GT Hemanth Kumar, Tirupathi, News18
Kanipakam: కాణిపాకం (Kanipakam) శ్రీ వరసిద్ధి వినాయక స్వామి (Lord Vinayaka Swamy Temple) వారి ఆలయం వరుస వివాదాలతో సతమతం అవుతోంది. ఆలయ అర్చకుల వివాదం మరువక ముందే.. తిరుమల (Tirumala)లో కాణిపాకం సిబ్బంది శ్రీవారి దర్శన బ్లాక్ టిక్కెట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఏఈవో లెటర్ హెడ్ పై తీసుకున్న 12 సుపథం టిక్కెట్ల (Supatham Tickets) ను 38,000 వేలకు విక్రయించాడు కాంట్రాక్టు ఉద్యోది. ఎవరికీ అనుమానం రాకుండా భక్తులను తిరిగి పంపే ప్రయత్నం చేసాడు. శ్రీవారి దర్శనం విషయంలో సంతృప్తి చెందని భక్తులు చేసిన పనికి.. విషయం వెలుగులోకి వచ్చింది.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు కరుణాకరన్. పేరుకేమో గ్యాస్ ఆపరేటర్.. కానీ తిరుమలలో మాత్రం తాను కాణిపాకం ఆలయ పిఆర్వో గా చలామణి అవుతూ వచ్చాడు. వివిధ లేటర్లను తీసుకొచ్చి.... అటు జేఈవో కార్యాలయంలోనూ... ఇటు చైర్మన్ కార్యాలయంలోనూ టిక్కెట్లు పొందుతూ వచ్చేవాడు. అదే సమయంలో ఆ టిక్కెట్లను సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు విక్రయిస్తూ వచ్చే వాడు.
గతంలో కాణిపాకం ఈవోగా విధులు నిర్వహిస్తున్నా వెంకటేశు తన కుటుంబ సభ్యులకు దర్శనం కల్పించాలని టీటీడీకి లెటర్ పంపాడు. అందులో మరో ముగ్గురి పేర్లు చేర్చిన కరుణాకర్ వారి దగ్గర అధిక డబ్బును గుంచినట్లు సమాచారం. ఈవో కుటుంబ సభ్యులతో పాటు వీరు ఎవరు అని విజిలెన్స్ సిబ్బంది ప్రశ్నించడంతో మూడు టిక్కెట్లు అమ్మేసిన ఉదంతం వెలుగు చూసింది. ఈవోగా ఉన్న తన పరువు పోతుందని విజిలెన్స్ సిబ్బందిని వెంకటేశు విన్నవించడంతో కరుణాకర్ ను మందలించి వదిలేసారు విజిలెన్స్ అధికారులు.
కాణిపాకం ఆలయ ఏఈవోగా విధులు నిర్వహిస్తున్న మాధవ్ రెడ్డి తో కరుణాకర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒకే ఆలయంలో పనిచేస్తున్న వ్యక్తులు కావడంతో ఏఈవోతో మరింత స్నేహపూర్వకంగా మెలిగే వాడు కరుణాకర్. మాధవ్ రెడ్డి దగ్గర లెటర్ హెడ్ పొందిన కరుణాకర్ కర్ణాటక రాష్ట్రం చింతామణికి చెందిన కేశవమూర్తి కుటుంబ సభ్యులను సంప్రదించాడు. శ్రీవారి దగ్గర కూర్చొని ఉండే సేవ టిక్కెట్లు తీసిస్తానని నమ్మబలికాడు.
ఇదీ చదవండి : ఏపీలో ప్రజలకు షాక్.. నవంబర్ 1 నుంచి పాల ధర పెంపు.. అర లీటర్ పై ఎంత పెరిగిందంటే?
ఒక్కో టికెట్ ధర 6000 వేల రూపాయలుగా బేరమాడాడు. చివరికి ఒక్కో టికెట్ ధర 3300గా నిశ్చయించాడు. కానీ ఆ భక్తులను సుపథం టిక్కెట్ల ద్వారా దర్శనానికి తీసుకెళ్లాడు. సేవ అని చెప్పి... సుపథంకి తీసుకెళ్లాడని కరుణాకర్ పై పోలీసులకు పిర్యాదు చేసాడు కేశవమూర్తి. దింతో కరుణాకర్ ను అదుపులోకి తీసుకోని విచారణ చేపడుతున్నారు పోలీసులు. ఈ టిక్కెట్ల స్కాంకు సంబంధించి కాణిపాకం ఆలయ ఏఈవో మాధవ్ రెడ్డిని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు పోలీసులు.
ఇదీ చదవండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ఏపీకి లింకు.. నారాయణ విద్యాసంస్థల్లో సింహయాజీ స్వామి పని చేశారా?
ఈ ఘటనపై కాణిపాకం ఆలయ ఈవో రాణాప్రతాప్ ను సంప్రదించగా "ఎఫ్ఐఆర్ కాపీ ఆధారంగా ఏఈవోపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏఈవో తప్పు చేసినట్లు ఎఫ్ఐఆర్ కాఫీలో పోలీసులు నిర్ధారణకు వస్తే.. మెమోజారీ చేస్తాం. తన దగ్గర నుంచి అంజాయిషి లేఖను కోరుతమన్నారు. ఇక ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న కరుణాకర్ ను ఉద్యోగం నుంచి తొలగిస్తామని కాణిపాకం ఈవో రాణాప్రతాప్ ఫోన్ సంబాషణలో తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Tirumala tirupati devasthanam