ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు రాజీనామాల బాటలోనే రఘువీరా కూడా తమ పదవికి రాజీనామా సమర్పించారు. అయితే రఘువీరా రాజీనామాను కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఆమోదించలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి తన రాజీనామాను సమర్పించాగా, తాజాగా ఏపీసీసీ చీఫ్ పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు రఘువీరా పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Congress, AP Politics, Congress, Raghuveera Reddy