AP POLITICS COUNTDOWN FOR ATAMKUR BY POLL YCP AND BJP WILL FIGHT TWO CANDIDATES ALREADY START CAMPAIGN NGS
AP By poll: ఏపీలో బై పోల్ పై ఉత్కంఠ.. ఏకగ్రీవం అనుకున్న చోట.. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఢీ..
మేకపాటి విక్రమ్ రెడ్డి (ఫైల్)
AP By poll: ఏపీలో మరో బై పోల్ ఉత్కంఠ పెంచుతోంది. మొన్నటి వరకు ఆ సీటు ఏకగ్రీవమే అని అంతా భావించారు.. అయితే వైసీపీ తమ అభ్యర్థిని మార్చడంతో ఇప్పుడు పోటీ తప్పేలా లేదు.. అది కూడా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీకి సై అంటే సై అంటున్నారు..?
AP By poll: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరో బై పోల్ (Bypoll) జరగనుంది. మేకపాటి గౌతంరెడ్డి (Mekapati Goutam Reddy) ఆకస్మిక మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీకి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. అయితే మేకపాటి గౌతమ్ రెడ్డికి.. విపక్షాలతో మంచి సబంధాలే ఉన్నాయి. సౌమ్యుడిగా పేరుంది. అలాంటి వ్యక్తి మంచి వయసు ఉండగానే మరణించడం రాజకీయ వర్గాల్లో పెను విషాదం నింపింది. దీంతో ఆయనపై విపక్షాల్లో సైతం సానుభూతి ఉంది. అందుకే గౌతంరెడ్డి వారసురాలిగా ఆయన సతీమణి శ్రీకీర్తి (Srikeerthi) రాజకీయాల్లోకి వస్తారని భావించారు. శ్రీకీర్తి అభ్యర్థి అయితే టీడీపీ (TDP) కూడా తమ అభ్యర్థిని పెట్టబోమని సంకేతాలు ఇచ్చింది. దీంతో ఉపఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అందరూ అనుకున్నారు. ఇప్పుడు అనూహ్యంగా రాజకీయాలు మారుతున్నాయి. గౌతమ్ రెడ్డి భార్య శ్రీకీర్తి కాకుండా ఆయన సోదరుడు విక్రంరెడ్డి (Vikram Reddy)ని అభ్యర్థిగా ఉంటారని వైసీపీ (YCP) ప్రకటించింది. మరోవైపు రాజమోహన్ రెడ్డి (Raja Mohan Reddy) సోదరి కుమారుడు బిజీ వేముల రవీంద్రరెడ్డి (GB Vemula Ravindra Reddy) సైతం తాను ఉప ఎన్నికలో పోటీ చేస్తానని బహిరంగంగానే చెప్పారు. ఆయన బీజేపీ (BJP) అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. ఒకవేళ బీజేపీ సీటు ఇవ్వకపోతే స్వతంత్య్ర అభ్యర్థిగా అయినా పోటీకి రెడీ అన్నారు. అలాగే ఉదయగిరి, ఆత్మకూరులలో అభివృద్ధికి తన మేనమామ రాజమోహన్ రెడ్డి ఏమీ చేయలేదని విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నట్టు రవీంద్రరెడ్డి చెప్పారు. మేకపాటి సోదరులు అక్రమాలకు పాల్పడ్డారని.. రాజకీయాల ద్వారా వ్యాపారాలను పెంచుకున్నారని ఆరోపించిన రవీంద్రరెడ్డి..
ఆత్మకూరు బరిలో బీజేపీ పోటీ పడుతుందని.. అభ్యర్థిగా రవీంద్రరెడ్డి పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు (Somu Veerraju) కూడా పరోక్ష సంకేతాలు ఇస్తున్నారు. దీంతో ఉపఎన్నిక ఆసక్తిగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా పోటీ మేకపాటి కుటుంబ సభ్యుల మధ్యే జరిగే అవకాశాలు ఉండటంతో.. విమర్శలు ప్రతివిమర్శల జోరుగా ఉండొచ్చు.. ప్రస్తుతం బీజేపీతో జనసేనకు పొత్తు ఉండడంతో.. బీజేపీ అభ్యర్థి నిలబెడితే జనసేన మద్దతు కూడా ఇవ్వాలి.. అందుకే ఈ ఉప ఎన్నికలను బీజేపీ, జనసేన పార్టీలు తమ బలనీరూపనకు వేదికగా చూసే అవకాశం ఉంది.
ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రంరెడ్డి ప్రచారాన్ని ప్రారంభించారు. తన తండ్రితో కలిసి ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సమావేశం భారీగానే నిర్వహించడం చర్చగా మారుతోంది. వీటిని పరోక్షంగా తమ బల ప్రదర్శనకు వేదిగా మార్చుకుంటున్నారు మేకపాటి కుటుంబ సభ్యులు. గతంలో కంటే ఉపఎన్నికలో ఎక్కువ మెజారిటీ సాధించలన్నది మేకపాటి కుటుంబ సభ్యుల వ్యూహం. ప్రత్యర్థిగా తమ కుటుంబానికే చెందిన రవీంద్రరెడ్డి సవాల్ చేస్తుండటంతో రాజమోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. పనిలో పనిగా రవీంద్రరెడ్డి సైతం మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానికంగా తనకున్న పరిచయాలతో ఆయన పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ తనను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పూర్తిస్థాయిలో ప్రచారం షెడ్యూల్ ప్రకటిస్తానని రవీంద్రరెడ్డి చెబుతున్నారట.
అయితే ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే.. ఒకప్పుడు మేకపాటి ఫ్యామిలీ అంతా ఉమ్మడి కుటుంబం. అంతా కలిసే వ్యాపారాలు చేసేవారు. వ్యాపార లావాదేవీల వల్ల రవీంద్రారెడ్డి ఫ్యామిలీకి మేకపాటి విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి ఈ కుటుంబాల మధ్య సత్సంబంధాలు లేవు. 2014లో రవీంద్రారెడ్డి ఎంపీ ఎన్నికల్లో మేకపాటికి వ్యతిరేకంగా పనిచేశారు. చెన్నై కేంద్రంగా వ్యాపారాలు చేసే రవీంద్రారెడ్డి రంగంలోకి దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. పాత కక్షలన్నింటినీ ఈ ఉపఎన్నికలో తీర్చుకోవాలని చూస్తున్నారట. బీజేపీకి కూడా అక్కడ అభ్యర్థి లేడన్న సమస్య తీరనుంది. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అనే బీజేపీ పోటీకి రెడీ అవుతోంది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.