హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: కాబోయే ప్రధాని వైఎస్ జగన్.. ఏపీ మంత్రి సంచలన కామెంట్స్..

AP Politics: కాబోయే ప్రధాని వైఎస్ జగన్.. ఏపీ మంత్రి సంచలన కామెంట్స్..

ఇవాళ ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి జగన్ నగదు జమ చేస్తారు. మరోవైపు.. వైయస్సార్‌ కాపు నేస్తం- జూలై 22న, జగనన్న తోడు–జులై 26వ తేదీన నిధులు విడుదల చేయాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం (AP Cabinet) సమావేశంలోనే చర్చించి ఆమోదం తెలిపింది.

ఇవాళ ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి జగన్ నగదు జమ చేస్తారు. మరోవైపు.. వైయస్సార్‌ కాపు నేస్తం- జూలై 22న, జగనన్న తోడు–జులై 26వ తేదీన నిధులు విడుదల చేయాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం (AP Cabinet) సమావేశంలోనే చర్చించి ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కేబినెట్ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. మంత్రులు క్రమంగా వాయిస్ పెంచుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu) టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూనే సీఎం జగన్ (CM YS Jagan) పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కేబినెట్ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. మంత్రులు క్రమంగా వాయిస్ పెంచుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu) టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూనే సీఎం జగన్ (CM YS Jagan) పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మంత్రి పదవి ఉంటుందా..? ఊడుతుందా అనే సంగతి పక్కన బెడితే.. సీఎంపై ఉన్న విధేయతను మాత్రం చూపిస్తున్నారు. తాజాగా మంత్రి నారాయణ స్వామి అలాంటి వ్యాఖ్యలే చేశారు. సీఎం జగన్.. దేశానికి కాబోయే ప్రధాని అని జోస్యం చెప్పారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవులపై సీఎం జగన్ నిర్ణయమే శిరోధార్యమన్న ఆయన.. ఆ విషయంలో రెండో ఆలోచన లేదన్నారు.

  ఇక 15 సంవత్సరాల తర్వాత జగన్ దేశానికి ప్రధాని అవుతారంటూ సంచలన కామంట్స్ చేశారు. ఓ వైపు జగన్ ను పొగుడుతూనే పనిలో పనిగా టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు దమ్ము దైర్యం వుంటే.., కొత్త పార్టి పెట్టి జగన్ పై పోటీ చేసి గెలవాలన్నారు. వీలు చిక్కినప్పుడల్లా చంద్రబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్న నారాయణ స్వామి.. తిరుమలలోనూ తన కాలేజ్ ఫ్రెండ్ ను విడిచిపెట్టలేదు.

  ఇది చదవండి: మరో బాదుడికి సిద్ధమైన ఏపీ ప్రభుత్వం.. మరో మూడేళ్లు ఛార్జీల మోతే..

  ఇటీవల నారాయణ స్వామి.. చంద్రబాబుకు ఛాలెంచ్ విసిరిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లుపొడిచిన వ్యక్తి చంద్రబాబు అంటూ అయన మండిపడ్డారు. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన మద్యపాన నిషేధం, రెండు రూపాయల బియ్యం పథకాలను చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేశారని నారాయణ స్వామి విమర్శించారు. ఎన్నికలు వస్తే ఆయనకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తాడని, ఎన్టీఆర్ మరణించాక ముందు కాంగ్రెస్ ను రాష్ట్రంలో వారి ఉనికి లేకుండా చేస్తే, చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కి వెన్ను పోటు పొడిచి కాంగ్రెస్ తో జతకట్టాడన్నారని ఆరోపించారు.

  ఇది చదవండి: ఎలక్షన్స్ కోసం రూట్ మ్యాప్ ఫిక్స్ చేసిన జగన్.., మంత్రులతో సజ్జల కీలక భేటీ.. 

  అటు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కూడా ఇటీవల జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ గెలిచి సీఎం కాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సంచలనానికి తెరలేపారు. అంతేనా టీడీపీ 160 సీట్లు గెలుస్తామంటే తామే గాజులు తొడుక్కోలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని కూడా.. మంత్రి పదవే తనకు అడ్డని.. లేకుంటే సీఎంను విమర్శిస్తున్న టీడీపీకి తన విశ్వరూపం చూపిస్తానంటూ తనమార్క్ మాటల తూటాలు పేల్చారాయన.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Narayana Swamy

  ఉత్తమ కథలు