేత జగన్ (Jagan) ఏది చెబితే అదే ఫైనల్.. ఆయన మాటకు తిరుగుండదు.. అసలు ఇతర నేతల గొంతే లేవదు.. కానీ ఇది మొన్నటి మాట.. ఇప్పుడు పరిస్థితి మారిందా..? ముఖ్యంగా కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ (Cabinet Reshuffle) నిదర్శనమా..? ఎందుకంటే ఎవరూ ఊహించని విధింగా కొత్త కేబినెట్ కొలువు తీరిన తరువాత అసమ్మతి జ్వాలలు ఎగసి పడ్డాయి. సీఎం జగన్ (CM Jagan) బంధువులు, వీర విధేయులు సైతం అలక అలిగారు. ఈ అసమ్మతని అలాగే వదిలిస్తే.. పార్టీకి నష్టం తప్పదని భావించిన జగన్ త్వరగానే అలర్ట్ అయ్యారు. దీంతో మంత్రి పదవి కోల్పోయిన వారిని.. మంత్రి పదవి ఆశించి బెంగ పడుతున్నవారిని వ్యక్తిగతంగా కలిశారు.. కలుస్తూనే ఉన్నారు. మరి అలాంటి నేతలకు సీఎం జగన్ (CM Jagan) ఎలాంటి హామీ ఇస్తున్నారు.. సీఎం మాటతో అసమ్మతి రాగం పూర్తిగా చల్లారినట్టేనా..?

    ఆ నేతలు చెబుతున్న మాటలను బట్టి చూస్తే.. మంత్రి పదవులు దక్కలేదని అలకబూనిన వారంతా దారికి వచ్చినట్టే. నేతలంతా దారికొస్తున్నారు. సీఎం జగన్‌తో భేటీ తరువాత అధినేతకు విధేయులుగా ఉంటామని ప్రకటిస్తున్నారు. తాజాగా మాజీ హోంమంత్రి సుచరిత కూడా అలక వీడారు. గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, పార్థసారథి, కాపు రాచమంద్రారెడ్డి, పిన్నెళ్లి ఇతర నేతలు అసంతృప్తికి గురయ్యారు.

    ఇదీ చదవండి ఆసక్తికరంగా నెల్లూరు వైసీపీ రాజకీయాలు.. కోటంరెడ్డిన కలిసిన మాజీ మంత్రి అనిల్.. మ్యాటర్ అదేనా..?

    మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల బుజ్జగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అలకబూనిన ఒక్కో నేత… మెలిగ్గా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. మంత్రి పదవి రాలేదన్న చిన్నన క్షణిక ఆవేదన తప్పా.. ఇంకేం లేదంటున్నారు. అధినేత జగన్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధం అంటున్నారు.

    ఇదీ చదవండి : ఆ పదవులు రద్దు.. జిల్లా బాధ్యతల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం.. టార్గెట్ 2024 దిశగా అడుగులు

    మంత్రి పదవి దక్కకలేదన్న అసంతృప్తితో మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఏకంగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారని ప్రచారం జరిగింది. . వెనక్కి తగ్గేందుకు ససేమిరా అన్నారు. కానీ  క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు సుచరిత. రెండేళ్ల తరువాత మంత్రివర్గాన్ని మారుస్తామని చెప్పి.. 11 మందిని కొనసాగించడంతో మనస్తాపం చెందినట్టు సీఎం వివరించినట్టు తెలుస్తోంది. త్వరలో నామినేట్‌ పోస్టుల్లో మంచి హోదా కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. సీఎంతో భేటీ తరువాత.. పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటానని ప్రకటించారు సుచరిత. తాను ఇచ్చింది కేవలం థ్యాంక్ గివింగ్ నోట్ మాత్రమే అని వివరణ ఇచ్చారు. అయితే ఈ అసమ్మతి జాల చల్లారడం.. శాశ్వతమా..? తాత్కాలికమా అన్నది చూాడాలి..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm jagan, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు