Home /News /andhra-pradesh /

AP POLITICS CPI NARAYANA TENDERS APOLOGIES FOR CRITICIZING MEGASTAR CHIRANJEEVI FULL DETAILS HERE PRN

CPI Narayana-Chiranjeevi: మీకో దండం.. నన్ను క్షమించండి..! చిరంజీవికి సారీ చెప్పిన సీపీఐ నారాయణ..!

మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణ చెప్పిన సీపీఐ నారాయణ

మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణ చెప్పిన సీపీఐ నారాయణ

సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ (CPI Narayana).. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. ఇటీవల తిరుపతి (Tirupati) లో మీడియాతో మాట్లాడిన నారాయణ.. చిరంజీవి, పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
    సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ (CPI Narayana).. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. ఇటీవల తిరుపతి (Tirupati) లో మీడియాతో మాట్లాడిన నారాయణ.. చిరంజీవి, పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై చిరంజీవి అభిమానులు ఆయనపై మండిపడ్డారు. కోనసీమలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్లిన నారాయణను చిరంజీవి అభిమానులు నిలదీశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన నారాయణ.. చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అది భాషా దోషంగానే భావించాలని.. ఆ వ్యాఖ్యలకు తాను చింతిస్తున్నానని చెప్పారు. మెగా అభిమానులు, కాపునాడు మహానుభావులు ఈ వ్యాఖ్యలు ఇంతటితో మరచిపోవాలని నారాయణ విజ్ఞప్తి చేశారు. తాను వివాదాలకు పోదల్చుకోలేదని.. ఈ వివాదాన్ని ఇంతటి వదిలేయాలని కోరారు.

    సోమవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సీపీఐ నారాయణ.. భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామ రాజు జయంతి వేడుకలకు చిరంజీవి హాజరవడాన్ని తప్పుబడుతూ..ఆయన ఊసరవెల్లి లాంటివాడంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. చిరంజీవికి బదులు సూపర్ స్టార్ కృష్ణను పిలిచి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. దీంతో నారాయణపై మెగా అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

    ఇది చదవండి: బెజవాడలో కేశినేని బ్రదర్స్ వార్..! దేనికైనా రెడీ.. నానికి చిన్ని ఛాలెంజ్..!


    మరోవైపు దీనిపై నాగబాబు కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. "ఇటీవలి కాలంలో మెగా అభిమానులు మరియు జనసైనికులు కొంత మంది చేసిన తెలివితక్కువ వెర్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కానీ మన కుర్రాళ్ళకి నేను చెప్పదలుచుకొందేంటంటే ఈ సిపిఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుండి అన్నం తినడం మానేసి కేవలం ఎండి గడ్డి మరియు చెత్తా చెదారం తింటున్నాడు. కాబట్టి మన మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక విన్నపం ఏమిటనగా.. దయచేసి వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి...కాస్త అన్నం పెట్టండి ...! తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు." అంటూ ట్వీట్ చేశారు.




    ఇది చదవండి: పవన్ వర్సెస్ గంటా.. ఆసక్తిని రేకెత్తిస్తున్న గాజువాక వార్.. 2024లో హైలెట్ ఇదేనా..?


    నారాయణ క్షమాపణలు కోరిన తర్వాత కూడా నాగబాబు ఓ ట్వీట్ చేశారు. " తప్పు ఎవరు చేసినా సరే.. ఒకసారి క్షమాపణలు కోరితే క్షమించండి మన మెగా జనసైనికుల ధర్మం. కాబట్టి సీపీఐ నారాయణ పెద్ద వయస్సును దృష్టిలో ఉంచుకుని ఆయనను ట్రోల్ చేయడం మానుకోవాలని మన మెగా జనసైనికులందరినీ కోరుతున్నాను" అని నాగబాబు పేర్కొన్నారు.





    మొత్తానికి నారాయణ కావాలని చేశారో.. లేక పొరబాటున నోరు జారారో తెలియదుగానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఆయనకు గట్టి షాకే ఇచ్చారు. సోషల్ మీడియాతో పాటు డైరెక్ట్ గానే ఆయన్ను నిలదీయడంతో చివరకు దండంపెట్టేశారు. నారాయణ లాంటి వ్యక్తి చిరంజీవి లాంటి వ్యక్తిపై వ్యాఖ్యలు చేసేముందు కాస్త ఆలోచించి మాట్లాడాలని పలువురు హితవుపలికారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, CPI Narayana, Megastar Chiranjeevi

    తదుపరి వార్తలు