సంక్రాంతి(Sankranti)పండుగకు కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు,ముగ్గుల పోటీలు నిర్వహించుకోవడం చూశాం. కాని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కి చెందిన ఓ మంత్రి లాటరీ(Lottery)ద్వారా సంక్రాంతి లక్కీ లాటరీ నిర్వహిస్తున్నారే ఆరోపణలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)ఫోటోతో ముద్రించిన లక్కీ లాటరీ టికెట్లను సత్తెనపల్లి (Sattenapally)నియోజకవర్గంలో కొందరు అమ్ముతున్నారని జనసేన(Janasena)పార్టీ ఆరోపించింది. వంద రూపాయలు కట్టి లక్కీ డీప్‌లో లక్ష రూపాయలు గెలుచుకోమంటూ వైసీపీ నేతలు ప్రజల్ని మోసం చేస్తున్నారని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు (Gade Venkateswara Rao)పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో గుంటూరు కోర్టు(Guntur Court)ను ఆశ్రయించారు. ఫిర్యాదుపై స్పందించిన కోర్టు ఈ ఘటనపై జనసేన నేతల ఫిర్యాదు స్వీకరించి విచారణ ప్రారంభించాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.
ఏపీ మంత్రిపై పోలీస్ కంప్లైంట్..
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు వైఎస్ఐఆర్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో లాటరీ టికెట్లను తన అనుచరులు, వైసీపీ నేతల ద్వారా విక్రయిస్తున్నారని జనసేన నేతలు ఆరోపించారు. సత్తెనపల్లె నియోజకవర్గానికి చెందిన పలువురికి అక్రమ లాటరీ ముసుగులో టిక్కెట్లు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో లాటరీలు నిషేధించబడినప్పటికీ, ఇప్పటికీ టిక్కెట్లు పంపిణీ చేయబడినట్లుగా వాటిని కొనుగోలు చేయాలని మంత్రి అంబటి రాంబాబే స్వయంగా ప్రజలను ఒప్పించారని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తెలిపారు.
సంబరాల పేరుతో అక్రమ లాటరీ..
వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో ఒక్కొక్కరి దగ్గర నుంచి వంద రూపాయలు వసూలు చేసి ఈనెల12 గురువారం సాయంత్రం 4గంటలకు లక్కీ డ్రా నిర్వహిస్తామని ..లాటరీలో పేర్లు వచ్చిన వాళ్లకు ఆకర్షణీయమైన లక్షల విలువ చేసే బహుమతులు అందజేస్తామని ప్రచారం చేయడం..లాటరీ టికెట్లను అంటగడుతున్నారని జనసేన నేతలు ఆరోపించారు. ఈ లాటరీకి వైఎస్ఆర్ సంక్రాంతి లాటరీ పేరు పెట్టడమే కాకుండా ...మంత్రి అంబటి రాంబాబు,నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఫోటోలు ముద్రించి మరీ వైసీపీ నేతలు విక్రయిస్తున్నారంటూ జనసేన నేతలు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
విచారణకు ఆదేశం..
అక్రమ లాటరీ ముసుగులో వైసీపీ నేతలు ప్రజల నుంచి డబ్బులు దండుకోవాలని చూస్తున్నారని ..ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న మంత్రిపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు ఫిర్యాదు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోలేదు. దీనిపై జనసేన నాయకులు కోర్టును ఆశ్రయించారు. జేఏస్పీ నేతలు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.