AP POLITICS DAY ONE GADAPA GADAPAKU YCP GOVERNMENT SOME MISTERS SHOCKED BY LOCAL PEOPLE NGS
YCP Leaders: మంత్రులకు షాక్.. సమస్యలపై ప్రశ్నల వర్షం.. గడప గడపకు ప్రభుత్వం తొలి రోజే నేతలకు చుక్కలు
మంత్రులు, ఎమ్మెల్యేలకు నిరసన సెగ
YCP Leaders: ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదా..? భారీ సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో అంతా పాజిటివ్ ఫీలింగ్ మాత్రమే ఉందా.? సీఎం జగన్ ఇదే మాట పదే పదే చెబుతున్నారు. అయితే గడప గడపకు ప్రభుత్వం పేరుతో జనాల్లోకి వెళ్లిన కొందరు మంత్రులు, నేతలకు మాత్రం స్థానికులు చుక్కలు చూపిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.
YCP Leaders: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YCP) ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తైంది. మరి ఈ మూడేళ్లో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందా..? ఆదరణ పెరిగిందా.? సీఎం జగన్, మంత్రులు, అధికారులు అంతా ప్రజల్లో అపూర్వ ఆదరణ ఉందని. వ్యతిరేకత లేదని పదే పదే చెబుతున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు తెలుగు దేశం పార్టీ, జనసేన, బీజేపీ సహా ఇతర పార్టీలు అన్నీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరి వాస్తవం ఏంటి..? ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది.. వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడంతో పాటు.. ఉన్న వ్యతిరేకత దూరం చేసుకోవడం.. ఎమ్మెల్యేల ఫ్రోగ్రస్ రిపోర్ట్ పెంచుకోవడమే లక్ష్యంగా సీఎం జగన్ ఆదేశాల మేరకు.. వైసీపీ నేతలంతా గడప గడపకు ప్రభుత్వం అంటూ జనం బాట పట్టారు. మొదట గడప గడపకు వైసీపీ అన్న కార్యక్రమం చివరి నిమిషంలో గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) గా మారింది. పార్టీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) ఆదేశాల మేరకు వైసీపీ (YCP) ఎమ్మెల్యేలంతా బుధవారమే జనాల్లోకి వచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటుగా.. ఆ ఇంటికి అందుతున్న పథకాలు.. లబ్ది గురించి తెలుసుకోనున్నారు. పథకాలు అందించడంతో పాటు.. ప్రతి ఇంటికీ జగన్ రాసిన లేఖను ఎమ్మెల్యే అందిస్తున్నారు. అయితే ప్రభుత్వం అద్భుత స్పందన వస్తుందని భావిస్తే.. కొన్ని చోట్ల అధికార నేతలకు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు.
రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలు మినహా మిగిలిన జిల్లాల్లో ఈ కార్యక్రమం తొలిరోజు పూర్తైంది. ఇక రెండో రోజు పర్యటనపై కొందరిలో సందిగ్ధం నెలకొంది. అందుకు కారణాలు లేకపోలేదు. తొలి రోజునే ఎమ్మెల్యేలను..వైసీపీ నేతలను పలు సమస్యలను ప్రస్తావిస్తూ అనేక ప్రాంతాల్లో ఉక్కిరి బిక్కరి చేసిన ఘటనలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. అనేక చోట్ల సమస్యలతో స్థానికులు స్వాగతం పలికారు. ప్రజల నుంచి ముఖ్యంగా రోడ్లు..అధిక ధరలు.. పథకాల నిర్వహణ పైనే ఎక్కువగా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఇక కర్నూలు జిల్లాలో మంత్రి జయరాంకు స్థానికులు సమస్యలను చెప్పుకొనే ప్రయత్నం చేసారు. వారానికో సారి నీటిని ఇస్తున్నారని.. బోర్లు చెడిపోయాయంటూ మంత్రితో మొర పెట్టుకున్నారు. కానీ, వారికి మంత్రి నుంచి సమస్య పరిష్కారానికి స్పష్టమైన హామీ లభించలేదు.
వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజుకు సైతం ప్రశ్నల వర్షం తప్పలేదు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని టీసీ అగ్రహారం, కల్లూరు గ్రామ సచివాలయాల పరిధిలో పర్యటించిన మంత్రి రోజాపై స్థానికులు ధరల పెరుగుదలపై ప్రశ్నల వర్షం కురిపించారు. అమ్మఒడి ఇస్తున్నారు... కానీ కరెంటు చార్జీలు పెంచేశారు.. ఎలా కట్టాలి?' అంటూ ఆమెను ఓ గ్రామస్థుడు సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తెలివంతా చూపించొద్దంటూ సమాధానం దాటవేసి అక్కడ నుంచి ఆమె ముందుకు సాగారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ కు సైతం నిరసన సెగ తగిలింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా.. ప్రజలకు ఏం చేశారో చెప్పాలి అంటూ స్థానికులు కొందరు నిలదీశారు.. దీంతో మధ్యలోనే అనిల్ కుమార్ వైదొలిగినట్టు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి..
Gadapa gadapaku Vaimpudu Om pradamga maa Nellore nundey modalu ayyindi anamata 🤡😂 https://t.co/XjwfjdHLLI
— #i'm భైరవ Groot(b+ ⛑️) 🌱 (@travelinglif) May 10, 2022
చాలామంది అధికార పార్టీ నేతలకు ఇలాంటి సమస్యలే తొలి రోజు ఎదురయ్యాయి. దీంతో రెండో రోజు నుంచి ఈ కార్యక్రమం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడాయా పోస్టులపై ఫోకస్ చేస్తున్నారు. కాసీ వైసీపీ కార్యకర్తలు, ఫాలో వర్స్ ఉన్న ప్రాంతాల్లోనే పర్యటన చేస్తే.. ఎలాంటి సమస్య ఉండదని భావిస్తున్నారు. మరి రెండో రోజు ఎలాంటి సమస్యలు స్వాగతం పలుకుతాయో చూడాలి.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.