Home /News /andhra-pradesh /

AP POLITICS DEPUTY CM DHARAMANA KRISHNA DAS MADE SENSATIONAL COMMENTS ON CM YS JAGAN AND TDP CHALLENGES FULL DETAILS HERE PRN

AP News: “జగన్ సీఎం కాకుంటే రాజకీయాలకు గుడ్ బై.. మేం గాజులు తొడుక్కోలేదు..”మంత్రి సంచలన వ్యాఖ్యలు..

డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ (ఫైల్)

డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసినా సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఓవైపు కేబినెట్లో మార్పులు చేర్పులుంటాయన్న ఊహాగానాల నేపథ్యంలో సీఎం జగన్ (CM YS Jagan) ను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావాహులు యత్నిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసినా సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఓవైపు కేబినెట్లో మార్పులు చేర్పులుంటాయన్న ఊహాగానాల నేపథ్యంలో సీఎం జగన్ (CM YS Jagan) ను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావాహులు యత్నిస్తున్నారు. ప్రస్తుతం పదవిలో ఉన్నవారు కూడా సీఎంను పొగడ్తలతో ముంచెత్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ గెలిచి సీఎం కాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరిరారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలు గెలుస్తామని టీడీపీ అంటోందని.. ఈలోగా తాము గాజులు తొడుక్కొని కూర్చుంటామా అని అన్నారు. అచ్చెన్నాయుడు కామెంట్స్ కు భయపడాల్సిన అవసరమే లేదన్నారు.

    గతంలో కూడా సీఎం జగన్ పదవిపై ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. జగన్ పాలనకు వంద మార్కులు వేశారు. ప్రజా ఆకర్షణ ఉన్న ఏకైక సీఎం అంటూ ప్రశంసించారు. సంక్షేమ పాలనతో జగన్ తనదైన ముద్ర వేశారన్నారు. అందుకే దివంగత వైఎస్ఆర్ లాగే.. జగన్ సైతం జన నేతగా గుర్తింపు పొందరని.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలంతా జగన్ వెంటే ఉంటారన్నారు. జగన్ ఉన్న జనాకర్షణ చూసే ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం జగన్ పాలన ప్రజలకు నచ్చబట్టి.. వచ్చే ఎన్నికల్లోనూ జగనే మళ్లీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఒకవేళ రెండోసారి జగన్ సీఎం కాకపోతే తన ఆస్తి మొత్తం రాసిస్తానని.. ఎవరైనా పందానికి రెడీయా అంటూ ఛాలెంజ్ చేశారు.

    ఇది చదవండి: టీడీపీ లెక్క 23 నుంచి 123 అవ్వాలంటే ఏం చేయాలి.. ఇప్పుడేం చేస్తోంది..?


    నిజంగా ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీకి.. సవాల్ విసురుతున్నాను అన్నారు. టీడీపీ వాళ్లకు గెలుస్తామని నమ్మకం ఉంటే.. బెట్ కట్టండి అని ఛాలెంజ్ చేశారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నేతల్లో.. జగన్ కు ఎవరూ సాటి రారని ధర్మాన పేర్కొన్నారు. భవిష్యత్ లో కూడా జగన్ లాంటి నేత ఉండరని.. రారని తేల్చి చెప్పారు. అతనికి అతనే సాటి అని కామెంట్ చేశారు. వచ్చేసారి కూడా జగన్ సీఎం అవుతారని కాకపోతే తన ఆస్తి మొత్తం రాసిస్తానని సవాల్ చేశారు. కావాలంటే పందెం కాస్తా..టీడీపీ నేతలు కూడా రావొచ్చని అన్నారు. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఆస్తి మొత్తం రాసిస్తామన్న సవాల్ పై ఇప్పటి వరకు అయితే టీడీపీ నేతలు స్పందించలేదు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, Srikakulam

    తదుపరి వార్తలు