హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala Temple: ఎన్నికల ప్రచారంలోకి శ్రీవారి లడ్డూలు తీసుకొచ్చిందెవరు..? టీటీడీకి తెలయకుండానే జరిగిందా..?

Tirumala Temple: ఎన్నికల ప్రచారంలోకి శ్రీవారి లడ్డూలు తీసుకొచ్చిందెవరు..? టీటీడీకి తెలయకుండానే జరిగిందా..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) ప్రచారంలో తిరుమల శ్రీవారి లడ్డూల (Tirumala Laddu Prasadam) పంపిణీ అంశం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) ప్రచారంలో తిరుమల శ్రీవారి లడ్డూల (Tirumala Laddu Prasadam) పంపిణీ అంశం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) ప్రచారంలో తిరుమల శ్రీవారి లడ్డూల (Tirumala Laddu Prasadam) పంపిణీ అంశం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది

  ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో తిరుమల శ్రీవారి లడ్డూల పంపిణీ అంశం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. నాలుగో విడత ఎన్నికల ప్రచారం సమయంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పలు గ్రామ పంచాయతీల్లో శ్రీవారి లడ్డూల పంపిణీ చేసిన సంగతి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల, చంద్రగిరి మండలం తొండవాడ గ్రామాలతో పాటు చుట్టుపక్కల పంచాయతీల్లోనూ ఓటర్లకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. అలాగే రేషన్ సరుకుల డోర్ డెలివరీ వాహనాల్లోనే ఇంటింటికీ పంపిణీ చేయడం కూడా తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఐతే తిరుమల భక్తులకు మాత్రమే అందించే లడ్డూలు ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఎలా వచ్చాయన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. దీనిపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  కొందరు అధికార పార్టీకి చెందిన నేతలు తిరుమల నుంచి పెద్ద ఎత్తున లడ్డూ ట్రేలను తీసుకొచ్చి వాటిని కవర్లలో పెట్టి.. ఓటర్లకు పంచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ వ్యవహారంపై ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, డబ్బుతో పాటు శ్రీవారి ప్రసాదాన్ని కూడా వినియోగించడంపై భక్తులు మండిపడుతున్నారు.

  తిరుమల శ్రీవారి పోటులో లడ్డూలు తయారు చేసి వాటి సైజుల వారీగా ట్రేలలో పెట్టి విక్రయిస్తారు. తిరుమలలో కాకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లోనూ కరోనాకు ముందు విక్రయాలు సాగించారు. లాక్ డౌన్ సడలింపులు ప్రారంభమైన తర్వాత పలుచోట్ల స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని టీటీడీ విక్రయించింది. ఇతర ప్రాంతాలకు కేవలం టీటీడీకి చెందిన వాహనాల్లో మాత్రమే లడ్డూలను తరలిస్తారు. టీటీడీ అధికారులు గానీ, ఇతర సిబ్బంది గానీ వ్యక్తిగత అవసరాల కోసం లడ్డూలను తరలించే అవకాశం లేదు.

  ఇది చదవండి: పరుగులు పెడుతున్న పోలవరం... ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం..


  సాధారణ భక్తులకు కూడా తిరుమలలో కోటా ప్రకారమే లడ్డూలు ఇస్తారు. ఎక్కువ సంఖ్యలో కావాలంటే ఒకే కుటుంబంలో నలుగురైదుగురు గంటల తరబడి క్యూలో నిల్చొని లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ పంచాయతీ ఎన్నికల సందర్భంగా లడ్డూలను కింద భారీగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. అసలు వారి చేతికి లడ్డూలు ఎలా వచ్చాయి..? భారీస్థాయిలో లడ్డూలు తరలివెళ్లినా టీటీడీ అధికారులు పట్టించుకోలేదా..? అనే ప్రశ్నలకు సమాధానాలు కరువయ్యాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాయి.  మరి తన ప్రసాదాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకున్నదెవరో ఆ  ఏడుకొండల వాడికే తెలియాలి.

  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, Gram Panchayat Elections, Local body elections, Tirumala, Tirumala news, Tirumala tirupati devasthanam, Tirupati, Ttd, Ttd news

  ఉత్తమ కథలు