Home /News /andhra-pradesh /

AP POLITICS CPI NARAYANA MADE SHOCKING COMMENTS ON MEGASTAR CHIRANJEEVI AND JANASENA CHIEF PAWAN KALYAN FULL DETAILS HERE PRN

CPI Narayana: ఒకరు ఊసరవెల్లి, ఒకరు ల్యాండ్ మైన్.. చిరు, పవన్ పై సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్, సీపీఐ నారాయణ, చిరంజీవి (ఫైల్)

పవన్ కల్యాణ్, సీపీఐ నారాయణ, చిరంజీవి (ఫైల్)

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) తరచూ సంచలన కామెంట్స్ చేస్తుంటారు. సమకాలీన అంశాలపై స్పందిస్తూ కేంద్ర రాష్ట్రప్రభుత్వాలపై మండిపడుతుంటారాయి. ఒక్కోసారి నారాయణ చేసే కామెంట్స్ వార్తల్లో హైలెట్ అవుతుంటాయి.

    సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) తరచూ సంచలన కామెంట్స్ చేస్తుంటారు. సమకాలీన అంశాలపై స్పందిస్తూ కేంద్ర రాష్ట్రప్రభుత్వాలపై మండిపడుతుంటారాయి. ఒక్కోసారి నారాయణ చేసే కామెంట్స్ వార్తల్లో హైలెట్ అవుతుంటాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రధాన పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే (NDA) కు మద్దతివ్వడంపై మాట్లాడిన ఆయన.. టీడీపీ (TDP), వైసీపీ (YSRCP)పై ధ్వజమెత్తారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), ఆయన తమ్ముడు జనసేన (Janasena Party) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం తిరుపతిలోమ ట్లాడిన నారాయణ.. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవి హాజరవడాన్ని ఆయన తప్పుబట్టారు. చిరంజీవి ఊసరవెల్లి లాంటివాడంటూ హాట్ కామెంట్స్ చేశారు.

    అల్లూరి విగ్రహావిష్కరణకు సూపర్ స్టార్ కృష్ణను వేదికమీదకు తీసుకొచ్చి ఉంటే బాగుండేదని.. అలా కాకుండా ఊసరవెల్లిలా ప్రవర్తించే చిరంజీవిని తీసుకెళ్లడమేంటని ప్రశ్నించారాయన. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా నారాయణ విమర్శించారు. పవన్ కల్యాణ్ ఓ ల్యాండ్ మైన్ లాంటివాడని.. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలియదంటూ సెటైర్లు వేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిందేమీ లేకపోయినా.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి ఎన్ని పార్టీలు ఎందుకు మద్దతిస్తున్నాయంటూ ప్రశ్నించారు. ఢిల్లీలోని బీజేపీ నేతలు బ్లాక్ మెయిలింగ్ కు ఏపీ నేతలు భయపడి ఇలా చేస్తున్నారన్నారు.

    ఇది చదవండి: పవన్ వర్సెస్ గంటా.. ఆసక్తిని రేకెత్తిస్తున్న గాజువాక వార్.. 2024లో హైలెట్ ఇదేనా..?


    ఏపీ రాజధాని అంశంపైనా నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇంకా హైదరాబాదే ఏపీ రాజధాని అని భావిస్తోందని.. రాష్ట్రానికి విజయవాడ రాజధాని అనే భావనను పోగొడుతోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఉండాలన్న ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి లేదన్న నారాయణ.. జగన్ తీరుతో రాష్ట్రం నష్టపోతుందన్నారు. తెలుగు రాష్ట్టాల మధ్య వివాదాలు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి పై జనసేన చేస్తున్న ఉద్యమాన్ని నారాయణ స్వాగతించారు.



    గోదావరి నదికి సంభవించిన వరదలకు కారణం.. రాష్ట్ర ప్రభుత్వ నిఘా వైఫల్యమేనన్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగాలో వరదలు ముంచెత్తాయని.. బాధితులను ఆదుకోవడంతో సర్కార్ ఫెయిలైందన్నారు. వరదల కారణంగా నష్టపోయిన వారికి ఇల్లు కట్టించి ఇవ్వాలని.. వారికి ఆర్ధికసాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ఎన్నికలు, వరదలపై నారాయణ ప్రభుత్వాన్ని విమర్శించడం సరేగానీ.. ఇందులో చిరంజీవి, పవన్ కల్యాణ్ పై విమర్శలు చేయాల్సిన అవసరం ఏముందని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, CPI Narayana, Megastar Chiranjeevi, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు