హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Amaravathi Protest: అమరావతి ఉద్యమం పక్కదారి పడుతోందా..? ఆ కాంట్రవర్సీలో తలదూర్చాల్సిన అవసరమేంటి..?

Amaravathi Protest: అమరావతి ఉద్యమం పక్కదారి పడుతోందా..? ఆ కాంట్రవర్సీలో తలదూర్చాల్సిన అవసరమేంటి..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఉద్యమం అంటే సరైన దారిలో వెళ్లాలి. ఉద్యమం ఎందుకు పుట్టిందో దాని కోసం నిబద్ధతతో పోరాడాలి. కొన్నిసార్లు దారితప్పితే మాత్రం విమర్శల పాలవక తప్పదు.

  అన్నా రఘు, గుంటూరు ప్రతినిధి, న్యూస్18

  ఉద్యమం అంటే సరైన దారిలో వెళ్లాలి. ఉద్యమం ఎందుకు పుట్టిందో దాని కోసం నిబద్ధతతో పోరాడాలి. కొన్నిసార్లు దారితప్పితే మాత్రం విమర్శల పాలవక తప్పదు. ప్రస్తుతం అలాగే ఉంది అమరావతి పరిరక్షణ సమితి తీరు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాలవ విషయంలో వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇటు వైసీపీ, అటు టీఆర్ఎస్ మంత్రులు, నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదిలా ఉంటే సందట్లో సడేమియా అన్నట్లు బుధవారం అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు కృష్ణాజలాల విషయంలో వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ తన వైఖరి తెలియజేయాలంటూ హైదరాబాద్ లోటస్ పాండ్లోని వై.ఎస్,షర్మిళ ఇంటి ముందు ఆందోళణ నిర్వహించడం, అక్కడి తెలంగాణ వై.ఎస్.ఆర్ పార్టీ కార్యకర్తలు వీళ్లను అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

  అసలు ఆంధ్ర - తెలంగాణ ల మధ్య కృష్ణాజలాల పంపిణీ వివాదం పరిష్కరించవలసినది ఎవరు..? ఆంధ్రప్రదేశ్ తనకు కేటాయించిన వాటా కంటే ఎక్కువ నీటిని వాడుకుంటోందని తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరలాంటప్పుడు వీళ్ళు ధర్నా చేయవలసింది ప్రగతి భవన్ లేదా తెలంగాణ భవన్ ముందు కదా..? అధికారికంగా పార్టీని ఏర్పుటు చేయని షర్మిల వర్గానికి వ్యతిరేకంగా ధర్యానం చేయడం ఏంటి..? లోటస్ పాండ్ లో ధర్నా చేస్తేనో, వై.ఎస్.షర్మిళ ఒప్పుకుంటేనో ఇరు రాష్ట్రాల సమస్య సమసిపోదు కదా..? తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ కూడా సహజంగానే తెలంగాణకే సపోర్ట్ చేస్తుంది కదా..? దీనిలో భాగంగానే ఆ పార్టీ అధ్యక్షరాలు ఓ సందర్భంలో మాకు మా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, కృష్ణా జలాల విషయంలో మాకు ఉన్న హక్కులను ఎవరికోసం వదులుకోము,అవసరమైతే ఎవరితోనైనా కొట్లాడతాం అని కుండబద్దలు కొట్టారు.

  ఇది చదవండి: తాడేపల్లి బాధితురాలికిచ్చిన చెక్ బౌన్స్... అధికారులేమన్నారంటే..!  తమ నేత వై.ఎస్.షర్మిల మాట్లాడిన దానిలో తప్పేముంది..? ఆమె తెలంగాణ లో రాజకీయంగా చురుకుగా పాల్గొంటున్నారు. చంద్రబాబు నాయుడి లాగా తమది రెండుకళ్ళ సిద్ధాంతం అంటూ ప్రజలని మభ్య పెట్టడం లేదు కదా..? అసలు అమరావతి పరిరక్షణ సభ్యులకి రాయలసీమ రైతులపై నిజంగా అంత ప్రేమే ఉంటే..నిన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి హైదరాబాద్ లోనే ఉంటున్న చంద్రబాబు నాయుడి వైఖరి ఏంటో ముందుగా చెప్పించి ఆ తర్వాత మిగిలిన పార్టీల వైఖరి గురించి నిలదీయాలని వై.ఎస్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

  ఇది చదవండి: ప్రధాని వద్దకి నీటి పంచాయతీ... తాడోపేడో తేల్చుకునేందుకు ఏపీ సై  తగదునమ్మా అంటూ వచ్చి ఇక్కడ నాటకాలు వేయడం సరికాదని,రాయలసీమ ను అక్కడి ప్రభుత్వం న్యాయ రాజధానిగా ప్రకటిస్తే ఆ ప్రాంతానికి హైకోర్టు తరలించడానికి వీల్లేదంటూ 550 రోజులుగా దీక్షలు, ధర్నాలు, ధర్మపోరాటాలు చేస్తున్న అమరావతి పరిరక్షణ సమితి ఇప్పుడు సడన్ గా వచ్చి సీమ హక్కులు, సీమ రైతులు అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. ఏది ఏమైనా అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు రాయలాసీమ రైతులపై ఒలకబోస్తున్న ప్రేమ చూస్తుంటే...

  "ఆత్మశుద్ధిలేని యాచార మదియేల

  భాండశుద్ధి లేని పాకమేల?

  చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా?

  విశ్వదాభిరామ వినురవేమ"

  అని వేమన శతకంలో చెప్పినట్టు అనిపించక మానదు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Amaravati, Andhra Pradesh, Krishna River, YS Sharmila

  ఉత్తమ కథలు