హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Deputy CM: మంత్రి పదవి పోతోంది అని ఫిక్స్ అయ్యారా..? డిప్యూటీ సీఎం మాటలకు అర్థం అదేనా..?

Deputy CM: మంత్రి పదవి పోతోంది అని ఫిక్స్ అయ్యారా..? డిప్యూటీ సీఎం మాటలకు అర్థం అదేనా..?

నారాయణ స్వామి వ్యాఖ్యలకు అదే అర్థమా..?

నారాయణ స్వామి వ్యాఖ్యలకు అదే అర్థమా..?

Deputy CM: అధికార వైసీపీలో మళ్లీ మంత్రివర్గ విస్తరణ టెన్షన్ మొదలైంది.. ఇటీవల కేబినెట్ భేటీలో మంత్రుల తీరుపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. విమర్శలను తిప్పి కొట్టడంలో ఫెలైతే.. పదవుల నుంచి తప్పిస్తానంటూ బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆ తప్పించే లిస్ట్ లో నారాయణ స్వామి పేరు కూడా ఉందా..? తాజాగా ఆయన వ్యాఖ్యలు అందుకు నిదర్శనమా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India

Deputy Chief Minister Narayana Swamy: ఆంధ్రప్రదేశ్ సీఎం గన్ మోహన్ రెడ్డి (Andhra Pradesh CM Jagan Mohan Reddy) కేబినెట్ లో మార్పులు.. చేర్పులూ తప్పవా..? నవంబర్ లోనే కేబినెట్ ప్రక్షాళణ ఉంటుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే మొన్ననే కేబినెట్ (Cabinet)ను విస్తరించిన జగన్.. మళ్లీ ఎందుకు కేబినెట్ లో మార్పులు చేస్తారనే అనుమానం ఉండొచ్చు.. కానీ ఆయనే స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు చేస్తున్న విమర్శలను.. తిప్పికొట్టలేనప్పుడు.. మంత్రులుగా కొనసాగడం ఎందుకు.. త్వరలోనే అలాంటి వారిని తప్పిస్తానని వార్నింగ్ ఇచ్చారు. దీంతో కొందరు మంత్రుల్లో టెన్షన్ మొదలైంది.

ఆ జాబితాలో రాయలసీమకు చెందిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి (Deputy CM Narayana Swamy) కూడా ఉన్నారా..? అసలు ఈ ప్రచారానికి కారణం ఏంటి. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నారాయణ స్వామి పేరు హైలైట్ అవ్వడానికి కారణం.. ఇంతకీ ఆయన ఏమన్నారు..? రాష్ట్రంలో ఏ మంత్రికీ లేని సమస్యలు ఈయనకే ఉన్నాయా..? ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం హాయిగా గడిపేసిన ఆయన, డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాత్రం నానా తంటాలు పడుతున్నారా..?

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో గ్రూపులకు అడ్డాగా మారిందట జిడినెల్లూరు నియోజక వర్గం. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. అందుకు భిన్నంగా సాగుతోందట డిప్యూటి సీఎం నారాయణస్వామి పరిస్థితి. ఎమ్మెల్యేగా మూడు సార్లు పనిచేసిన సమయంలో.. ఆయనకు ఎలాంటి తలనొప్పులు పడని నారాయణ స్వామి.. డిప్యూటీ సిఎం పదవి చేపట్టిన తర్వాత మాత్రం రాష్ట్రంలో ఏ మంత్రి చూడని ఇబ్బందులు అనుభవిస్తున్నారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది.

ఇదీ చదవండి : ఈ నెల 27న తిరుమలకు సీఎం జగన్ .. బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాటు..? ముఖ్య ఘట్టాలు ఇవే..

నియోజకవర్గంలో గంగాధర్ నెల్లూరు , పెనుమూరు, వెదురుకుప్పం, ఎస్ఆర్ పురం, కార్వేటినగరం మండలాల్లో గ్రూపు రాజకీయాలు సర్వసాధారణం అయ్యాయి. పంచాయతీ ఎన్నికల తర్వాత అవి కాస్తా పిక్స్ కి చేరాయట. మీరు మారాలని నేతలకు పదేపదే నారాయణ స్వామి విజ్ఞప్తి చేస్తున్నా, ఫలితం మాత్రం వేరేలా ఉంది అంటున్నారు. ఇప్పుడు అ వంతు కార్యకర్తలు నుండి నేతల వరకు రావడంతో తెగ ఆవేదన చెందుతున్నారని టాక్.

ఇదీ చదవండి : రైతులకు సిరులు కురిపిస్తున్న సీతాఫలం.. బరువు తగ్గాలనుకున్నవారికి దివ్య ఔషధం

ప్రభుత్వ ఎన్ఆర్ఐ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డికి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వర్గాల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ఆ పార్టీ మండల కమిటీ అధ్యక్షుల నియామకంతో బయటపడ్డాయి. అప్పటి నుంచి పక్కలో బల్లెంలా మారారట జ్ఞానేంద్రరెడ్డి. ఆయన సొంత మండలం పెనుమూరు. అక్కడ పార్టీ మండల అధ్యక్షుడిగా తన బావమరిదిని పెట్టాలని జ్ఞానేంద్ర రెడ్డి భావిస్తే, నారాయణస్వామి ఇంకొకరికి అవకాశం ఇచ్చారు.

ఇదీ చదవండి : సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం.. వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రతి స్కూళ్లో ఏర్పాటు..

తాజాగా జిడినెల్లూరు వైసిపి వాట్స్‌ అప్ గ్రూపులో ఈనెల 11 తేదిన నియోజకవర్గంలోని కేడర్, నేతలు, ఎంపీటీసీ, జెడ్పీటిసి, సర్పంచ్ సహా అందరూ పెనుమూరులో జరిగే సమావేశానికి రావాలని, అక్కడ నియోజకవర్గంలో పరిస్థితిపై చర్చిద్దాం అంటూ మెసెజ్ లు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. మెసెజ్ లపై అలర్ట్ అయిన మంత్రి అనుచర వర్గం విషయాన్ని చేరవేయడంతో నారాయణ స్వామి ఒక్కసారిగా ఓపెన్ అయ్యారు. నియోజకవర్గంలో జరిగే పరిణామాలపై తీవ్రంగా స్పందించిన డిప్యూటీ సీఎం, తనపై పార్టీలో కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన తప్పు ఉందని, అవినీతి చేశానని ఎవరైనా నిరుపిస్తే వాళ్ళు కాళ్ళు పట్టుకుంటానన్నారు..

ఇదీ చదవండి : పొలం పని చేసుకుని ఇంటికి వచ్చిన అన్నకు షాక్.. తమ్ముడితో భార్యను అలా చూసి.. ఏం చేశాడో తెలుసా?

నిజానికి తనమీద గుర్రుగా ఉన్న నేతలను చల్లబరిచేందుకు నారాయణస్వామి ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి కోట్లాది రూపాయల పనులు ఇచ్చారు. అయినా వాళ్లు అసమ్మతి కార్యకలాపాలు ఆపకపోగా, మరింత స్పీడ్‌ పెండచటంతో, లబలబలాడిపోతున్నారు డిప్యూటీ సీఎం. తన వ్యతిరేకులకు తాను ఏ స్థాయిలో సహకరించినది, ఆయనే స్వయంగా చెప్పుకుని బాధపడుతున్నారట. అసమ్మతి గ్రూపులు కడుతున్న ఆ మండల నేతకు రూ.14 కోట్ల రోడ్డు పనులు ఇచ్చిన తర్వాత కూడా కావాలనే సభలు, సమావేశాలంటూ మెసేజ్ లు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి గంగరగోళం సృష్టించటం వల్లనే తాను స్పందించాల్సి వచ్చిందన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ycp

ఉత్తమ కథలు