Delhi Liquor Scam: దేశంలో పలు రాష్ట్రాలను ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) షేక్ చేస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. మొన్నటి వరకు తెలంగాణ (Telangana) పేరు వినిపించింది కానీ.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రస్తావన రాలేదు. అయితే రాష్ట్రంలో విపక్షాలు మాత్రం.. లిక్కర్ స్కామ్ లో వైసీపీ హస్తం ఉందంటూ ఆరోపణలు చేస్తున్నాయి. అందులోనూ నేరుగా సీఎం జగన్ (CM Jagan) కుటుంబం ప్రమేయం ఉంది అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆ సందర్భంగానే వైసీపీ మంత్రులు సరిగ్గా విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నారంటూ.. కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆ ఆరోపణల సంగతి పక్కన పెడితే.. ఇప్పడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏపీని కూడా తాకింది. నేరుగా వైసీపీ ఎంపీ నివాసాల్లోనూ ఈడీ సోదాలు చేయడంతో.. సంచలనంగా మారింది.
ఈ లిక్కర్ స్కామ్‌లో హైదరాబాద్ (Hyderabad) సహా దేశవ్యాప్తంగా 40 చోట్ల మరోసారి ఈడీ సోదాలు నిర్వహించింది. బెంగళూరు, చెన్నై, ఏపీలోని నెల్లూరులో తనిఖీలు జరగాయి. హైదరాబాద్‌లోని రాయదుర్గం, దోమలగూడ సహా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరగాయి. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారుల ఆధ్వర్యంలో 25 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. ఇందులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (Magunta Srinivasula Reddy) నివాసంలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం.. ఏపీ లోనూ లింకుల విషయం సంచలనంగా మారింది.
దేశరాజధినా హస్తినలోని లోథీ రోడ్డులో ఉన్న 95వ నంబర్ బంగ్లాలో ఉదయం నుంచి తనిఖీలు జరిగాయి. దీంతో పాటు నెల్లూరులోని రాయాజీ వీధిలో ఆయన నివాసంలోనూ సోదాలు జరిగినట్టు సమాచారం. దీంతో ఎంపీ మాగుంట ఇంటి దగ్గర ఎవర్నీ రానీయకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి : మీకు ఈ మెసేజ్ లు వస్తున్నాయా..? విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఢిల్లీలోని వైన్ షాపుల్లో కొన్నింటిని మాగుంటకు చెందిన లిక్కర్ కంపెనీలు చేజిక్కించుకున్నాయని ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాగుంట నివాసాల్లో సీబీఐ సోదాలను నిర్వహించింది. మరోవైపు మాగుంటతో పాటు మరికొందరు నేతల హస్తం కూడా ఈ స్కాంలో ఉందని ఈడీ ఆరోపిస్తోంది. త్వరలోనే వీరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని వెల్లడిరచారు. ఏది ఏమైనా ఈ వ్యవహారం ప్రతిపక్ష నేతలకు అస్త్రంగానే దొరికింది.
ప్రస్తుతం దీనిపై అధికారికంగా ఇటు వైసీపీ నేతలు కానీ.. ఎంపీ మాగుంట కుటుంబ సభ్యులు కానీ స్పందించలేదు. అయితే గతంలో లిక్కర్ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఖండిచారు. అక్రమ వ్యాపారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాజాగా జరిగిన సోదాలపై ఎలా స్పందిస్తారో చూడాలి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Liquor, Ycp