Home /News /andhra-pradesh /

AP POLITICS CRITICISM OVER YCP GOVERNMENT FOR DENYING HANDICAPPED TEACHER TO ENTER TADEPALLI CMO ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

AP CMO: కష్టం కూడా చెప్పుకోనివ్వరా..? వివాదాస్పదమవుతున్న పోలీసుల తీరు..

రోడ్డుపై నిరసన తెలుపుతున్న సుధారాణి, కుటుంబ సభ్యులు

రోడ్డుపై నిరసన తెలుపుతున్న సుధారాణి, కుటుంబ సభ్యులు

Guntur: అది సమయం సాయంత్రం ఏడూ గంటలు చెన్నై కోల్ కత్త జాతీయ రహదారి వేలాది వాహనాల ప్రయాణంతో ఎల్లపుడు రద్దీగా ఉండే రహదారి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొలనుకొండ వద్ద పోలీస్ లు ఎవరినో అడ్డుకుంటున్నారు.

    Anna Raghu, News18, Amaravati

    అది సమయం సాయంత్రం ఏడూ గంటలు చెన్నై కోల్ కత్త జాతీయ రహదారి వేలాది వాహనాల ప్రయాణంతో ఎల్లపుడు రద్దీగా ఉండే రహదారి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొలనుకొండ వద్ద పోలీస్ లు ఎవరినో అడ్డుకుంటున్నారు. ఓ దివ్యాంగురాలు తన ముగ్గురు బిడ్డలతో కలిసి పాదయాత్రగా వస్తుంటే అడ్డుకున్నారు. అసలు కథలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని బాపట్ల జిల్లా (Bapatla District) అద్దంకి నియోజకవర్గం కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెంకు చెందిన గొట్టిపాటి సుధారాణి మండల పరిషత్ లో ఎస్జిటి గా పనిచేస్తున్నారు. తన ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె తో తన సొంత ఇంట్లో సంతోషంగా నివసిస్తున్నారు. ఐతే ఆ ఇంటికి వెళ్లే దారి స్థలానికి ఆక్రమించిన వైసీపీ సానుభూతిపరుడు గోడ నిర్మించాడు.

    తనకు జరిగిన అన్యాయాన్ని గురించి ఎంతమంది అధికారులకు విన్నవించుకున్నా న్యాయం జరగలేదు. దీంతో ఈ నెల 17న తన కుమారులు కార్తీక్, తేజలతో పాటు కుమార్తె సుమహారిక తో లలిసి తన ఆరోగ్యం సహకరించకున్నా వీల్ చైర్లో కూర్చొని తన పిల్లలతో సహా పాదయాత్ర ప్రారంభించింది తమకు సీఎం జగన్ న్యాయం చేస్తాడని తమ సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లాలని యాత్ర ప్రారంభించారు.

    ఇది చదవండి: ప్లీనరీలో జగన్ చేసే ప్రకటన ఇదేనా..? ఆ నేతలకు షాక్ తప్పదా..? వైసీపీలో జోరుగా చర్చ..


    ఐతే గత రాత్రి యాత్ర కొలనుకొండ గుంటూరు జిల్లా కొలనుకొండ వరకు చేరింది. ఐతే అక్కడ వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తమకు న్యాయం చేసేవరకు అక్కడ నుండి కదలమని తమ ఇంటికి వచ్చే దారికి అడ్డంగా నిర్మించిన గోడను తొలగించేవరకు తిరిగి వెళ్లేది లేదని భీష్మించుకొను కూర్చున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి బలవంతంగా వారి సొంత గ్రామమైన బొడ్డువానిపాలెంకు తరలించారు.



    తమ సమస్యను స్థానిక అధికారులు పట్టించుకోకపోతే సీఎంకు చెప్పుకుందామని వస్తే.. తమను అరెస్ట్ చేయించడం ఎంతవరకు న్యాయమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఘటనపై ప్రతిపక్షాల కూడా మండిపడుతున్నాయి. ప్రజలకు కష్టాలు చెప్పుకునే అవకాశాని కూడా సీఎం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నాయి.



    అసలే జరిగిందంటే.. కొరిశ‌పాడు మండ‌లం బొడ్డువానిపాలేనికి కు చెందిన దళిత టీచర్ సుధారాణి.. దివ్యాంగురాలు. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఐతే తమ ఇంటికి వెళ్లే దారిని స్థానిక వైసీపీ నేత కబ్జా చేయడమే కాకుండా అడ్డంగా గోడ నిర్మించేశాడు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. స్థానిక నేతలు కూడా అటువైపు చూడలేదు. దీంతో చేసేది లేక వీల్ ఛైర్లోనే స్వగ్రామం నుంచి తాడేపల్లికి బయలుదేరారు. ఐతే ఆమెను, ఆమె పిల్లల్ని పోలీసులు అడ్డుకొని బలవంతంగా ఇంటికి తరలించారు. దీనిపై టీడీపీ నేత నారా లోకేష్ కూడా స్పందించారు. వైసీపీ నేతలే ప్రజల ఆస్తులను కాజేస్తుంటే సీఎం స్పందించడం లేదని ఆయన మండిపడ్డారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Police, Tadepalli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు