హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Crime News: మంచి ఉద్యోగం.. చేతి నిండా సంపాదన అంటూ ల్యాప్ టాప్ ఇచ్చారు.. అక్కడే ఊహించని ట్విస్ట్

Crime News: మంచి ఉద్యోగం.. చేతి నిండా సంపాదన అంటూ ల్యాప్ టాప్ ఇచ్చారు.. అక్కడే ఊహించని ట్విస్ట్

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Crime News: ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకూ సైబర్ చీటర్ ల ఆగడాల పెరుగుతున్నాయి. ఉద్యోగం పేరుతో ఓ యువతిని నిండా ముంచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మంచి ఉద్యోగం అన్నారు.. చేతి నుండా సంపాదన అని చెప్పారు. ల్యాప్ టాప్ కూడా ఇచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

ఒక సినిమాలో రావు గోపాలరావు  చెప్పిన  డైలాగ్ నేటి పరిస్థితులకు అద్దం పడుతోంది. మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం.. మోసం చేసే వాళ్ళు ఉంటారు.. అవును అది నిజమే అనేలా చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.. సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తున్నా..? నేరాలకు పెరుగుతూనే ఉన్నాయి. చేసిన మోసం చేయకుండా కొత్త కొత్త దారుల్లో అమాయకులను నిండా ముంచేస్తున్నారు. వివిధ రకాల స్కీంలతో ఆన్ లైన్ లో నిండా ముంచేసేందుకు సిద్ధంగా ఉంటారు మోసగాళ్లు.

తాజాగా పొన్నూరుకు చెందిన యువతి ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉంది.ఆలా ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా తమిళనాడు లోని చెంగల్ పట్టు ప్రాంతానికి చెందిన ఓ అనే సంస్థ కు చెందిన ప్రకటన ఆన్లైన్ లో చూసి వారిని సంప్రదించింది. ఆ సంస్థ కు చెందిన కృష్ణ అనే ఉద్యోగి ఆమెను సంప్రదించాడు. ఆమెను తన దరకాస్తు తో పాటు పాన్ కార్డు.. ఆధార్ కార్డుతో సహా ఇతర వివారాలు  పంపమని చెప్పాడు.. దీంతో ఆ యువతీ కృష్ణ అడిగిన అన్నిటినీ పంపింది.

తరువాత  ఆన్ లైన్ లో నే ఇంటర్వ్యూ చేసి ఏడాదికి  నాలుగు లక్షల రూపాయల జీతం అని.. కానీ నాలుగు నెలల పాటు శిక్షణ ఉంటుందని శిక్షణ తరువాత ఉద్యోగం అని చెప్పారు.. ఆ యువతీ సరే అనడంతో కొద్దీ రోజులకు ల్యాప్ టాప్  ఇంటికి కొరియర్ ద్వారా పంపారు.

అలాగే తనతో పాటు  చేరిన బ్యాచ్ మొత్తానికి త్వరలో శిక్షణ ప్రారంభిస్తామని చెపుతున్నారు.. కానీ ఆరు నెలలు గడిచిన శిక్షణ ప్రారంభించలేదు.కంపెనీలో వాకబు చేయగా త్వరలో ప్రారంభిస్తామని చెబుతూ వస్తున్నారు. అంతలోనే విజయవాడ కు చెందిన విద్యార్థుల కు రుణాలిచ్చే సంస్థ నుండి ప్రతినిధి యువతీ ఇంటికి వచ్చి మీరు విద్యారుణం తీసుకున్నారని ఇంకా ఏడూ వాయిదాలు బకాయి ఉన్నాయని బకాయి మొత్తం రెండు లక్షల ముప్ఫయివేల రూపాయలు అని మొత్తం వెంటనే చెల్లించక పోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అయితే యువతీ వెంటనే ఓ కంపెనీ ప్రతినిధులను సంప్రదించింది. అయితే ఆ  ప్రతినిధులు వాయిదాలు తాము  చెల్లిస్తామని ఎలాంటి ఉండదని భరోసా ఇస్తూ నమ్మకంగా చెప్పారు.  కానీ కొద్దిరోజుల తరువాత మళ్లీ ఆ సంస్థ వారు ముంబై నుండి లాయర్ నోటీసు యువతికి పంపించారు. ఆ సంస్థ మేనేజర్ ఫోన్ చేసి జనవరి ఐదు లోపు ఋణం చెల్లించాలని లేక పోతే బ్యాంకు లో చెక్ లు వేసి కేసు పెడతామని బెదిరించారు.

వేధింపులు తట్టుకోలేని యువతీ పోలీస్ లను సంప్రదించింది. యువతీ తానేమి చెక్ లు ఇవ్వలేదని ఎటువంటి సంతకాలు చేయలేదని అసలు తాను రుణమే తీసుకో లేదని పోలిసుల వద్ద వాపోయింది.. తన పేర ఋణం తీసుకొని మోసంచేనా వారిని శిక్షించాలని కోరుతోంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, CYBER CRIME, Guntur

ఉత్తమ కథలు